ఏపీలో జరుగుతున్న ఒకే రాష్ట్రం ఒకే రాజధాని ఉద్యమంపై, అమరావ్తినే ఏపీ రాజధానిగా కొనసాగించాలని రైతుల చేస్తున్న పోరాటంపై కేంద్రం జోక్యాన్ని కోరుతూ న్యూజెర్సీకి చెందిన ప్రవాసాంధ్రులు శనివారం నాడు న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్‌లో కాన్సులేట్ జనరల్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. రెండు నెలలుగా వేలాది మంది రైతులు చేస్తున్న ఈ ఉద్యమం ఏపీని దాటి ఢిల్లీకి పాకిందని, ప్రస్తుత ప్రభుత్వాల మొండి వైఖరి వలన రైతుల భవిష్యత్తు అంధకారం కావడంతో పాటు ఉద్యోగులు, సామాన్య ప్రజలు మూడు రాజధానుల మధ్య ప్రదక్షిణలు చేస్తూ సమయాన్ని, సంపదని వృథా చేసుకుంటారని వారు వాపోయారు. సంబంధిత విభాగానికి వీరి విజ్ఞాపన పత్రాన్ని అందజేస్తామని కాన్సులేట్ అధికారులు ఈ సందర్భంగా హామీనిచారు. కార్యక్రమంలో బాలసుబ్రహ్మణ్యం రాయుడు, తాతా పవన్, పద్మనాభ నాయుడు ఎర్లే, రాజా కసుకుర్తి, నల్లమల రాధాకృష్ణ, గోగినేని కార్తీక్, వెనిగళ్ల వంశీకృష్ణ, నూతలపాటి రమేష్, చావా పద్మ, హిమకళ వాసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
భారత కాన్సులేట్‌కు న్యూజెర్సీ ప్రవాసుల విజ్ఞప్తి
Related tags :