DailyDose

రేపు దిల్లీకి జగన్-తాజావార్తలు

Telugu Breaking News Roundup Today-Jagan To Go Meet Modi In Delhi

* ఏపీ సీఎం జగన్‌ రేపు మధ్యాహ్నం దిల్లీ వెళ్లనున్నారు. రేపు సాయంత్రం ప్రధాని నరేంద్రమోదీతో ఆయన భేటీ కానున్నారు. ప్రధానంగా మూడు రాజధానులు, మండలి రద్దు అంశాలపై ప్రధానితో సీఎం చర్చించే అవకాశముంది. ఈ పార్లమెంట్‌ సమావేశాల్లోనే మండలి రద్దు తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదం పొందేందుకు చొరవ తీసుకోవాలని మోదీకి జగన్‌ విజ్ఞప్తి చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు అపరిష్కృతంగా ఉన్న విభజన అంశాలు, పోలవరం నిధులపైనా ప్రధాని దృష్టికి సీఎం తీసుకెళ్లే వీలుంది. అనంతరం కేంద్రహోం మంత్రి అమిత్‌షాతో పాటు మరి కొంతమంది కేంద్రమంత్రులతోనూ జగన్‌ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. రేపు రాష్ట్ర కేబినెట్‌ భేటీ ముగిసిన వెంటనే ప్రత్యేక విమానంలో సీఎం దిల్లీకి వెళ్లనున్నారు.
* చైనాని వణికిస్తున్న కరోనా వైరస్‌ క్రమంగా విదేశాల్లోనూ విస్తరిస్తోంది. తాజాగా యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో ఉన్న ఓ భారతీయుడికి ఈ వైరస్‌ సోకినట్లు అక్కడి ఆరోగ్య శాఖ వెల్లడించింది. వైరస్‌తో బాధపడుతున్న వ్యక్తిని సంప్రదించడం వల్లే వైరస్‌ అతనికి సోకినట్లు తెలిపింది. దీంతో ఆ దేశంలో కరోనా బాధితుల సంఖ్య ఎనిమిదికి చేరినట్లు పేర్కొంది. వీరిలో ఐదుగురు చైనా వాసులు, మరో ఫిలిప్పీన్స్‌ దేశస్థుడు ఉన్నట్లు తెలిపింది. గత వారం వుహాన్‌ నుంచి దుబాయ్‌కి విహార యాత్రకు వచ్చిన నలుగురిలో వైరస్‌ ఉన్నట్లు గుర్తించారు. ఈ పరిణామాల నేపథ్యంలో వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
* ఒకప్రక్కరెండు తెలుగురాష్ట్రాలలో అమ్మయిలు,మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతుంటే మరోపక్క ఏపిలో అమ్మవారి జాతర్లుమాత్రం యువతను రెచ్చగోట్టేవిధం మారాయి.తాజాగా పశ్చిమగోదావరాజిల్లా పోడూరుమండలం శ్రీమారేమ్మ,పోలేరమ్మ అమ్మవారి జాతరలో అర్థరాత్రివరకు అర్కేస్ట్రాల మాటున అమ్మాయిలతో రికార్డింగ్ డాన్స్లు హోరేత్తాయి. సుమారు 19స్టేజీలపై ప్రోగ్రాంలలో ఇలా అమ్మాయిల నృత్యాలు కోనసాగాయి ముక్కలేనిదే మందుదిగదు చుక్క,మగువలేనిదే జాతర జరగదు అన్న చంధాన మారింది అమ్మవారి జారతరలో అమ్మయిలడాన్స్ లతొ హొరేత్తిచడంపై పలువురు మండిపడుతీన్నారు.
