దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌లో చాలా మంది భార్యభర్తలు కొట్టేసుకుంటున్నారు. టీవీ రిమోట్ దగ్గర నుంచి వండే కూర వరకూ అన్ని విషయాల్లో తిట్టేసుకుంటున్నారు. ఎవరికి ఎవరూ వెనక్కి తగ్గట్లేదు. నువ్వెంత అంటే నువ్వెంత అనుకుంటున్నారు. ముఖ్యంగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఈ గృహ హింస ఎక్కువగా ఉంది. ఆ తర్వాత హర్యానా రెండో స్థానంలో ఉంటే ఢిల్లీ మూడో పొజిషన్‌లో ఉంది. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథార్టీ (NALSA) ఈ వివరాల్ని రిలీజ్ చేసింది. గత రెండు నెలల్లో జరిగిన గృహహింస కేసుల్ని లెక్కలోకి తీసుకుంది. మే 15 వరకూ లెక్కించింది. వాటి ప్రకారం ఢిల్లీలో 63 కేసులు నమోదవ్వగా హర్యానా నుంచి 79 కేసులొచ్చాయి. ఉత్తరాఖండ్ నుంచి ఏకంగా 144 కేసులొచ్చాయి. మొత్తం 28 రాష్ట్రాల్లో ఈ కేసుల్ని లెక్కలోకి తీసుకుంది నల్సా.
కరోనా వచ్చిన తర్వాత 60వేల మంది ఖైదీలను పెరోల్‌పై విడుదల చేశారు. వాళ్లంతా జైళ్లలో ఉంటే కరోనా వస్తుందేమో అన్న ఉద్దేశంతో అలా చేశారు. రిలీజైన ఖైదీల్లో 42259 మంది అండర్ ట్రయల్ ఖైదీలే. మొత్తం ఖైదీల్లో ఒక్క ఉత్తరప్రదేశ్ నుంచే 9977 మంది తాత్కాలికంగా రిలీజ్ అయ్యారు.
గృహ హింస ఎదుర్కొంటూ మొత్తం 1822 మంది లీగల్ సర్వీస్ అధికారులను ఆశ్రయించగా భార్యాభర్తలకు కౌన్సెలింగ్ ఇచ్చి ఇంటికి పంపినట్లు తెలిపారు. ఇలా వచ్చిన వాళ్లలో ఎక్కువ ఉంది ఉత్తరాఖండ్ వారు ఉండగా ఆ తర్వాత హర్యానా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, మిజోరం ప్రజలున్నారు.