DailyDose

హైదరాబాదులో కాపు నేతల రహస్య భేటీ

హైదరాబాదులో కాపు నేతల రహస్య  భేటీ

తెలుగు రాష్ట్రాల కాపు నేతలు హైదరాబాద్ లో రహస్య సమావేశం
వర్ధమాన రాజకీయాల పై చర్చ

హైదరాబాద్ లో ఏపీ కాపు నేతలు సమావేశం కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయింది. ఇటీవలే బీఆర్ఎస్ లో చేరి ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడయిన తోట చంద్రశేఖర్, మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ సహా కొందరు కాపు ప్రముఖులు ఈ సమావేశానికి హాజరయినట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలో ఏపీలో కేసీఆర్ ఆలోచన వివరించిన తోట చంద్రశేఖర్ తాను ఎందుకు అయన వెంట నడిచాను. అనే విషయం మీద నడిచాను
అని కూడా వివరించినట్టు తెలుస్తోంది. ఇక ఈ క్రమంలోనే టీడీపీ, బీజేపీ, వైఎస్సార్సీపీ, జనసేనలో కాపుల పరిస్థితి పై చర్చ జరిగిందని అంటున్నారు.

తోట చంద్రశేఖర్ సహా ఇతర నాయకులు బీఆర్ఎస్ లో చేరికకు గల కారణాలపై చర్చ జరగగా ఏపీలో కాపులను సీఎం చేస్తానని హామీ కేసీఆర్ ఇచ్చారని చెప్పినట్టు తెలుస్తోంది. కేసీఆర్ హామీ వెనుక ఉన్న ప్లాన్ ఏంటో అనే అంశం మీద కూడా కాపు నేతలు చర్చలు జరిపారని తెలుస్తోంది.
ఇప్పటికే ఏపీ రాజకీయాలపై కేసీఆర్ ఫోకస్…త్వరలో ఆంధ్రాలో సభలు, పర్యటనలకు సిద్ధమయిన అంశం మీద కూడా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఇక టీడీపీ,జనసేన పొత్తులపై ఆసక్తికరమైన చర్చ జరిగిందని, ఇరు పార్టీలు కలిస్తే ఎవరికి అడ్వాంటేజ్, కాపులకు పవర్ షేరింగ్ ఛాన్స్ పై ప్రస్తావన వచ్చిందని అంటున్నారు. ఇటీవల కాపు నేత హరిరామ జోగయ్య రాసిన లేఖపై కూడా ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది.

నిజానికి ఆంధ్రప్రదేశ్‌లో కాపు రాజకీయ నేతలు ఇటీవల కాలంలో పార్టీలకు అతీతంగా సమావేశాలు నిర్వహిస్తూ యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్న వ్యవహారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతూ వస్తోంది. ఒక్క ఏపీ అధికార వైసీపీ కాపు నేతలు మాత్రమే వీరు నిర్వహిస్తున్న సమావేశాలకు హాజరు కావడం లేదు.
గత నెలలో కూడా కాపు నేతలు వంగవీటి రంగా వర్థంతి సందర్భంగా విశాఖలో భారీ కార్యక్రమం నిర్వహించగా దానికి కాపు నాయకులు కాకుండా బయటి వారు కూడా వచ్చి హాట్ టాపిక్ అయ్యారు.
అయితే కాపు నాయకులు ఇప్పుడు రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు ? ఎలాంటి అడుగులు వేయబోతున్నారన్నది చర్చనీయాంశం అవుతోంది.