* పెక్షన్ లబ్దిదారుల విషయంలో ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా విశాఖలో టిడిపి ఎమ్మెల్యేలు నిరసన బాట పడుతున్నారు.తూర్పునియోజకవర్గ పరిదిలో తొలగించిన పెక్షన్లను వెంటనే పునరుద్దరించాలని డిమాండ్ చేస్తూ టిడిపి ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు పెక్షన్ లబ్దిదారులతో కలసి జీవిఎంసీ వద్ద ఆందోళప చేపట్టారు.అనంతరం వరకూ ర్యాలీగా తరలి వెళ్లిన నేతలు నేరుగా జీవిఎంసీ కమీషనర్ సృజన దృష్టికి పెక్షన్లు రాక వృద్దులు పడుతున్న ఇబ్బందులను వివరించారు.వారి నుంచి వినతులను స్వీకరించిన కమీషనర్ వాటిని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తూర్పు నియోజవర్గంపరిధిలో 3 వేలకు పైగా పెక్షన్లను తొలగించారని ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అన్నారు. అధికారులు స్పందించి తొలగించిన వాటిని పరిశీలించిన పునరుద్దరించాలని డిమాండ్ చేశారు.
* ముకుల్‌ రోహత్గీకి ఏపీ హైకోర్టు నోటీసులు
ఏపీలో మూడు రాజధానుల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. అమరావతి విషయంలో దాఖలైన కేసులను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీని నియమించింది. ఇందుకోసం ఆయనకు రూ.5కోట్లు ఫీజు చెల్లించాలని ఉత్తర్వులిచ్చింది. అయితే, రాజధాని కేసుల కోసం ముకుల్‌ రోహత్గీకి రూ.5కోట్ల ఫీజు చెల్లించడాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. రోహత్గీని నియమించడం న్యాయవాదుల చట్టానికి విరుద్ధమని శివాజీ అనే వ్యక్తి పిటిషన్‌లో పేర్కొన్నారు. పిల్‌ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం ముకుల్‌ రోహత్గీకి నోటీసులు జారీ చేసి తదుపరి విచారణను వాయిదా వేసింది.
* టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డికి భద్రతను ప్రభుత్వం తొలగించింది.గతంలో గన్‌‌మెన్‌లను 2+2 నుంచి 1 + 1 కు తగ్గించిన జగన్ ప్రభుత్వం తాజాగా పూర్తి భద్రతను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర సెక్యూరిటీ రివ్యూస్ కమిటీ ఆదేశాల మేరకు గత రాత్రి జేసీ దివాకర్‌రెడ్డికి భద్రత తొలిగిస్తున్నట్లు అధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.జేసీకి భద్రత తొలగింపు రాష్ట్రంలో సంచలనం రేపుతోంది. జేసీకి భద్రతను తొలగించడం పట్ల టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జేసీ కుటుంబంపై రాష్ట్ర ప్రభుత్వం కక్ష్యపూరితంగా వ్యవహరిస్తోందని వారు ఆగ్రహిస్తున్నారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జేసీ దివాకర్ రెడ్డి కుటుంబం లక్ష్యంగానే దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు జేసీ ఆర్థిక మూలాలను దెబ్బతీసే విధంగా జేసీ దివాకర్ ట్రావెల్స్ బస్సులను ఎక్కడికక్కడ సీజ్ చేయడంతో పాటు, జేసీకి చెందిన త్రిశూల్ సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించి భూముల రద్దుతో పాటు ఇతర కేసులు నమోదు అయ్యాయి. ఇదే సమయంలో తాడిపత్రి నియోజకవర్గంలో జేసీ ప్రధాన అనుచరులపైనా పోలీసులు కేసులు పెట్టడం, పీడీయాక్ట్‌లు పెట్టి నెలల తరబడి పోలీస్‌స్టేషన్‌లో ఉంచడంపై జేసీ బ్రదర్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమపై కక్ష్యపూరితంగా వ్యవహరిస్తోందని పలుమార్లు మీడియా ముందు చెప్పిన విషయం తెలిసిందే.
* ఏపీలో భూముల క్రయ, విక్రయాల అనంతరం పేరు మార్పు కోసం ఇక తహశీల్దార్‌ కార్యాలయాల చుట్టూ తిరగనక్కర్లేదు. ఇందుకు వీలుకల్పించే ఆటో మ్యుటేషన్‌ విధానాన్ని మంగళవారం ముఖ్యమంత్రి జగన్‌ లాంఛనంగా ప్రారంభించనున్నారు. కొత్త విధానంలో భూములు కొనుగోలు చేసిన వారు మ్యుటేషన్‌ కోసం దరఖాస్తు చేయాల్సిన అవసరంలేదు.
