Movies

ఎయిర్‌టెల్ సునామీ సృష్టించిన పూజ

Puja Hegde Crushes Airtel's Nerves On Twitter

పూజా హెగ్డ్ ప్రస్తుతం తెలుగులో స్టార్ హీరోయిన్. హిందీలోనూ గ్లామర్ తో ఆకట్టుకుంటోన్న గార్జియస్ బ్యూటీ. మరి దేశ వ్యాప్తంగా పాప్యులరైన అందాల పాపకి కోపం వస్తే మామూలుగా ఉంటుందా చెప్పండి? పూజా హెగ్డే ట్విట్టర్‌లో ఎయిర్ టెల్ వారిని ఏకి పారేసింది. ఇంతకీ, మన ‘గద్దలకొండ గణేశ్’ గాళ్ ఫ్రెండ్‌కి ఎయిర్ టెల్ పై తట్టుకోలేనంత కోపం ఎందుకు వచ్చింది? కారణం చాలా మందికి ఎదురయ్యే సమస్యే! దారుణమైన నెట్ వర్క్, చిరాకు పుట్టించే కస్టమర్ సర్వీస్, ఇష్టానుసారం వేసేసే బిల్లు… ఇవన్నీ! మరి, చివరకు బుట్ట బొమ్మ ఏం చేసిందో తెలుసా? ట్విట్టర్ లో ఘాటుగా మెసేజ్ పోస్ట్ చేసింది. అదీ ఎయిర్ టెల్ కంపెనీని ట్యాగ్ చేస్తూ తన ఫాలోయర్స్ అందర్నీ మరో నెట్ వర్క్ చూసుకోమని సూచన చేసింది… పూజా లాంటి సెలబ్రిటీ కన్నెర్ర జేస్తే ఎయిర్ టెల్ లాంటి కంపెనీ మాత్రం ఏం చేస్తుందిఅమాంతం అలెర్ట్ అయిపోయి ఆమెను కాంటాక్ట్ చేశారట. పూజా చెప్పిన సమస్యలన్నీ పరిష్కరించారట. ట్విట్టర్ లోనూ పబ్లిగ్గా సారీ చెప్పారు మిస్ సామజవరగమనకి! దాంతో శాంతించిన కన్నడ బ్యూటీ మరో ట్వీట్ చేస్తూ … ఎయిర్ టెల్ ని ఫెంటాస్టిక్ అంటూ పొగిడింది. అదే ట్వీట్ లో నా ఫిర్యాదు మిగతా ఎయిర్‌టెల్‌ వినియోగదారులకు మెరుగైన సేవలు అందడానికి తోడ్పడిందని ఆశిస్తున్నానుఅని వ్యాఖ్యానించింది. అయితేఈ ట్వీట్స్ వార్ గమనిస్తోన్న చాలా మంది నెటిజన్స్ ఎయిర్ టెల్‌పై ఇంకా గుస్సాగానే ఉన్నారు. ”పూజా హెగ్డే సెలబ్రిటీ కాబట్టి వెంటనే స్పందించారు. మామూలు వాళ్లని మీరు అదే రీతిన పట్టించుకుంటారా?” అని విమర్శలు చేస్తున్నారు. మొత్తానికి అందగత్తె ఆగ్రహంతో ఎయిర్ టెల్ మాత్రం ఆగమైందనే చెప్పాలి.

Image result for puja hegde airtel