DailyDose

రజనీకాంత్‌తో ఆరెస్సెస్ కీలక నేత భేటీ-తాజావార్తలు

Breaking News - Rajinikanth Meets With RSS Important Leader

* ఆరెస్సెస్ సిద్ధాంత కర్త, ప్రముఖ ఆర్థికవేత్త ఎస్. గురుమూర్తి సూపర్ స్టార్ రజనీకాంత్‌తో ఆదివారం సమావేశమైనట్లు సమాచారం. దాదాపు గంటన్నర వీరి భేటీ సాగింది. సూపర్‌స్టార్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకపోయినా… బీజేపీకి మద్దతిస్తున్నారన్న ఊహాగానాల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. రాజకీయాల్లోకి వైద్యులు రాకూడదని సూచించారని రజనీకాంత్ వ్యాఖ్యానించినట్లు ఈ మధ్యే వార్తలొచ్చాయి. ఈ విషయంపై పునరాలోచించుకోవాలని గురుమూర్తి రజనీకాంత్‌ను కోరినట్లు సమాచారం. వచ్చే తమిళనాడు ఎన్నికల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని రజనీకాంత్‌ను గురుమూర్తి కోరినట్లు తెలుస్తోంది. తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకపోయినా జాతీయ పార్టీ బీజేపీకి మద్దతు ప్రకటిస్తారని తెలుస్తోంది. ఆది వారం బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి సీటీ రవి మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని సూచన ప్రాయంగా ప్రకటించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి, ప్రధాని మోదీకి గతంలో రజనీకాంత్‌ పలుమార్లు మద్దతు ప్రకటించారని, బీజేపీ పరిపాలనను పలు సందర్భాల్లో మెచ్చుకున్నారని  ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.అసెంబ్లీ ఎన్ని కల్లోగా రజనీ రాజకీయ ఆరంగేట్రం చేస్తారని, ఎన్నికల్లో ఆయన పార్టీతో పొత్తుపెట్టు కోవాలని బీజేపీ ఎంతో ఆశలు పెట్టుకుంది. ఇప్పటికే బీజేపీ రాష్ట్రశాఖలో సినీ రంగ ప్రముఖుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగం గా బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా వెట్రివేల్‌ పేరుతో ప్రచార యాత్ర కూడా చేస్తోంది. రజనీ వృద్ధాప్య సమస్యలు, కరోనా వైరస్‌ కారణంగా పార్టీని ప్రారంభించే ఆలోచన విరమించు కుంటున్నట్టు చేసిన ప్రకటన బీజేపీ నేతలకు తీవ్ర నిరాశను కలిగించింది.

* ఏపీ రాష్ట్రంలో కొత్తగా 1,916 కరోనా కేసులు..13 మరణాలు.రాష్ట్రంలో 8,27,882కు చేరిన కరోనా బాధితుల సంఖ్య.రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో 6,719 మంది మృతి.రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న మరో 3,509 మంది బాధితులు.రాష్ట్రంలో ఇప్పటివరకు కోలుకున్న 7.95 లక్షల మంది బాధితులు.

* అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్​కు సర్వం సిద్ధమైంది.రెండో దశ పోలింగ్​లో భాగంగా 94 స్థానాలకు మంగళవారం ఎన్నికలు జరగనున్నాయి.మొత్తం 2.85 కోట్ల మంది ఓటర్లు.. 1,463 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు.ఈ దఫాలోనే కీలక నేతలు, పలువురు మంత్రులు బరిలో ఉండటం ఆసక్తి రేపుతోంది.

* ఓటుకు నోటు కేసులో తనకు ఎలాంటి ప్రమేయం లేదంటూ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య వేసిన పిటిషన్​ను అనిశా న్యాయస్థానం నిరాకరించింది.అభియోగాల నమోదు ప్రక్రియను ప్రారంభించేందుకు ఓటుకు నోటు కేసు విచారణను బుధవారానికి వాయిదా వేసింది.ఓటుకు నోటు కేసు నుంచి శాసనసభ్యుడు సండ్ర వెంకట వీరయ్యను తొలగించేందుకు అనిశా న్యాయస్థానం నిరాకరించింది.సండ్ర వెంకట వీరయ్య, మరో నిందితుడు ఉదయ్ సింహా దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్లను కోర్టు కొట్టివేసింది.

