DailyDose

TNi నేటి నేర వార్తలు.

TNi  నేటి నేర వార్తలు.

డీసీసీబీలో చేతివాటం
వినుకొండ బ్రాంచ్‌లో రూ.2 కోట్లు స్వాహా
డ్వాక్రా రుణాలను ఖాతాల్లోకి మళ్లించుకున్న ఉద్యోగి గుట్టుచప్పుడు కాకుండా దర్యాప్తు చేపట్టిన అధికారులు

అక్రమాలకు కేంద్రంగా జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌(డీసీసీబీ) నిలుస్తోంది. వడ్డీల రాయితీలు.. రుణాల కిస్తీలు.. లబ్ధిదారుల పేరిటే రుణాలు స్వాహా చేయడంలో బ్యాంకు ఉద్యోగులు చేతివాటం చూపుతున్నారు. తరచూ ఇలాంటి అక్రమాలు వెలుగుచూస్తోన్నా అధికారులు కఠిన చర్యలు తీసుకోవడంలేదు. తూతూమంత్రపు చర్యలతో సరిపుచ్చుతుండటంతో అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. ఇటీవల పొన్నూరులో రైతులకు ప్రభుత్వం ఇచ్చే వడ్డీ రాయితీ సొమ్మును తన ఖాతాలోకి జమ చేసుకున్న ఉద్యోగి ఉదంతం వెలుగుచూసింది. ఈ ఘటన మరిచిపోకముందే తాజాగా వినుకొండ బ్రాంచ్‌లో డ్వాక్రా రుణాలను తన ఖాతాలోకి వేసుకున్న సంఘటన వెలుగుచూసింది. రెండేళ్లుగా సాగిన ఈ వ్యవహారంలో ఓ ఉద్యోగి సుమారు రూ.2 కోట్ల వరకు తన ఖాతాలోకి జమ చేసుకున్నట్లు గుంటూరులోని బ్యాంక్‌ ప్రధాన కార్యాలయ అధికారుల దృష్టికి వచ్చింది. బ్రాంచ్‌లో అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగి కీలకబాధ్యతల్లో ఉన్నాడు. ఇతడు డ్వాక్రా గ్రూపుల పేరిట పోర్జరీ సంతకాలతో రుణాల దరఖాస్తులు చేసేవాడు. వాటికి రుణాలు మంజూరు కాగానే ఆ సొమ్ములను తన సొంత ఖాతాకు, మరికొన్ని కుటుంబ సభ్యుల ఖాతాల్లో జమ చేసుకుంటూ ఉండేవాడు. రన్నింగ్‌ రుణాల పేరుతో కొత్త రికార్డులను తనపరిధిలోనే ఉంచుకుని రెండేళ్ల పాటు ఈ కుంభకోణాన్ని కొనసాగించాడు. ఈ రుణాలకు సంబంధించి మూడు నెలలకొకసారి కొంత సొమ్ము నమోదు చేస్తూ ఎవరికీ అనుమానం రాకుండా చేసేవాడు. ఇటీవల నాబార్డు ఆడిటర్ల హెచ్చరికతో బ్రాంచ్‌ నోడల్‌ అధికారులు డ్వాక్రా రుణాలపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టారు. ఈ క్రమంలో వినుకొండ బ్రాంచ్‌లో అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగి చేతివాటం వెలుగుచూసింది. దీంతో నాలుగు రోజుల నుంచి గుట్టుచప్పుడు కాకుండా అధికారులు రికార్డులను తనిఖీ చేస్తున్నారు.
ప్రధాన కార్యాలయంలో సమీక్షవినుకొండ బ్రాంచ్‌లో వెలుగుచూసిన కుంభకోణంపై బుధవారం గుంటూరు ప్రధాన కార్యాయంలో చైర్మన్‌ లాల్‌పురం రాము, పాలకవర్గ సభ్యులు నాయక్‌, కోట హరిబాబు, వెంకటేశ్వరరావులు సీఈవో కృష్ణవేణి, జీఎం భాను, డీజీఎంలు ఫణి, అజయకిషోర్‌తో సమీక్షించారు. ఇప్పటికే డ్వాక్రా రుణాల పంపిణీలో అవకతవకలపై వచ్చిన ఫిర్యాదులతో ఇద్దరు మేనేజర్లను బదిలీ చేశారు

