Movies

లగ్జరీ కారులో దిగాలి

లగ్జరీ కారులో దిగాలి

హీరోయిన్‌ అంటే ఇలాగే ఉండాలనే కొన్ని రూల్స్‌ చెబుతుంటారని, వాటిని తానెప్పుడూ పాటించలేదని చెబుతున్నది బాలీవుడ్‌ తార రాధిక ఆప్టే. తానో స్టార్‌నని ఎప్పుడూ అనుకోనని, అందుకే ఓ సాధారణ యువతిలా ప్రవర్తిస్తుంటానని ఆమె చెప్పింది. ‘బద్లాపూర్‌’, ‘హంటర్‌’, ‘పాడ్‌మ్యాన్‌’ వంటి చిత్రాలతో నాయికగా పేరు తెచ్చుకుంది రాధిక. ఆమె నటించిన ‘విక్రమ్‌ వేద’ ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది.
తాజా ఇంటర్వ్యూలో రాధిక మాట్లాడుతూ…‘ఫిల్మ్‌ ఇండస్ట్రీలో సెలబ్రిటీ ప్రవర్తనకు కొన్ని నిబంధనలు పాటించాలని చెబుతుంటారు. హీరోయిన్లు లగ్జరీ కారులో దిగాలి. వేసుకున్న దుస్తులు మళ్లీ రిపీట్‌ చేయకూడదు. ఆలస్యంగా సినిమా షూటింగ్‌కు లేదా కార్యక్రమాలకు రావాలి. కానీ నాకు ఇలాంటి రూల్స్‌ నచ్చవు. నా మనసుకు నచ్చినట్లు ఉండాలనుకుంటా. నేనెలా ఉన్నా..నా కెరీర్‌ సంతృప్తికరంగా సాగుతున్నది. లాక్‌డౌన్‌ వల్ల నేను నటించాల్సిన కొన్ని హాలీవుడ్‌ ప్రాజెక్ట్స్‌ ఆలస్యమయ్యాయి’ అని చెప్పింది. ప్రస్తుతం ఆమె ‘మోనికా ఓ మై డార్లింగ్‌’ అనే చిత్రంలో నటిస్తున్నది.