Movies

మీసాలు ఎందుకు తీశారు?

Auto Draft

ఆనంద్‌ రవి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘కోరమీను’. ‘స్టోరీ ఆఫ్‌ ఇగోస్‌’ అనేది ఉపశీర్షిక. శ్రీపతి కర్రి దర్శకుడు. పెళ్లకూరు సమన్యరెడ్డి నిర్మాత. ఈ చిత్రం టీజర్‌ను దర్శకుడు గోపీచంద్‌ మలినేని సోషల్‌మీడియా ద్వారా విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ జాలరీపేట అనే మత్స్యకారుల కాలనీకి కొత్తగా వచ్చిన మీసాల రాజు మీసాలు ఎవరు తీసేశారనేది ఆసక్తికరంగా వుంటుంది.

ఓ డ్రైవర్‌, డబ్బు, అహంకారం వున్న అతని యజమాని, వైజాగ్‌లో శక్తివంతమైన పోలీస్‌, ఈ ముగ్గురి పాత్రల చుట్టూ కథ తిరుగుతుంది. మంచి కంటెంట్‌తో వస్తున్న చిత్రమిది. అందరికి నచ్చుతుంది. టీజర్‌కు మంచి స్పందన వస్తున్నది చిత్రం కూడా అందర్ని అలరిస్తుందనే నమ్మకం వుంది’ అన్నారు. హరీష్‌ ఉత్తమన్‌, శత్రు, రాజారవీంద్ర తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: పవన్‌కుమార్‌ జనస్వామి.