దేవుడు దగ్గర కూడా అధికారం చలాయిస్తున్న అధికార పార్టీ ఎమ్.ఎల్.ఏ

అమ్మవారికి ప్రతి సంవత్సరము దసర సరన్నవరాత్రులు జరుగుతాయి. ఈ దసర నవరోత్సవల లో ప్రతి రోజు ఒక అవతారముతో దర్శనము ఇస్తారు. ఈ తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలతో దర్శనము ఇస్తారు. ఈ తొమ్మిది రోజులు పాటు అన్ని ప్రాంతాల నుండి కొన్ని వేల సంఖ్యలో భక్తులు తరలి వస్తారు.
ఎక్కడో దూర ప్రాతాల నుండి భక్తులు టికెట్ తీసుకుని క్యూ లైన్ల లో అమ్మవారి దర్శనానికి వస్తారు.దాంట్లో భాగంగా వృద్ధులు, పసిపిల్లలు ను తీసుకుని కూడా వస్తుంటారు. అమ్మవారి దర్శనం కోసం పడిగాపులు కాస్తుంటే మాజీ మంత్రి వెల్లం పల్లి శ్రీనివాస్ అమ్మవారి దగ్గర కూడా అధికారాన్ని చాలయిస్తూ నేరుగా అమ్మవారి దర్శనానికి 40 నుండి 50 మంది వరకు దర్శనానికి వెళ్లారు వాళ్ళు దర్శనానికి వెళ్లి వచ్చే లోపు క్యూ లైన్ల లో పసి పిల్లలను వేసుకుని పడిగాపులు కాస్తూ భక్తులు తీవ్రమైన ఇబ్బందులు కు గురవుతున్నారు.ఇంత జరుగుతున్న ఎమ్ పట్టనట్లుగా వ్యవహరిస్తున్న అధికార యంత్రాంగం.

అమ్మవారి దగ్గర అందరూ సమానం కాదా?

అధికారం ఉంటే వారి ఇస్టా రాజ్యమా?

ఇలా ఉంటే సామాన్య ప్రజలు పరిస్థితి ఏంటి?

కరోనాతో మరణించిన వారికి ఆర్ధిక సాయం అందిస్తామంటూ వచ్చే ఫోన్ కాల్స్ ను నమ్మి మోసపోకండి

👉 మోసగాళ్లకు వ్యక్తిగత, బ్యాంక్ ఖాతా వివరాలు ఇవ్వవద్దు

👉 బాధితులకు అండగా పోలీసు శాఖ.. సమీప పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలి

జిల్లా ఎస్.పి శ్రీ కె.కె.ఎన్ అన్బురాజన్ ఐ.పి.ఎస్ వెల్లడి
కడప సెప్టెంబర్ 29: జిల్లాలో కరోనా వైరస్ బారిన పడి మరణించిన వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం ఆర్ధిక సాయం అందిస్తుందని చెబుతూ సైబర్ నేరగాళ్ల బారిన పడి పలువురు మోసపోయినట్లు తమ దృష్టికి వచ్చిందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్.పి శ్రీ కె.కె.ఎన్ అన్బురాజన్ ఐ.పి.ఎస్ సూచించారు. గురువారం జిల్లా ఎస్.పి గారు ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేశారు. కరోనా బారిన పడి మృతి చెందిన కుటుంబాలకు ఆర్ధిక సాయం అందించే యాప్ ల పేరిట లేదా మెసేజ్ లింకులను ఎట్టి పరిస్థితుల్లో క్లిక్ చేయవద్దని సూచించారు. ఇటీవలి కాలంలో మినిమం బ్యాంక్ బ్యాలన్స్ రూ. 50 వేలు ఉండాలని చెబుతూ, సదరు బ్యాంకు ఖాతా వివరాలు, ఓ.టి.పి చెబితే మీ ఖాతాలో డబ్బులు జమవుతాయని ఫోన్ చేస్తూ ప్రజలను మాయమాటలతో మోసగిస్తున్నారని, ఎవరైనా ఫోన్ చేసినా మీ వ్యక్తిగత వివరాలు, బ్యాంక

ఎన్టీఆర్ జిల్లా:

విజయవాడ రూరల్ గొల్లపూడి సారాకోట్ల సెంటర్ పెట్ట్రాల్ బంక్ దెగ్గర నేషనల్ హెయ్ పై గోర రోడ్డు ప్రమాదం

బైక్ నెర్చుకుంటూ పెట్ట్రాల్ బంక్ లో నుంచి అదుపుతాప్పి హేయ్ పైకి దూసుకు వొచ్చి ఆటుగా వెళ్తున్న ట్యాంకర్ కింద పడి మరణించిన యువతి.

