Politics

తెదేపా పార్లమెంటరీ ఇన్‌ఛార్జ్‌లు వీరే

తెదేపా పార్లమెంటరీ ఇన్‌ఛార్జ్‌లు వీరే

తెలుగుదేశం పార్టీ బలోపేతం దిశగా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌ఛార్జి బాధ్యతల నుంచి పాత వారిని తప్పించి కొత్తవారికి అవకాశం కల్పించారు. కొత్తగా నియమితులైన ఇన్‌ఛార్జ్‌ల వివరాలను చంద్రబాబు నాయుడు ఆదివారం ప్రకటించారు. వీరితో పాటు ప్రతి రెండు పార్లమెంట్‌ నియోజకవర్గాలకు ఒక సమన్వయకర్తను నియమించారు.
**పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు…
*శ్రీకాకుళం – కూన రవికుమార్‌
విజయనగరం కిమిడి నాగార్జున
*అనకాపల్లి – నాగ జగదీశ్వరరావు
*విశాఖపట్నం – పల్లా శ్రీనివాసరావు
*అరకు – గుమ్మడి సంధ్యారాణి
*కాకినాడ – జ్యోతుల నవీన్‌
*రాజమహేంద్రవరం – జవహర్‌
*నరసాపురం – తోట సీతారామలక్ష్మి
*ఏలూరు – గన్ని వీరాంజనేయులు
*విజయవాడ – నెట్టెం రఘురాం
*మచిలీపట్నం – కొనకళ్ల నారాయణ
*గుంటూరు – శ్రావణ్‌ కుమార్‌
*బాపట్ల – ఏలూరి సాంబశివరావు
*నరసరావుపేట – జీవీ ఆంజనేయులు
*ఒంగోలు – నూకసాని బాలాజి
*నెల్లూరు – అబ్దుల్‌ అజీజ్‌
*తిరుపతి – నరసింహ యాదవ్‌
*కాకినాడ – జ్యోతుల నవీన్‌
*రాజంపేట – రెడ్డప్పగారి శ్రీనివాస్‌రెడ్డి
*కర్నూలు – సోమిరెడ్డి వెంకటేశ్వర్లు
*నంద్యాల – గౌరు వెంకటరెడ్డి
*హిందూపురం – బి.కె.పార్థసారధి
*చిత్తూరు – పులివర్తి నాని
*కడప – మల్లెల లింగారెడ్డి
*అనంతపురం – కాలువ శ్రీనివాసులు