DailyDose

చిరిగిన జీన్స్ పట్ల సీఎం ఛీత్కారం-నేరవార్తలు

Uttarakhand CM Slams Youth For Torn Jeans

* యువతుల వస్త్రధారణ విషయంపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరథ్ సింగ్ రావత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.‘‘ఓ ఎన్జీవోను నడిపిస్తున్న యువతి చిరిగిన జీన్స్ వేసుకోవడం చూసి షాకయ్యా.ఆ వేషధారణతో ఎన్జీవో విషయమై ప్రజలను కలవడానికి వెళితే సమాజానికి ఏం సంకేతాలిస్తున్నట్లు? మన పిల్లలకు ఏం సంకేతాలిస్తున్నట్లు?ఇదంతా ఇంటి నుంచే ప్రారంభమవుతుంది. మనం ఏం చేస్తామో పిల్లులూ అదే చేస్తారు.మనం దేనిని ఫాలో అవుతామో… పిల్లలూ అదే ఫాలో అవుతారు.ఇళ్లలో సంస్కృతి మూలాలను నేర్పించినట్లైతే, ఎంత ఆధునికంగా ఉన్నా పర్లేదు. జీవితంలో ఎన్నడూ వైఫల్యం చెందరు.’’ అని సీఎం తీరథ్ రావత్ పేర్కొన్నారు.ఈ పోకడలు లైంగిక వేధింపులు వైపు మళ్లే ప్రమాదం ఉందన్నారు.యువతీ యువకులు మోకాళ్లను చూపుతూ ఉండే జీన్స్ ధరించడం పాశ్చాత్య సంస్కృతి ప్రభావమే అని పేర్కొన్నారు.పాశ్చాత్యులు మనల్ని అనుసరిస్తూ యోగా చేస్తూ, పూర్తిగా శరీరాన్ని కప్పేసే వస్త్రాలను వేసుకుంటుంటే మనం మాత్రం నగ్నత్వం వైపు పరుగులు తీస్తున్నామని తీరథ్ రావత్ వ్యాఖ్యానించారు.

* అడ్వ‌కేట్ దంప‌తుల హ‌త్య కేసుతో టీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేద‌ని ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు స్ప‌ష్టం చేశారు.

* కుప్పకూలిన మిగ్​-21 విమానం- పైలెట్ మృతి.వాయుసేనకు చెందిన మిగ్​-21 బైసన్​ యుద్ధ విమానం కుప్పకూలగా ఒక పైలట్ మృతి చెందారు.మధ్య భారతంలోని ఓ శిక్షణా శిబిరం నుంచి ఉదయం టేక్​ ఆఫ్​ అవుతుండగా ఈ ప్రమాదం జరిగిందని వాయుసేన తెలిపింది.ఈ ఘటనలో గ్రూప్​ కెప్టెన్​ ఎ.గుప్తా చనిపోయారని వెల్లడించింది.మృతుడి కుటుంబానికి సంతాపం తెలిపిన వాయుసేన పూర్తి స్థాయి దర్యాప్తునకు ఆదేశించినట్లు వెల్లడించింది.

* మాజీ మంత్రి పొంగూరి నారాయణకు ఏపీ సీఐడీ అధికారులు బుధవారం నోటీసులు ఇచ్చారు. అంతేకాకుండా ఆయన నివాసంలో సోదాలు నిర్వహించారు.ఇక ఆయనకు సంబంధించిన విద్యా సంస్థలు, ఇతర కార్యాలయాల్లో కూడా సీఐడీ అధికారులు సోదాలు చేశారు.కూకట్‌పల్లిలోని లోధా అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న నారాయణ ఇంట్లో 41(ఆ) సి.ఆర్.పి.సి ప్రకారం నోటీసులు అందించారు.నారాయణ అందుబాటులో లేకపోవడంతో ఆయన భార్య రమాదేవికి ఉదయం 9.52 గంటలకు ఏపీ సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు.మార్చి 22న విజయవాడ సత్యనారాయణ పురంలోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో హాజరు కావాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.

* ఏసీబీ వలలో చిక్కిన చిత్తూరు జిల్లా వీఆర్వో రాజశేఖర్..వెంకటరమణ అనే రైతు నుంచి పట్టా పాసుబుక్ జారీ కోసం నగదు డిమాండ్..ఏసీబీ అధికారులను ఆశ్రయించిన రైతు వెంకటరమణ.చిత్తూరు జిల్లా మదనపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలో రామసముద్రం మండలం మాలేనత్తం గ్రామానికి చెందిన భూ పట్టా జారీ అంశం..రైతు నుంచి రూ..8,500 నగదు తీసుకుంటుండగా బుధవారం కార్యాలయంలో వీఆర్వో ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు..ఏసీబీ అధికారుల అదుపులో వీఆర్వో రాజశేఖర్.