Politics

కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప రాజీనామా-తాజావార్తలు

కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప రాజీనామా-తాజావార్తలు

* కొవిడ్‌19 మహమ్మారి వ్యాప్తిని అరికట్టడానికి ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా తాత్కాలికంగా పెంచిన ప్లాట్‌ఫారం టికెట్‌ ధరను దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని సికింద్రాబాద్‌ డివిజన్‌లోని అన్ని రైల్వే స్టేషన్లలో తగ్గించారు.గతంలో ప్లాట్‌ఫారం టికెట్ల జారీ సికింద్రాబాద్‌ డివిజన్‌లో చిన్న స్టేషన్లతో సహా అన్ని స్టేషన్లలో తిరిగి పునరుద్ధరించారు.జోన్‌ నెట్‌వర్క్‌లో అన్‌ రిజర్వ్‌డ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు పునరుద్ధరించిన దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది.సికింద్రాబాద్‌ డివిజన్‌లోని అన్ని రైల్వే స్టేషన్లలో (నాన్‌ సబర్బన్‌ మరియు సబర్బన్‌ స్టేషన్లు అన్నింటిలోనూ) తగ్గించిన ప్లాట్‌ఫారం టికెట్‌ ధర రూ.10/ (పది రూపాయాలు మాత్రమే).సికింద్రాబాద్‌ మరియు హైదరాబాద్‌ స్టేషన్లలో మాత్రం ఈ ధర రూ.20/ (ఇరవై రూపాయాలు మాత్రమే)గా ఉంటుంది.

* దళిత బంధు కేవలం కార్యక్రమం కాదని ఉద్యమం అని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు.

* విపక్షాలు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో లోక్​సభ రేపటికి వాయిదా పడింది.

* ఉత్తర బంగాళాఖాతంలో ప్రస్తుతం కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనానికి అనుబంధంగా ఈ నెల 28న అల్పపీడన ద్రోణి ఏర్పడే అవకాశముందని అమరావతి వాతావరణ శాఖ ప్రకటించింది.

* పోలవరంలో భాగంగా 960 మెగావాట్ల విద్యుత్కేంద్రం కూడా ఉందని కేంద్రం పేర్కొంది. విద్యుత్కేంద్రానికి 108 లక్షల క్యూబిక్ మీటర్ల ఎర్త్ వర్క్ చేయాలని తెలిపింది.

* కర్ణాటక ముఖ్యమంత్రి మార్పుపై సస్పెన్స్‌కు తెరపడింది.బీఎస్‌ యడియూరప్ప సోమవారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.ఈ సాయంత్రం గవర్నర్‌ను కలిసి రాజీనామాను సమర్పించనున్నారు.

* ట్రాక్ట‌ర్ న‌డుపుతూ పార్ల‌మెంట్‌కు రాహుల్ గాంధీ..మోదీ స‌ర్కార్ తెచ్చిన నూత‌న సాగు చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా దేశ‌వ్యాప్తంగా ఆందోళ‌న జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే.అయితే ఆ కొత్త వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయాల‌ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఆ రైతు చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా ఆయ‌న ఇవాళ పార్ల‌మెంట్‌కు ట్రాక్ట‌ర్‌పై వ‌చ్చారు.

* గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు పర్మినెంట్ కావాలంటే డిపార్టుమెంట్ పరీక్ష తప్పక పాస్ కావాల్సిందేనని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఐఎఎస్‌లు సహా అన్ని విభాగాల ఉద్యోగులకూ మొదట్నుంచీ ఈ విధానమే అమలవుతోందన్నారు. గ్రామవార్డు సచివాలయాల్లో నియమితులైన వారిలో ఎవరి ఉద్యోగాలూ పోవని హామీ ఇచ్చారు.

* తెలంగాణ రాష్ట్రంలో రేషన్‌కార్డుల పంపిణీ ప్రారంభమైంది. మంత్రులు, ఎమ్మెల్యేలు లబ్ధిదారులకు నూతన రేషన్‌పత్రాలను అందజేశారు. పేద ప్రజల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తున్నట్లు మంత్రులు తెలిపారు. ఇందులో భాగంగానే అర్హులైన ప్రతి ఒక్కరికీ నూతన ఆహార భద్రతా కార్డులను ఇస్తున్నట్లు చెప్పారు.

