DailyDose

శ్రావణి కేసులో పరారీలో సినీ నిర్మాత-నేరవార్తలు

శ్రావణి కేసులో పరారీలో సినీ నిర్మాత-నేరవార్తలు

* టీవీ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో విచారణ ముగిసింది. ఇద్దరు నిందితులు సాయి, దేవరాజ్‌ల నుంచి కీలక సమాచారం సేకరించిన‌ పోలీసులు మధ్యాహ్నం నిందితులను మీడియా ముందు ప్రవేశపెడతామన్నారు. ఈ కేసులో శ్రావణిని ఆమె తల్లిదండ్రులు, సాయి వేధించినట్లు ఆధారాలు ఉన్నాయని వెస్ట్ జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ తెలిపారు. శ్రావణి ఆత్మహత్యలో సాయి, దేవరాజ్‌ ప్రమేయంపై ఆడియో కాల్స్, వీడియోలు ఉన్నాయన్నారు. ఈరోజు నిందితులను రిమాండ్ చేస్తామని వెల్లడించారు. శ్రావణి ఆత్మహత్య కేసులో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారని, వాటికి సంబంధించి సాంకేతిక ఆధారాలన్నీ సేకరించామని పేర్కొన్నారు. విచారణ ముగిసిన నేపథ్యంలో దేవరాజ్, సాయి రెడ్డిలను కరోనా పరీక్షల నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎదురుగా ఉన్న కోవిడ్‌ సెంటర్‌లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరోవైపు శ్రావణి ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మూడో వ్యక్తి ఆర్‌ఎక్స్‌ 100 మూవీ నిర్మాత అశోక్‌రెడ్డి పరారీలో ఉన్నారు. సోమవారం నాడు విచారణకు రావాలని పోలీసులు ఇదివరకే నోటీసులు పంపినా అటు నుంచి ఎలాంటి స్పందన లేదు. ఉదయం నుంచి నిర్మాత అశోక్‌రెడ్డి ఫోన్ స్విచాఫ్‌లో ఉంది. దీంతో అతని కోసం గాలింపు చేపట్టే అవకాశం ఉంది.

* అమలాపురం మండలం ఇందుపల్లిలో వెంకటరాజు అనే వ్యక్తి అదృశ్యం.హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేసిన బాధితుడి మేనమామ వెంకటరాజు. విషయంలో పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం. గతంలో మూడు సార్లు జుడిషియల్ విచారణ చేస్తే పోలీసులదే తప్పని తేలిందంటూ హైకోర్టు కీలక వ్యాఖ్యలు. ఏపీలో పోలీస్ వ్యవస్థ గాడితప్పుతోందన్న హైకోర్టు. ఏపీలో రూల్ ఆఫ్ లా అమలు కావడం లేదని మండిపాటు.పోలీస్ వ్యవస్థను కంట్రోల్ చేయలేకపోతే డీజీపీ రాజీనామా చేయాలన్న హైకోర్టు.గతంలో డీజీపీని పలు సార్లు కోర్టుకు పిలిపించిన మార్పు రాలేదన్న హైకోర్టు.ప్రతిసారి ఇలాంటి పరిస్థితే వస్తే ప్రభుత్వానికి ఇబ్బంది వస్తుందని హైకోర్టు వ్యాఖ్య. ప్రతి కేసులో సీబీఐ విచారణ సాధ్యం కాదన్న హైకోర్టు.

* పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం విజయరాయి గ్రామ పంచాయతీలోఅక్రమ బిల్లులతో 10లక్షల నిధులు స్వాహా జరి గాయని తెలిసింది.గ్రామంలో వీది లైట్లు కొనుగోలు ముసుగులో అవసరం లేకపోయినా ఒక కార్యదర్శితన ఆర్థిక అవసరార్థం 50 వేల ఖరీదు కూడా చేయని ఎల్ ఈ డి బల్బులు సెట్టింగ్ లు 10 లక్షల తో కొనుగోలు చేసి నట్టు సమాచారం.కొనుగోలు చేసిన ఎల్ ఈ డి బల్బులు .సెట్టింగ్ లు చూసి వీటి ఖరీదు ఇన్నీ లక్షలా బాబోయ్ అని పంచాయతీ కొత్త ఉద్యోగ సిబ్బంది అవాక్కవుతున్నారని తెలిసింది.పంచాయతీలలో వీధి లైట్లు కొత్తవి ఏర్పాటుచేయాలన్నా.పాడైన లైట్లు బాగుచేయాలన్నా వాటి నిర్వహనంతా ప్రభుత్వం ఒక ఏజెన్సీకి అప్పగించింది అని కొంతమంది కార్యదర్సులే తెలుపుతున్నారు.అటు వంటప్పుడు కార్యదర్శి ఏజెన్సీని కాదని నిబంధనలకు విరుద్ధంగా ఏకంగా 10 లక్షల బిల్లుతో ప్రయివేటు గా లైట్లు కొనుగోలు చేయడంవెనుక పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని ప్రజలు అనుకుంటున్నారు ప్రభుత్వ నిధులు ఇలా కూడా స్వాహా చేయవచ్చా అని కొత్త ఉద్యోగులు అనుకుంటున్నట్టు సమాచారం.ఇంతకు ముందు కూడా ఈ పంచాయతీలో లక్షలాది రూపాయలు దోపిడీకి గురయ్యాయని విశ్వసనీయ సమాచారం.అంతే కాదు ఈ పంచాయతీలో పనిచేసి ప్రమోషన్ పై చింతలపూడి మండలానికి వెళ్లిన ఒక ఉద్యోగి సి ఎఫ్ ఎం ఎస్ ఎక్కౌంట్ లోకి ఈ పంచాయతీ కి చెందిన 63 వేల 500 నిధులు అక్రమంగా మళ్లించి వాటిని ఆ ఎక్కౌంట్ దారుని సహకారంతో డ్రా చేయడానికి చేసిన ప్రయ త్నానికి ఎస్ టి ఓ కార్యాలయం చెక్ పెట్టినట్టు తెలిసింది.మండలంలో కొన్ని పంచాయతీలలోఇదే తరహాలో కొన్ని బిల్లులు లక్షల్లో స్వాహా చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులు ఇకనైనా ఆ కార్యదర్శి విధులు నిర్వహించిన నవరత్నాల్లాంటి పంచాయతీలలో ఏ సి బి . విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ . ఇంటెలిఘ్జెన్స్. స్పెషల్ బ్రెంచ్ వంటి నిఘా సంస్థలతో విచారణ జరిపిస్తే ఒళ్ళు గగుర్పాటుపోడిచే ఇలాంటి నగ్న సత్యాలు మరిన్ని వెలుగు లోకివచ్చే అవకాశం ఉందని మండల ప్రజలు అధికారులను కోరుతున్నారు .దీనిపై పంచాయతీ ప్రస్తుత కార్యదర్శి ప్రసాద్ ని వివరణ కోరగా నేను కొత్తగా విధులలోకి వచ్చానని వచ్చిన నాటినుండి కోవిడ్ క్వారన్ టైన్ విధులు నిర్వహిస్తున్నట్టు కార్యదర్శి చెప్పారు

* కొండపల్లి మున్సిపాలిటీ తో పాటు ఇబ్రహింపట్నం పరిసర గ్రామాల్లో కాల్ నాగుల జాడలు కనిపిస్తున్నాయి.. వందకి 10 రూపాయల నుండి 6 రూపాయల మేర వసూలు చేసి బాధితుల రక్తం తోడేస్తున్నారని వాదనలు బలంగా వినిపిస్తున్నాయి… ఉదాహరణకు ఒక వ్యక్తి ఒక 1 లక్ష రూపాయలు తీసుకొని లక్షకు లక్ష వడ్డీ కట్టారు.. కానీ అసలు బాకి తీరకపోవడం తో వడ్డీ కోసం వడ్డీ వ్యాపారి ఇళ్ళ ఇంటి మీద కు పడి నాన హంగామా చేస్తున్న పరిస్థితి నెలకొంది…అయితే ఇలాంటి పరిస్థితులు సామాన్య మధ్య తరగతి కుటుంబాలు నలుగురి లో చులకన కావడం మానసిక క్షోభకు గురయ్యే పరిస్థితి ఏర్పడుతోంది…. కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ ప్రభావం అన్ని రంగాలపై పడింది… దీంతో చేతిలో పని లేక, వ్యాపారులకు వ్యాపారం లేక నానా అవస్థలు పడుతున్నారు….దీంతో ప్రభుత్వాలు బ్యాంక్ ల ద్వారా తీసుకున్న రుణాలకు మారిటోరియం అమలు చేస్తోంది…అయితే కాల్ నాగుల బారి నుండి మాత్రం సామాన్యుడు బతికి బట్ట కట్టే అవకాశం మాత్రం కనిపించడం లేదు….ప్రజలను పీక్కు తినే ఇలాంటి అక్రమ కాల్ దందా పై ప్రభుత్వం ఉక్కు పాదం మోపల్సిన అవసరం ఉంది…ప్రస్తుత కరోనా సమయంలో అసలు బాకీ చెల్లించే పరిస్థితి లేనప్పుడు అధిక వడ్డీల బాదుడు పై అక్రమార్కులు సైతం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది…

