Sports

అమెరికా ఆలీఖాన్ ఆశలు ఆవిరి

బీసీసీఐ నిర్వహించే ప్రముఖ టీ20 లీగ్‌లో ఆడాలనుకున్న అమెరికా ఆటగాడు అలీఖాన్‌ ఆశలు ఆవిరయ్యాయి. గాయం కారణంగా అతడు లీగ్‌కు దూరమైనట్లు అధికారులు వెల్లడించారు. పేసర్‌ హ్యారీ గర్నీకి గాయం కావడంతో కోల్‌కతా అతడిని జట్టులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ‘‘హ్యారీ గర్నీ స్థానంలో అమెరికన్‌‌ ఫాస్ట్‌ బౌలర్‌ అలీఖాన్‌ కోల్‌కతా జట్టులో స్థానం సంపాదించాడు. అమెరికా నుంచి లీగ్‌లో చోటు దక్కించుకున్న తొలి ఆటగాడు అతడే. దురదృష్టవశాత్తు గాయం వల్ల అతడు కూడా టోర్నీ నుంచి వైదొలగాల్సి వచ్చింది’’ అని ఓ అధికారి పేర్కొన్నారు.