* చైనాలో కరోనా బారిన పడి మృత్యువాత పడుతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా మరణించిన వారి సంఖ్య 1016కు చేరింది. మరో 42,638 వేల మందికి వైరస్‌ సోకింది. ఒక్క సోమవారం రోజే 108 మంది ప్రాణాలొదిలారు. మరో 2,478 కొత్త కేసులు నమోదయ్యాయి. ఒక్క హుబెయ్‌ ప్రావిన్సులోనే సోమవారం 103 మంది మృతిచెందారు. ఇక వైరస్ బారి నుంచి బయటపడి 3,996 మంది ఇళ్లకు చేరుకున్నారు.
* ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన ఆందోళనలు 56వ రోజు కొనసాగుతున్నాయి. మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మందడంలో ఉదయం నుంచే మహిళలు సాయినామ స్మరణ, హనుమాన్‌ చాలీసా పఠనం చేపట్టారు. పలువురు యువకులు అమరావతికి మద్దతుగా 24గంటల దీక్షకు కూర్చున్నారు.
* ఫిబ్రవరి-14న ప్రేమికులకే కాదు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కి ఎంతో విడదీయరాని అనుబంధం ఉంది. 2013లో కాంగ్రెస్ తో విభేదాల వల్ల 14 ఫిబ్రవరి 2014న సీఎం పదవికి రాజీనామా చేశారు. 2015లో అధికారంలోకి వచ్చిన కేజ్రీవాల్ ఫిబ్రవరి 14నే సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.ఇప్పుడు మళ్లీ ఆప్ అధికారంలోకి రానుండటంతో ఫిబ్రవరి 14నే కేజ్రీవాల్ మరోసారి ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తానికి లవర్స్ డే క్రేజీ.. కేజ్రీవాల్ కు వర్కౌట్ అవుతుందంటున్నారు.
* ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు తనయుడు చేతన్‌ సాయికృష్ణ ప్రతికా ప్రకటన ఇచ్చారు. తాను ఏ ప్రభుత్వ శాఖతో ఏ రకమైన వ్యాపారం చేయలేదన్నారు. తాను ఏ టెండర్‌లో పాల్గొనలేదన్నారు. తాను ఇప్పటి వరకు చేసింది ప్రైవేట్ సెక్టార్‌లోనే అని స్పష్టం చేశారు. తన తండ్రిని ఉపయోగించుకుని వ్యాపారం చెయ్యడం గానీ.. లాభం పొందడం గానీ చెయ్యలేదన్నారు. జరుగుతున్న విషప్రచారంపై సమాధానం చెప్పడానికి తన తండ్రికి పరిమితులున్నాయన్నారు. రాజకీయ విష ప్రచార బాధితుడినైనా తన పేరు బజారుకు లాగడం ఇకనైనా ఆపాలన్నారు. లేని పక్షంలో పరువునష్టం దావా వేస్తానని చేతన్ సాయికృష్ణ అన్నారు.
* రాయలసీమ వాసుల మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడిన జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలని రాయలసీమ విద్యార్థి జేఏసీ డిమాండ్ చేసింది. లేకపోతే పవన్‌ను అడ్డుకుంటామని హెచ్చరించింది. పవన్ మూడు ప్రాంతాల్లో మూడు రకాలుగా మాట్లాడుతున్నారని విమర్శించింది. సుగాలి ప్రీతి కేసును అడ్డం పెట్టుకుని పవన్ రాజకీయాలు చేయాలనుకుంటున్నారని మండిపడింది. న్యాయరాజధానిపై పవన్ వైఖరేంటో తెలపాలని విద్యార్థి జేఏసీ డిమాండ్ చేసింది. సుగాలి ప్రీతి కేసు నిందితులను శిక్షించాలని మొదటి నుంచి తాము పోరాటాలు చేస్తున్నామని పేర్కొంది. సోషల్ మీడియాలో వ్యక్తిగత విమర్శలు చేస్తున్న పవన్ ఫ్యాన్స్ ఖబడ్దార్ అని రాయలసీమ విద్యార్థి జేఏసీ హెచ్చరించింది.