* గుంటూరు జిల్లాలో మరో సెల్ఫీ వీడియో ఆత్మహత్య కలకలం రేపుతోంది. ‘‘నేను చనిపోతున్నాను… నా పిల్లల్ని ప్రభుత్వం ఆదుకోవాలి అంటూ ఆవేదన’’ వ్యక్తం చేస్తూ ఓ వ్యక్తి చెట్టుకు ఉరివేసుకుని మృతి చెందాడు. వారం క్రితం మరణించిన తన భార్య మృతి తట్టుకోలేక చనిపోతున్నానంటూ కారంపూడి మండలం గాదేవారిపల్లెకి చెందిన రాంపాటి అశోక్ సెల్ఫీ వీడియో తీశాడు. నిన్న ఊరు చివర చెట్టుకు ఉరి వేసుకొని విగతజీవిగా కనిపించాడు. గత వారం తన భార్య చనిపోయిందని… తాను (భార్య) లేకుండా ఉండలేను అంటూ సెల్ఫీ వీడియో తీశాడు. తన చావుకు ఎవరు కారణం కాదని.. తన పిల్లల్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలి అని వేడుకున్నాడు. అలాగే తన సమాధిపై క్రికెట్ బ్యాట్, రెండు బాల్స్ పెట్టాలని చివరి కోరికగా అశోక్ వీడియోలో పేర్కొన్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

* స్వర్ణప్యాలెస్‌ కేసులో దర్యాప్తు కొనసాగించేందుకు సుప్రీంకోర్టు అనుమతి.హైకోర్టు ఆధేశాలను పక్కనబెట్టిన సుప్రీంకోర్టు.దర్యాప్తు కొనసాగించవద్దంటూ ఆదేశాలిచ్చిన హైకోర్టు.దర్యాప్తుకు సహకరించాలని రమేష్‌ ఆస్పత్రికి ఆదేశం.

* ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం సుకుమా జిల్లాలో మావోయిస్టుల కదలికలు అధికంగా ఉండడం, నిత్యం ఏదో ఒక ప్రాంతంలో అలజడి రేపుతుండడంతో పోలీసులు పటిష్ఠ నిఘా పెట్టారు. మావోల కదలికలను తెలుసుకునేందుకు వారు నిత్యం సంచరించే ప్రాంతాల్లో డ్రోన్‌ కెమెరాలను వినియోగిస్తు న్నారు. ఇందులో భాగంగా రెండు రోజుల క్రితం సుకుమా జిల్లా కిష్టారంపాడు పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పాలోడు గ్రామం వద్ద మావోయిస్టులు అటవీ మార్గంలో వాగుదాటుతున్న దృశ్యాలు డ్రోన్‌ కెమెరాకు చిక్కాయి. సుమారు 200 మందికి పైగా మావోలు దట్టమైన అడవిలో నడుస్తున్న దృశ్యాలు ఆ వీడియోలో రికార్డయ్యాయి.దింతో అధికారులు అప్రమత్తమైయ్యారు.

* బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. దేవరాజ్‌ను గాఢంగా ప్రేమించిన శ్రావణి.. అతన్ని పెళ్లి చేసుకోమని ఒత్తిడి తెచ్చింది. కానీ, దేవరాజ్ అందుకు నిరాకరించాడు. అదేసమయంలో సాయికృష్ణారెడ్డిని పెళ్లి చేసుకోవాలని శ్రావణి తల్లిదండ్రులు ఒత్తిడి తెచ్చారు. అటు ప్రియుడిని వదులుకోలేక, ఇటు తల్లిదండ్రుల ఒత్తిడిని తట్టుకోలేక శ్రావణి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. 

* డ్రగ్స్‌ కేసుతో బాలీవుడ్‌కు ఉన్న సంబంధాలపై నటుడు, బీజేపీ ఎంపీ రవికిషన్ ‌( రేసుగుర్రం విలన్‌ మద్దాలి శివారెడ్డి) గళమెత్తారు. బాలీవుడ్‌లో మత్తు పదార్థాల అక్రమ రవాణా, వినియోగం విపరీతంగా పెరిగిపోయిందని అన్నారు. దేశ యువతను నాశనం చేయటానికి కుట్ర జరుగుతోందని మండిపడ్డారు. పొరుగుదేశాలు ఇందుకు సహకారం అందిస్తున్నాయన్నారు. సోమవారం నాటి పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాకిస్తాన్‌, చైనాలనుంచి ప్రతి ఏటా మత్తు పదార్థాలు దేశంలోకి అక్రమంగా రవాణా అవుతున్నాయని, నేపాల్‌, పంజాబ్‌ ద్వారా దేశంలోకి వస్తున్నాయని పేర్కొన్నారు.