NRI-NRT

శాక్రిమెంటో తెలుగు సంఘం సంక్రాంతి వేడుకలు

TAGS Sacremento Telugu Sankranthi 2020

శాక్రమెంటో తెలుగు సంఘం (టాగ్స్) 16వ వార్షికోత్సవం మరియు సంక్రాంతి సంబరాలు శనివారం నాడు ఫాల్సం హైస్కూల్‌లో నిర్వహించారు. రంగవల్లులు, జట్కాబండి, పాలవెల్లి, గాలిపటాలతో వేడుకల వేదికను సాంప్రదాయబద్ధంగా అలంకరించారు. తియ్యాని భాష లలిత గీతాలాపన, త్యాగరాజ కృతులు, నృత్యాలు, నాటికలతో సాంస్కృతిక కార్యక్రమాలను చిన్నారులు రక్తి కట్టించారు. స్థానిక ఫాల్సం మేయర్ సారా అక్వినో, కాలిఫోర్నియా శాసనసభ సభ్యుడు కెవిన్ కైలీ, కాలిఫోర్నియా రాష్ట్ర ముఖ్య సమాచార అధికారి ఏమీ టోంగ్, రాక్లిన్ నగర కౌన్సిల్ సభ్యుడు బిల్ హలిడిన్ లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. టాగ్స్ చైర్మన్ అనిల్ మండవ, వైస్ చైర్మన్ మల్లిక్ సజ్జనగాండ్ల, ప్రెసిడెంట్ నాగ్ దొండపాటి, కోశాధికారి మోహన్ కాట్రగడ్డ, సమాచార అధికారి రాఘవ చివుకుల తదితరులు వేడుకల విజయవంతానికి కృషిచేశారు. సిలికానాంధ్ర మనబడి విద్యార్థులు చక్కని తెలుగు పద్యాలు, కధలు, పాటలు ప్రదర్శించారు. సిలికానాంధ్ర మనబడి అధ్యక్షుడు రాజు చామర్తిను టాగ్స్ కార్యవర్గం సత్కరించింది. బాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, చదరంగం తదితర పోటీలలో గెలుపొందిన విజేతలకు జ్ఞాపికలు అందించారు. 11వ తేదీన శ్రీనివాస కళ్యాణం ప్రసాదాన్ని ఈ సందర్భంగా సభికులకు పంచారు. భోగిపళ్లు కార్యక్రమంలో చిన్నారులను ఆశీర్వదించారు.