*సచివాలయం ఎదుట ప్రైవేటు కళాశాలల యాజమాన్యాల బైఠాయింపు స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. సోమవారం 13 జిల్లాల నుంచి విడివిడిగా సచివాలయానికి చేరుకుని ఒక్కసారిగా బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ పరిణామాన్ని ఊహించని పోలీసులు వెంటనే తేరుకుని నిరసనకారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు.
*గూడులేని నిరుపేదలకు తమ వంతుగా ఏదైనా చేయాలని భావించారా దంపతులు. రూ.1.5 కోట్ల విలువైన తమ భూమిని ఇళ్ల స్థలాల కోసం దానంగా ఇచ్చారు. గుంటూరు జిల్లా, చెరుకుపల్లి మండలం, గూడవల్లికి చెందిన వ్యాపారవేత్త ముప్పవరపు రఘునాథ్, వైద్యురాలు రావిపాటి కరుణశ్రీ దంపతులు హైదరాబాద్లో స్థిరపడ్డారు.
*పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌర పట్టిక (ఎన్ఆర్సీ), జాతీయ జనాభా పట్టికలను(ఎన్పీఆర్) నిరసిస్తూ సోమవారం చిత్తూరులో వేలాది మంది ముస్లింలు శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో చిత్తూరు జిల్లాలోని వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన ముస్లింలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
*ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం నేపథ్యంలో ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడుకునేందుకు… బుధవారం విజయవాడలో కార్మిక సంఘాలతో సమావేశం నిర్వహించనున్నట్లు ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామోదరరావు తెలిపారు. విలీనంపై ఉన్నతాధికారుల కమిటీ ఇచ్చిన నివేదికతో అన్యాయం జరిగే అవకాశం ఉన్నందున, సిబ్బంది ప్రయోజనాల రక్షణపై చర్చిస్తామని సోమవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
*రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి యూఎస్కు చెందిన ‘లాక్హీడ్ మార్టిన్ కార్పొరేషన్’ ఆసక్తి చూపుతోందని పరిశ్రమల శాఖ అధికారులు తెలిపారు. ‘లాక్హీడ్ మార్టిన్ కార్పొరేషన్ ఏరోస్పేస్, రక్షణ రంగానికి సంబంధించిన ఉత్పత్తుల తయారీ కేంద్రాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు ఆసక్తి వ్యక్తం చేసింది. పుణె కేంద్రంగా ఉన్న మల్టీ నేషనల్ కంపెనీ భారత్ ఫోర్జ్ రాష్ట్రంలో యూనిట్ ఏర్పాటుకు ఆసక్తి చూపుతోంది. మెరైన్, ఏరోస్పేస్ రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి సంప్రదింపులు జరిపింది. దొనకొండ కేంద్రంగా రక్షణ రంగ పరిశ్రమలను ప్రోత్సహించనున్నట్లు వెల్లడించారు.
*ఆంధ్రప్రదేశ్లోని సీబీఐ న్యాయస్థానాల పరిధిని ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం గతంలో విశాఖపట్నం నుంచి విజయవాడకు వచ్చిన మూడో అదనపు ప్రత్యేక జడ్జి న్యాయస్థానం పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల పరిధిలోని సీబీఐ కేసులను విచారిస్తుంది. విశాఖపట్నంలోని ఒకటో అదనపు ప్రత్యేక జడ్జి న్యాయస్థానం, ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జి న్యాయస్థానాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల పరిధిలోని సీబీఐ కేసులను విచారిస్తాయి.
*దక్షిణ కోస్తాలో మంగళవారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో పొడి వాతావరణం ఏర్పడొచ్చని అంచనా వేశారు. ఈశాన్య/తూర్పు దిశ నుంచి గాలులు వీస్తున్నాయని వివరించారు.
