హీరో రామ్‌చరణ్‌తో దర్శకుడు సుకుమార్ రూపొందించిన ‘రంగస్థలం’ సినిమా తెలుగు తెరపై భారీ విజయాన్ని సాధించింది. లోకల్ ఎంపవర్‌మెంట్ గురించి చెప్పిన ఈ సినిమా చరణ్ కెరీర్‌లో మైల్‌స్టోన్‌గా నిలిచింది. అప్పటిదాకా సరైన విజయాలు లేని దర్శకుడు సుకుమార్‌ను కూడా మళ్లీ లైమ్‌లైట్‌లోకి తీసుకొచ్చింది. ఇక ఈ కాంబో మరోసారి రిపీట్ కానుందని తెలుస్తున్నది. దర్శకుడు సుకుమార్, నిర్మాత అభిషేక్ అగర్వాల్, బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి కలిసి ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌కు సన్నాహాలు చేసుకుంటున్నారు.
ఈ చిత్రంలో హీరోగా రామ్‌చరణ్ నటిస్తున్నారని సమాచారం. ఇది చరణ్‌కు 16వ చిత్రం. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రామ్‌చరణ్ నటిస్తున్నారు. ఆయన తర్వాత చిత్రమేదీ అంగీకరించలేదు. రామ్‌చరణ్ తదుపరి చిత్రంగా సుకుమార్ దర్శకత్వంలో నటించే సినిమానే ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం సుకుమార్ అల్లు అర్జున్‌తో ‘పుష్ప 2’ సినిమాను రూపొందిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది.