ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ చరిత్రలో అత్యధిక పురుషుల సింగిల్స్ టైటిళ్ల వీరుడు రోజర్ ఫెదరర్‌కు నిరాశ ఎదురైంది. టోర్నీ క్వార్టర్ ఫైనల్స్‌లోనే స్విస్ దిగ్గజం కనీస పోరాటం కనబరచలేక ఘోర ఓటమి చవిచూశాడు. బుధవారం ఇక్కడ జరిగిన క్వార్టర్స్‌లో 20 గ్రాండ్ టైటిళ్ల విజేత ఫెదరర్ 3-6, 6-7 (4/7), 0-6 తేడాతో 14వ సీడ్ హుబర్ట్ హుర్కజ్ (పొలాండ్) చేతిలో గంటా 48 నిమిషాల్లోనే పరాజయం పాలయ్యాడు. తొలి రెండుసెట్లు హోరాహోరీగా పోరాడిన రోజర్.. చివరి సెట్లో పూర్తిగా తేలిపోయాడు. మ్యాచ్ మొత్తం 31 తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. హుర్కజ్ 10 ఏస్‌లు 36 విన్నర్లు సాధించగా.. ఫెదరర్ 5 ఏస్‌లు, 34 విన్నర్లు బాదాడు. గాయం కారణంగా ఇటీవల తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న ఫెదరర్‌కు ఇదే చివరి వింబుల్డన్ కావొచ్చన్న అభిప్రాయాలు వెలువడుతున్నాయి. కాగా మరో క్వార్టర్స్‌లో సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ 6-3, 6-4, 6-4 తేడాతో మార్టోన్ ఫక్సోవిక్ పై విజయం సాధించాడు. మరో మ్యాచ్‌లో 10వ సీడ్ డెనిస్ షపోవలోవ్(కెనడా) 6-4, 3-6, 5-7, 6-1, 6-4తో కరెన్ కచనోవ్‌పై ఉత్కంఠ పోరులో గెలిచాడు.
ఇంటికి ఫెదరర్
Related tags :