* తెలంగాణలో గణనీయంగా తగ్గిన కరోనా కేసులు.నిన్న రాష్ట్రవ్యాప్తంగా 922 కేసుల నమోదు.ఏడుగురి మృతి.రాష్ట్రంలో యాక్టివ్‌గా 17,630 కేసులు.గత కొన్ని రోజులతో పోలిస్తే తెలంగాణలో నిన్న కరోనా కేసులు గణనీయంగా తగ్గాయి. నిన్న రాత్రి నాటికి రాష్ట్రవ్యాప్తంగా 922 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలుపుకుని రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,40,970కి చేరుకున్నట్టు వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌లో పేర్కొంది. కరోనా కారణంగా నిన్న ఏడుగురు మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య 1,348కి పెరిగింది. అలాగే, నిన్న రాష్ట్రవ్యాప్తంగా 1,456 మంది కోలుకున్నారు. వీరితో కలుపుకుని ఇప్పటి వరకు ఈ మహమ్మారి బారినుంచి కోలుకున్న వారి సంఖ్య2,21,992కు పెరిగింది. రాష్ట్రంలో ఇంకా 17,630 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, వారిలో 14,717 మంది ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నట్టు అధికారులు తెలిపారు. ఇక నిన్న వెలుగు చూసిన 922 కేసుల్లో 256 కేసులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నమోదయ్యాయి. నిన్న ఒక్క రోజే 25,643 నమూనాలు పరీక్షించారు. వీటితో కలుపుకుని రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు నిర్వహించిన పరీక్షల సంఖ్య 43,49,309కి పెరిగినట్టు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

* ఒడిశా రాష్ట్ర గవర్నర్ గణేష్ లాల్ దంపతులు కరోనా బారిన పడ్డారు. గవర్నర్ గణేష్ లాల్, అతని భార్య సుశీలాదేవిలకు కరోనా పాజిటివ్ అని తేలడంతో వారిని ఆసుపత్రిలో చేరారనిని ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయఖ్ సోమవారం తెలిపారు. ఒడిశా రాష్ట్ర గవర్నర్ ప్రొఫెసర్ గణేష్ లాల్ జీ కరోనాతో ఆసుపత్రిలో చేరడంపై తాను ఆందోళన చెందానని, ఆయన త్వరగా కోలుకోవాలని, ఆయన ఆరోగ్యం కోసం తాను ప్రార్థిస్తున్నానని సీఎం పట్నాయక్ ట్వీట్ చేశారు.‘‘ గౌరవ ప్రథమ మహిళ సుశీలాదేవికి జరిపిన పరీక్షల్లో కొవిడ్-19 పాజిటివ్ అని తేలిన తరువాత ఆమె ఆసుపత్రిలో చేరినట్లు తెలుసుకొని ఆందోళన కలిగిస్తుంది.

* కృష్ణాయలపాలెంలో అరెస్ట్ అయిన రైతులను పరామర్శించేందుకు జిల్లా జైలుకు వచ్చిన జనసేన నేతలను పోలీసులు అడ్డుకున్నారు.  రైతులను కలిసేందుకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. దీంతో పోలీసులు, జనసేన నేతల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. అక్రమంగా అరెస్ట్ చేసిన రైతులను తక్షణమే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. జనసేన నేతలు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, పొతిన మహేష్ , గాదె వెంకటేశ్వరరావు జైలు వద్ద నినాదాలు చేపట్టారు.

* యాదాద్రి జిల్లా ట్రైనీ కలెక్టర్ గా సంతోషి నియామకం అయ్యారు.భారత,చైనా సరిహద్దుల్లో ఇటీవల జరిగిన గొడవలో సూర్యాపేట కు చే0దిన కల్నల్ సంతోష్ బాబు వీరమరణం పొందడంతో అతని భార్య సంతోషిణి ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్ గా నియమించింది.అమెను యాదాద్రి జిల్లాకు కేటాయించడం తో నేడు డ్యూటీ లో చేరనున్నారు.

* ఏపీలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అనేక మంది ప్రముఖులు కరోనా బారిన పడి కోలుకున్నారు. తాజాగా ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌కు  కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.  దీంతో ఇటీవల తనను కలిసిన పార్టీ నేతలు, సన్నిహితులు,  కార్యకర్తలు కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలంటూ పయ్యావుల కేశవ్ సూచన చేశారు.