Movies

సోషాల్ మీడియా నెగిటివిటీ వదిలేయండి

సోషాల్ మీడియా నెగిటివిటీ వదిలేయండి

సోషల్‌మీడియా ప్రభావం వల్ల మన చుట్టూ అంతా నెగెటివిటీ ఆవరించి ఉందనే అపోహలు కలుగుతాయని, ఒక్కసారి బాహ్య ప్రపంచంలోకి వెళ్లి పరిశీలిస్త్తే మనుషులు చూపించే ప్రేమాభిమానాల విలువేమిటో తెలుస్తుందని చెప్పింది పంజాబీ సుందరి తాప్సీ. గత కొన్ని నెలలుగా వృత్తిపరమైన అంశాల్లో సోషల్‌మీడియా వేదికగా తనపై దాడి జరిగిందని ఆవేదన వ్యక్తం చేసిందీ భామ. ఇటీవలే మాల్దీవుల్లో విహార యాత్రను పూర్తిచేసుకున్న ఈ సుందరి ఇండియాకు తిరిగొచ్చింది. ఈ సందర్భంగా తన యాత్ర అనుభవాల్ని వివరిస్తూ ‘లాక్‌డౌన్‌ కొనసాగిన ఆరు నెలల పాటు ఇంటిలో బందీనయ్యాను. ఏనాడు వంటింటి ముఖం చూడని నేను రోజులో ఐదారుగంటలు అక్కడే గడిపేదాన్ని. లాక్‌డౌన్‌ పీరియడ్‌ మొత్తం ఓ కలలా గడచిపోయింది.