DailyDose

గుంటూరులో 555 మంది రౌడీషీటర్లు-నేరవార్తలు

గుంటూరులో 555 మంది రౌడీషీటర్లు-నేరవార్తలు

* రౌడీ షీటర్ పై ఉక్కుపాదం…ఏసీపీ షాను..మాకినేని బసవపున్నయ్య స్టేడియం లో 555 మంది రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించన నార్త్ జోన్ ఏసీపీ షేక్ షాను…ఈ కార్యక్రమంలో సిఐలు బాలమురళీకృష్ణ, లక్ష్మీనారాయణ, హనీష్ బాబు, ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు.నార్త్ జోన్ పరిధిలో ఈ సంవత్సరం లో కొత్తగా 53 రౌడీషీట్ ఓపెన్ చేసాం.అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.నేర ప్రవృత్తి ప్రతి ఒక్కరు మార్చుకోవాలని ఏసీపీ షాను హెచ్చరించారు.ప్రతిరోజు రాత్రి సమయంలో రౌడీషీటర్ ఇంటి వద్దకు వెళ్లి సబ్ ఇన్స్పెక్టర్ అధికారి పెట్రోలింగ్ నిర్వహిస్తారు..మహిళా భద్రత విషయంలో దిశ యాప్ ఎంతగానో తోడ్పడుతుంది.నగరంలో పాఠశాల, కళాశాల వద్ద దిశా పెట్రోలింగ్ వాహనం ఉంటుంది..నగరంలో 3 లక్షల 69 వేల 174 సెల్ఫోన్లో దిశా యాప్ డౌన్లోడ్ చేయగా ఒక నార్త్ జోన్ లోనే 74,556 మొబైల్స్ లో యాప్ డౌన్లోడ్ చేయించిమన్నారు.ఒంటరిగా ఉంటున్న వృద్ధులకు దిశ యాప్ ను అర్థమయ్యేలా వివరిస్తున్నాం.నార్త్ జోన్ పరిధిలో ఆరు దిశ పెట్రోలింగ్ వెహికల్స్ అందుబాటులోకి తీసుకువచ్చాం.నేరస్తుల పై ప్రత్యేక నిఘా పెట్టాం..నగరంలో పాత నేరస్తుల కదలికలను ఎప్పటికప్పుడు గమనించడంతో పాటు ప్రతి ఆదివారం కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తున్నాం.ఎన్ఫోర్స్మెంట్ టీమ్ తో ఆకతాయిలకు చెక్ పెడుతున్నాం..బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి వారిపై, ఆకతాయిలు ఆగడాలను అరికట్టేందుకు ఎన్ఫోర్స్మెంట్ టీం ఏర్పాటు చేశాం..

* అఫ్గనిస్తాన్‌లో ఆధిపత్య పోరు ఆసక్తికరంగా మారింది.  అఫ్గన్‌ ప్రతిఘటన దళాలు, తాలిబన్లు చేస్తున్న పరస్పర పైచేయి ప్రకటనలు గందరగోళానికి దారితీస్తున్నాయి. కీలకమైన పంజ్‌షీర్‌ ప్రావిన్స్‌ తమ ఆధీనంలోకి తెచ్చుకున్నామని తాలిబన్లు ప్రకటించుకున్న విషయం తెలిసిందే. ఈలోపు పంజ్‌షీర్ తిరుగుబాటు దళం ఆ ప్రకటనను ఖండించింది. యుద్ధం కొనసాగుతోందని… పంజ్‌షీర్‌ లొంగిపోలేదని స్పష్టం చేసింది. ఇప్పుడు పంజ్‌షీర్ ప్రతిఘటన దళం నుంచి మరో ప్రకటన వచ్చింది. హోరాహోరీ పోరులో 600 మంది తాలిబన్లను మట్టుపెట్టినట్లు ప్రకటించుకుంది..

* లూడో గేమ్‌ విషయంలో ఇద్దరు యువకుల మధ్య జరిగిన ఘర్షణ ఒకరి మృతికి దారితీసింది. ఈ ఘటన పాతబస్తీలోని మంగళ్‌హాట్‌ పరిధి గుఫ్ఫానగర్‌లో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. లూడో గేమ్‌ ఆడిన హనీఫ్‌, హాజీ అనే ఇద్దరు యువకులు.. డబ్బు విషయలో ఘర్షణ పడ్డారు. ఈ క్రమంలో పరస్పరం దాడి చేసుకున్నారు. దీంతో హనీఫ్ అక్కడికక్కడే మృతిచెందగా.. హాజీకి తీవ్రగాయాలయ్యాయి. హాజీని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై మంగళ్‌హాట్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

* గుంటూరు జిల్లా నరసరావుపేట, వినుకొండ పరిధిలో రూ.6.5 లక్షల విలువైన మద్యం సీసాలను పోలీసులు సీజ్‌ చేశారు. నరసరావుపేట ఎస్ఈబీ అధికారులు ఆదివారం వాహనాల తనిఖీ చేపట్టగా లారీలో భారీ ఎత్తున అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ చంద్రశేఖర రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. అనంతపురానికి చెందిన దండే క్రాంతికుమార్‌, కడపకు చెందిన దండే చైతన్యకుమార్‌లు గోవా నుంచి మద్యాన్ని అక్రమంగా తీసుకువచ్చి చుట్టుపక్కల గ్రామాల్లోని విక్రయదారులకు సరఫరా చేస్తున్నారని ఎస్‌ఈబీ అధికారులకు సమాచారం అందింది. దీంతో వాహన తనిఖీలు చేపట్టి మద్యం తరలిస్తున్న ఐషర్‌ లారీని పట్టుకున్నారు. తనిఖీల్లో సుమారు రూ.6.50 లక్షల విలువ చేసే 2005 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని లారీని సీజ్‌ చేశారు. అక్రమంగా గోవా నుంచి మద్యం తరలిస్తున్న ఐదుగురు నిందుతులను అదుపులోకి తీసుకున్నామని వారిపై కేసు నమోదు చేశామని చంద్రశేఖర రెడ్డి వెల్లడించారు.

* అనంతపురం జిల్లా తాడిపత్రి శివారులో వైకాపా నాయకుడు పోతులయ్య హత్యకు గురయ్యాడు. పెన్నా నదిలో అతని మృతదేహం లభ్యమైంది. మృతుడిని తాడిపత్రి మండలం గన్నేవారిపల్లి వాసిగా గుర్తించారు. హత్యకు గల కారణాలు తెలియరాలేదు. పోతులయ్య మృతి ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.