* విశాఖ స్టీల్‌ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంలో పునరాలోచన లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు లోక్‌సభలో వైకాపా ఎంపీ మాధవ్‌ ప్రశ్నకు కేంద్ర మంత్రి భగవత్‌ కిషన్‌రావు కరాడ్‌ లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను వెనక్కి తీసుకోవాలని గత కొన్ని నెలలుగా ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే.

* ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల నష్టపోయిన వారిని ప్రభుత్వం ఆదుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు ఆయన లేఖ రాశారు. వారం రోజులుగా రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. ఎకరాకు రూ.15 వేల చొప్పున చెల్లించాలని కోరారు. విత్తనాలు, ఎరువులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వాలన్నారు.

* ‘పదవిలో ఉన్న ప్రతిక్షణం అగ్నిపరీక్షను ఎదుర్కొన్నా’’.. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే ముందు యడియూరప్ప భావోద్వేగభరితంగా చెప్పిన మాటలివి. నిజమే.. ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడం అంటే మామూలు విషయం కాదు. అయితే ఐదేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగడం అంతకంటే పెద్ద సవాలే.

* మానవ హక్కులు, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణలో భారత్‌ సాధించిన విజయాలు దేశానికే గర్వకారణమని కేంద్రం తెలిపింది. భారత్‌లో మానవ హక్కులు, ప్రజాస్వామ్య విలువలపై ఆందోళన వ్యక్తం చేస్తూ అమెరికా ప్రతినిధులు చేసిన వ్యాఖ్యలకు భారత్‌ దీటుగా బదులిచ్చింది. జులై 27న భారత్‌కు రానున్న అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ ఈ అంశాలను లేవనెత్తనున్నారన్న వార్తల నేపథ్యంలో కేంద్రం స్పందించింది.

* ఇప్పటివరకూ తెలియని పురాతన వైరస్‌లను అమెరికా శాస్త్రవేత్తలు గుర్తించారు. అవి 15వేల సంవత్సరాల నాటివని తేల్చారు. టిబెట్‌ పీఠభూమిపైన ఉన్న ఒక హిమానీనదంలోని మంచు నమూనాల్లో ఇవి వెలుగు చూశాయి. పశ్చిమ చైనాలో 22వేల అడుగుల ఎత్తులో ఉన్న గులియా మంచు పర్వతం నుంచి శాస్త్రవేత్తలు రెండు మంచు కోర్‌ నమూనాలను సేకరించారు. శిఖారాగ్రం నుంచి 1,017 అడుగుల లోతులో వీటిని తీసుకొని, పరిశీలన జరిపారు.

* దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం నష్టాలతో ముగిశాయి. ఉదయం ఊగిసలాటతో ప్రారంభమైన సూచీలు ఓ దశలో లాభాల్లోకి జారుకున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ నుంచి లభించిన మద్దతును రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ నష్టాలు తగ్గించాయి. దీంతో సూచీలు తిరిగి నష్టాల్లోకి జారుకొని ఇంట్రాడే కనిష్ఠాల్ని నమోదు చేశాయి.

* చాలా కాలంగా థియేటర్‌ ఎక్స్‌పీరియన్స్‌ మిస్‌ అవుతున్న సినిమా ప్రియులు ఎప్పుడెప్పుడు సినిమాలు విడుదలవుతాయా? అని ఎదురుచూస్తున్నారు. ప్రేక్షకుల ఎదురు చూపులకు తగ్గట్టుగానే సినిమాలూ విడుదలకు సై అంటున్నాయి. కొన్ని సినిమాలు థియేటర్లలో మరికొన్ని సినిమాలు ఓటీటీల్లో సందడి చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. అవేంటో ఓసారి చూద్దాం..

* మీరాబాయి చాను.. టోక్యో ఒలింపిక్స్‌లో భారత కీర్తిపతాకను రెపరెపలాడించిన అథ్లెట్‌. మహిళల వెయిట్‌ లిఫ్టింగ్‌ 49 కిలోల పోటీల్లో ఆమె రజత పతకం సాధించి చరిత్ర సృష్టించింది. కరణం మల్లీశ్వరి తర్వాత దేశానికి పతకం అందించింది. అనూహ్య పరిణామాలు జరిగితే ఆమె పతకం వెండి నుంచి బంగారానికి అప్‌గ్రేడ్‌ కానుంది!