Movies

సేతుపతి పక్కన ఇద్దరు

సేతుపతి పక్కన ఇద్దరు

గ్లామరస్‌ హీరోయిన్‌గా దక్షిణాది చిత్రసీమలో కెరీర్‌ను ఆరంభించింది పంజాబీ సొగసరి తాప్సీ. తొలినాళ్లలో తెలుగు, తమిళ భాషల్లో అందాల ప్రదర్శనతో కూడిన పాత్రల్లో కనిపించింది. కానీ ఈ సినిమాలు పెద్దగా గుర్తింపును తెచ్చిపెట్టకపోవడంతో తన పంథాను మార్చిన ఆమె ప్రయోగాత్మక చిత్రాలకు ప్రాధాన్యతనిస్తూ వరుస విజయాల్ని అందుకుంటోంది. తాజాగా తాప్సీ మరో విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నది. తాప్సీ, విజయ్‌ సేతుపతి నాయకానాయికలుగా తమిళంలో ఓ సినిమా రూపుదిద్దుకోనున్న విషయం తెలిసిందే. కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తాప్సీ ద్విపాత్రాభినయం చేయబోతున్నట్లు సమాచారం. ఓ పాత్ర ప్రతినాయిక ఛాయలతో ఉండగా.. మరో క్యారెక్టర్‌లో సంప్రదాయబద్ధ్దమైన అమ్మాయిగా ఆమె కనిపిస్తుందని సమాచారం. భిన్నమైన ఆహార్యంతో రెండు పాత్రలు ఛాలెంజింగ్‌గా ఉంటాయని చెబుతున్నారు. ఈ సినిమాలో తాప్సీతో పాటు విజయ్‌ సేతుపతి డ్యూయల్‌రోల్‌లోనే నటించనున్నట్లు చెబుతున్నారు.