NRI-NRT

కెనడాలో తాకా 2022 దీపావళి

కెనడాలో తాకా 2022 దీపావళి

కెనడా లో తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా (తాకా) అక్టోబర్ 29, 2022 శనివారం నాడు దీపావళి ఉత్సవాలను టొరంటో లోని టొరంటో పెవిలియన్ ఆడిటోరియంలో అంగ రంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమమును ఎన్నడూ లేనంత గా 1500 పైగా కెనడా లో ని తెలుగు వారు పాల్గొని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమాన్ని అనిత సజ్జ, లిఖిత యార్లగడ్డ, ఇందు నిట్ల, విద్య బుద్ధరాజు, జయకిరణ్ కొనకాల వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. మొదటగా తాకా కార్యదర్శి ప్రసన్న తిరుచిరాపల్లి కార్యక్రమానికి విచ్చేసిన అతిధులను అందరినీ ఆహ్వానించి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. తాకా అధ్యక్షులు కల్పన మోటూరి మరియు కీర్తి కూన, శ్రీదేవి పేరిచర్ల, శృతి ఏలూరి, వీణ మార్పిన గారు కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో దీపావళి ఉత్సవాలను ప్రారంభించారు. కల్పన గారు అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేసి గత రెండు సంవత్సరాలుగా తాకా చేస్తున్న ఎన్నో మంచి కార్యక్రమాలు గురించి వివరించారు. ఆ తర్వాత 200 మందికి పైగా చిన్నారులు, కళాకారులు వారి ఆట పాటలతో, నృత్యాలతో, 40 కి పైగా తెలుగు సాంస్కృతిక కార్యక్రమాలను 7 గంటలు పాటు కనీవినీ ఎరుగని రీతిలో అందరినీ అలరించారు. ఈ సందర్భంగా తాకా కార్యవర్గం ఎన్నో సంవత్సరాల నుండి తాకాకు చేయూతనిస్తున్న ప్రధాన దాతలు రమేష్ గోల్లు, ఆనంద్ పేరిచర్ల మరియు ఇతర గోల్డ్, సిల్వర్ దాతలందరినీ శాలువాతో గౌరవంగా సత్కరించి మరియు మొమెంటోలు అందజేయడం జరిగింది. తాకా వ్యవస్థాపక సభ్యులు హనుమంతాచారి సామంతపూడి గారు దీపావళి శుభాకాంక్షలు అందచేసి తాకా గత 12 సంవత్సరాలుగా ఎంతగా కెనడాలో అభివృద్ధి చెందిందో తెలియచేసారు. ఈ ఉత్సవాలలో వివిధ రకాలైన తెలుగు వంటకాలతో దీపావళి విందును తాకా వారు ఏర్పరచి కెనడాలో దీపావళి పండుగ వాతావరణాన్ని సృష్టించారు.

ఈ కార్యక్రమ విజయానికి కృషి చేసిన ఉపాధ్యక్షులు నాగేంద్ర హంసాల, కార్యదర్శి ప్రసన్న తిరుచిరాపల్లి, కోశాధికారి మల్లికార్జునచారి పదిర, సాంస్కృతిక కార్యదర్శి అనిత సజ్జ, డైరెక్టర్లు గణేష్ తెరాల,రాణి మద్దెల, శృతి ఏలూరి, ప్రదీప్ రెడ్డి ఏలూరు, యూత్ డైరెక్టర్స్ విద్య భవనం, ఖాజిల్ మహమ్మద్ మరియు బోర్డు ఆఫ్ ట్రస్టీ చైర్మన్ మునాఫ్ అబ్దుల్, సభ్యులు రాఘవ అల్లం, సురేష్ కూన, వాణి జయంతి, ప్రవీణ్ పెనుబాక మరియు తాకా వ్యవస్థాపక చైర్మన్ రవి వారణాసి, సభ్యులు చారి సామంతపూడి, శ్రీనాథ్ కుందూరు, అరుణ్ లయం ,లోకేష్ చిల్లకూరు,రమేష్ మునుకుంట్ల, రాకేష్ గరికపాటి, రామచంద్ర రావు దుగ్గిన మరియు అందరి వాలంటీర్లను తాకా అధ్యక్షులు కల్పన మోటూరి గారు అభినందించారు. తాకా ఉపాధ్యక్షులు నాగేంద్ర హంసాల గారు కార్యక్రమంలో పాల్గొన్న తెలుగు వారందరికీ, దాతలకు, అతిధులకు, వాలంటీర్లకు తాకా తరపున ధన్యవాదములు తెలియచేశారు. చివర గా కెనడా మరియు భారత దేశ జాతీయ గీతాలు ఆలపించి కార్యక్రమాన్ని జయప్రదం గా ముగించడం జరిగింది.