Movies

నయనతార దోపిడీపై నిర్మాత ఆవేదన

producer k rajan and nayanthara-Producer K Rajan Smashes Nayanthara's Expenses-నయనతార దోపిడీపై నిర్మాత ఆవేదన

మహిళా ప్రాధాన్యమున్న చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుని లేడీ సూపర్‌స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు నటి నయనతార. తాజాగా ఆమె గురించి ప్రముఖ నిర్మాత కె.రాజన్‌ షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. నయనతార అసిస్టెంట్స్‌ జీతాలు కూడా నిర్మాతే భరించాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల నిర్మాతలకు చాలా డబ్బులు ఖర్చు చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడారు. సినిమా కోసం కాకుండా నిర్మాత అదనంగా చాలా డబ్బులు ఖర్చు చేస్తుంటారని ఆయన పేర్కొన్నారు. ‘ఆరు లేదా ఏడుగురు వ్యక్తులు నయనతారకు సహాయకులుగా పనిచేస్తుంటారు. వారందరూ రోజూ నయనతారతోనే సెట్‌లో ఉంటారు. ఆ అసిస్టెంట్స్‌ ఒక్కొక్కరికీ రోజువారీ జీతం రూ.7,000 నుంచి రూ.12,000 ఉంటుంది. అసిస్టెంట్స్‌ జీతాల గురించి చాలామంది చెప్పుకోవడం విన్నాను. అది నిజమే. దీంతో ఆ సహాయకులందరి రోజు వారీ ఇచ్చే జీతం మొత్తం రూ.75000 – రూ.80000 ఉంటుంది. నిర్మాతే ఆ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. వీటితోపాటు ఇప్పుడు కారు డ్రైవర్‌, డీజిల్‌ ఖర్చులు కూడా నిర్మాతే చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ప్రతి సినిమాకు క్యారావాన్‌ ఖర్చులు చాలా ఎక్కువగా ఉంటాయి. పెద్ద సినిమాలకు ఒక్కొసారి 8 నుంచి 9 క్యారావాన్లు అవసరమవుతుంటాయి. వాటికి ఒక్కరోజు రూ.9000 నుంచి రూ.10000 చెల్లించాల్సి ఉంటుంది. ఒక సినిమా పూర్తయ్యేలోపు ఓ నిర్మాత క్యారావాన్ల కోసమే దాదాపు రూ.కోటి ఖర్చు చేయాల్సి ఉంటుంది.’ అని కె.రాజన్‌ పేర్కొన్నారు.