హోటల్ సమయపాలనపై… ఏకంగా హోంమంత్రికే ఫోన్ చేశాడు

పాతబస్తీ అంటే ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. బిర్యాని పేరు వినగానే టక్కున గుర్తుకొచ్చేది భాగ్యనగరం. అలాంటి హైదరాబాద్ నగరంలో రకరకాల బిర్యానీలు ఎంతో ఫేమస్. ముఖ్యంగా పాతబస్తీలోని హోటళ్లలో బిర్యానీ విక్రయాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఏ టైం అయినా బిర్యానీ దొరుకుతుందని నమ్మకం. కానీ.. ఈ మధ్య హోటళ్లు తెరిచి ఉంచే టైంపై ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి ఏకంగా హోంమంత్రికి ఫోన్ చేసిన హోటళ్లు తెరిచి ఉంటే సమయంపై ఆరా తీశాడు. పాతబస్తీలో ఎన్ని గంటల వరకు హోటల్స్ తెరిచి ఉంచాలో చెప్పాలని మహమూద్ అలీని అడిగాడు.
అర్ధరాత్రి సమయంలో ఆ వ్యక్తి ఫోన్ చేయడంపై హోంమంత్రి మహమ్మద్ అలీ అసహనం వ్యక్తం చేశారు. తాను హోంమంత్రిని అని.. సవాలక్ష టెన్షన్లు ఉంటాయని మహమూద్ అలీ సమాధానం ఇచ్చారు. అయినా కూడా అర్ధరాత్రి వరకు విక్రయాలు జరగాలా అంటూ.. ఆ వ్యక్తి హోంమంత్రిని అడిగాడు. దీంతో అలా జరగదని.. రాత్రి 11 గంటలకే అన్ని హోటల్స్ మూసివేస్తారని హోంమంత్రి మహమూద్ అలీ స్పష్టం చేశారు. నిబంధనలు అందరూ ఫాలో అవ్వాల్సిందేనని చెప్పారు.
అయితే.. అర్ధరాత్రి వరకు బిర్యానీ విక్రయాలకు అనుమతి ఉందంటూ.. హోటళ్ల నిర్వాహకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే పాతబస్తీలో అర్ధరాత్రి వరకు బిర్యానీ విక్రయాలకు అనుమతి ఇవ్వాలంటూ.. హైదరాబాద్ సీపీని కూడా కలిశారు. కానీ ఇంతవరకు దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే.. తాజాగా ఫోన్ చేసిన వ్యక్తి హోంమంత్రికి ఆసక్తికర ఫిర్యాదు చేశారు. లేట్ నైట్ వరకు బిర్యానీ విక్రయాలు జరపడం కారణంగా తాము ఇబ్బంది పడుతున్నామని ఫిర్యాదు చేశారు. అయితే.. అర్ధరాత్రి ఫోన్ చేసి ఫిర్యాదు చేయడం ఇప్పుడు అదర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది

30-09-2022
పెడన- కృష్ణా జిల్లా

సత్యకుమార్.. ఒళ్ళు దగ్గర పెట్టుకో..
– బీజేపీ నేత సత్యకుమార్ వ్యాఖ్యలపై రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీ జోగి రమేష్ ఫైర్ః

1- బీజేపీ జాతీయ కార్యదర్శి సత్య కుమార్ రాష్ట్ర ప్రభుత్వంపైనా, ముఖ్యమంత్రిగారిపైనా నోటికొచ్చిన ఆరోపణలు చేస్తున్నారు. సత్య కుమార్ అనే వ్యక్తి అసత్య కుమార్ గా మారి అబద్ధాలు ప్రచారం చేస్తూ, తద్వారా మరెవరికో రాజకీయంగా లబ్ధి చేకూర్చాలని ప్రయత్నం చేస్తున్నాడు.

2- సత్య కుమార్ మాటలు చూస్తుంటే.. అసలు ఆ వ్యక్తి బీజెపికి చెందిన కార్యదర్శిగా కాకుండా, టీడీపీకి చెందిన కార్యదర్శిలా మాట్లాడుతున్నాడు. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అభివృద్ధిని చూసి బీజేపీ నేర్చుకోవాలి. పథకాల్లో అవినీతి అని సిగ్గులేకుండా సత్యదూరమైన మాటలను సత్యకుమార్ మాట్లాడుతున్నాడు. నీ వెనుక ఎవరున్నారు, వారి చరిత్ర ఏమిటో కూడా ప్రజలకు తెలుసు. అసలు ఈ రాష్ట్రంలో నిన్ను ఎవరైనా గుర్తుపడతారా.. ప్రభుత్వంపైన నాలుగు విమర్శలు చేసి, దులుపుకుని వెళ్ళే సత్యకుమార్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి.

3- బీజెపి పాలిత ఏ రాష్ట్రంలో కూడా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయటం లేదు. దేశంలో మరెక్కడా లేనివిధంగా చీఫ్ మినిస్టర్ టు కామన్ మ్యాన్ కు, ప్రతి గడపకూ, ప్రతి రైతు కుటుంబానికీ, ప్రతి అక్కచెల్లెమ్మకూ పథకాలు చేరే విధంగా, నేరుగా ముఖ్యమంత్రి గారు బటన్ నొక్కితే కామన్ మ్యాన్ బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు జమ కావడం మన రాష్ట్రంలోనే జరుగుతుంది. ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు మీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా చూశావా సత్యకుమార్..?

4- రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో జరుగుతున్న సంక్షేమం చూసి ఓర్వలేక, సత్య కుమార్ లాంటి వారు చేస్తున్న అసత్య, అసందర్భ పిచ్చి ప్రేలాపనలను ప్రజలు గమనిస్తున్నారు. మీకు సరైన సమయంలో తగిన రీతిలో ప్రజలు బుద్ధి చెబుతారు.

5- టీడీపీ ఎజెండాతో సత్య కుమార్ అసత్యాలను, అవాస్తవాలు ప్రచారం చేసి ప్రభుత్వంపై బురదచల్లాలని చూస్తున్నాడు. మరొకసారి ఇటువంటి బురదజల్లే మాటలను మాట్లాడితే సత్యకుమార్ కి తగిన శాస్తి జరుగుతుందని మంత్రి జోగి రమేష్ హెచ్చరించారు.