NRI-NRT

న్యూయార్క్ భారత కాన్సులేట్ నుండి శుభవార్త

న్యూయార్క్ భారత కాన్సులేట్ నుండి శుభవార్త

న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్‌ అత్యవసర సేవల కోసం ఏడాది పొడవున తెరచి ఉంటుందని పేర్కొంది. ఇది ప్రజల అత్యవసర అవసరాలను పరిష్కరించడానికి వారాంతాల్లో, ఇతర సెలవులతో సహా ఏడాది పొడవునా తెరిచే ఉంటుందని భారత కాన్సులేట్‌ ప్రకటించింది. మే 10 నుంచి అమలులోకి వచ్చే అన్ని సెలవు దినాల్లో మధ్యాహ్నాం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తెరిచే ఉంటుందని కాన్సులేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా న్యూయార్క్‌ పత్రికా ప్రకటనలో పేర్కొంది. ఈ మేరకు మే 10, 2024 నుంచి సాధారణ ప్రజల అత్యవసర అవసరాలను తీర్చేందుకు అన్ని సెలవు దినాల్లో(శనివారం/ఆదివారం ఇతర ప్రభుత్వ సెలవు దినాలతో సహా) మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కాన్సులేట్‌ తెరిచి ఉంటుందని ప్రకటనలో వెల్లడించింది. ఈ సదుపాయం నిజమైన అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వ్యక్తుల కోసం అని, సాదారణ కాన్సులర్‌ సేవల కోసం కాదని తెలిపింది. అలాగే ఏదైనా అత్యవసర సేవ కోసం కాన్సులేట్‌కు వచ్చే ముందు అత్యవసర హెల్ప్‌లైన్‌ నంబర్‌: 1-917-815-7066కు కాల్‌ చేయాలని భారతీయ కాన్సులేట్‌ దరఖాస్తుదారులకు సూచించింది.

ఈ సేవలు అవసరమైన డాక్యుమెంట్‌ల ఆవశక్యతకు సంబంధించి, అలాగే తదుపరి పని దినానికి వాయిదా వేయలేని అత్యవసర పనులు., వంటి వాటికి వర్తిస్తాయి. ముఖ్యంగా అత్యవసర వీసా, ఎమర్జెన్సీ సర్టిఫికేట్‌(అదే రోజు భారతదేశానికి ప్రయాణించడం కోసం) అదే రోజు పంపబడే మృతదేహాలను రవాణా చేయడం వంటి ప్రయాణ పత్రాల అత్యవసర అవసరాల కోసం మాత్రమే. దరఖాస్తుదారు నుంచి అత్యవసర సేవా రుసుము వసూలు చేయడం జరుగుతుంది. అత్యవసర వీసా సేవలు కూడా ఉన్నట్లు కాన్సులేట్ జనరల్ పేర్కొంది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z