*వ్యవసాయశాఖలోని భూసార పరిరక్షణ విభాగం అధికారుల పోస్టుల పేర్లు, హోదాలు మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. వ్యవసాయ అధికారి హోదాలో ఉంటే సహాయ కార్యనిర్వాహక ఇంజినీర్, సహాయ సంచాలకులుగా ఉన్న వారిని డిప్యూటీ కార్యనిర్వాహక ఇంజినీర్, డిప్యూటీ డైరెక్టర్ స్థాయిలో ఉంటే కార్యనిర్వాహక ఇంజినీర్, జేడీఏ స్థాయిలో ఉంటే పర్యవేక్షక ఇంజినీర్గా పిలవాలని పేర్కొన్నారు.
* ఈ ఏడాది నుంచి వ్యవసాయ డిప్లొమో కోర్సు చేసిన వారికి ఈసెట్ ద్వారా ప్రవేశాలు కల్పించనున్నారు. ఈ నెల 17 లేదా 20న నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. 17న ప్రకటన ఇస్తే 20 నుంచి,.. 20న ప్రకటన ఇస్తే 26 నుంచి దరఖాస్తులు స్వీకరించాలని ఈసెట్ కమిటీ నిర్ణయించింది.
*రాష్ట్రంలో ఈ నెల 15 నుంచి కుటుంబ ఆరోగ్య వివరాలను సేకరించనున్నారు. గ్రామాలు, పట్టణాల్లోని సుమారు 1.40 కోట్ల కుటుంబాల ఆరోగ్య వివరాలను ఆశాలు, వార్డు ఎ.ఎన్.ఎం.లు సేకరిస్తారు. కుటుంబ సభ్యుల్లో మధుమేహం, రక్తపోటు, క్యాన్సర్, గుండె జబ్బు, ఇతర అనారోగ్య వివరాలను ఎలా సేకరించాలన్న దానిపై ఎ.ఎన్.ఎం.లు, ఆశాలకు వైద్య ఆరోగ్య శాఖ ద్వారా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జీవనశైలి, దీర్ఘకాలిక వ్యాధులను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా అన్ని రాష్ట్రాల్లోని కుటుంబ ఆరోగ్య వివరాలను సేకరించాలని ఆదేశించింది.
*ప్రత్యేక డీఎస్సీ-2000, 2001లో శిక్షణ లేకుండా నియమితులైన ఎస్టీ ఉపాధ్యాయులకు నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేసినట్లు ఉపాధ్యాయ సమాఖ్య ప్రధాన కార్యదర్శి జి.హృదయరాజు తెలిపారు. టీటీసీ శిక్షణ పూర్తయ్యే కాలం వరకు ఎస్టీ ఉపాధ్యాయులకు ఇంక్రిమెంట్లు మంజూరు చేయడం హర్షణీయమన్నారు.
*గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు సోమవారం నుంచి బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి చేశారు. ప్రభుత్వశాఖల ఉద్యోగుల తరహాలోనే రోజూ ఉదయం 10 గంటలకు, సాయంత్రం 5.30 గంటలకు వీరు బయోమెట్రిక్ హాజరు నమోదు చేసుకోవాలి.
*రాష్ట్రంలోని 76 పట్టణాల్లో రూ.112.56 కోట్లతో మానవ వ్యర్థాల శుద్ధి కేంద్రాల (ఎఫ్ఎస్టీపీ) ఏర్పాటుకు ప్రభుత్వం సోమవారం పరిపాలన అనుమతులిచ్చింది. వీటి నిర్వహణకు మరో రూ.97.25 కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. బహిరంగ మల విసర్జన రహితం(ఓడీఎఫ్)గా పట్టణ ప్రాంతాలను ప్రకటించాక 76 చోట్ల మానవ వ్యర్థాల శుద్ధి కేంద్రాల ఏర్పాటు అవసరాన్ని స్వచ్ఛాంధ్రప్రదేశ్ సంస్థ గుర్తించి, ఆ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది