Agriculture

వేసవి బీరసాగులో మెళకువలు.రైతులు పాటించాల్సిన యాజమాన్యపద్ధతులు

వేసవి బీరసాగులో మెళకువలు.రైతులు పాటించాల్సిన యాజమాన్యపద్ధతులు

బీర.. తక్కువ సమయంలోనే పంట చేతికందుతుంది. పందిరి విధానంలో మేలైన యాజమన్య పద్ధతులు పాటిస్తే.. అధిక దిగుబడులు పొందవచ్చు. నాటిన మూడు వారాలకే కాతకు రావడం బీర పంట ప్రత్యేకత. సులభంగా తెంపి మార్కెట్‌కు తరలించవచ్చు.

వేసవి వచ్చిందంటే చాలు కూరగాయల ధరలు మండిపోతాయి. ముఖ్యంగా తీగజాతి కూరగాయలైన బీర, సొర, దొండ, కాకర, దోస పమటలకు డిమాండ్ ఎక్కువ. నీటి వసతి ఉన్న రైతులు అధికంగా బీరను సాగుచేస్తూ.. ఉంటారు. అయితే పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు మొక్కలు సరిగ్గా ఎదగకపోవడం.. ఇటు చీడపీడలు అధికంగా ఆశించి, దిగుబడులు తగ్గే అవకాశం ఉంది. కాబట్టి.. ఆయా ప్రాంతాలకు అనువైన రకాలను ఎన్నుకొని, మేలైన యాజమాన్య పద్ధతులు పాటించినట్లైతే నాణ్యమైన అధిక దిగుబడులు పొందవచ్చు.

బీర.. తక్కువ సమయంలోనే పంట చేతికందుతుంది. పందిరి విధానంలో మేలైన యాజమన్య పద్ధతులు పాటిస్తే.. అధిక దిగుబడులు పొందవచ్చు. నాటిన మూడు వారాలకే కాతకు రావడం బీర పంట ప్రత్యేకత. సులభంగా తెంపి మార్కెట్‌కు తరలించవచ్చు. ఎక్కువ మంది కూలీలు కూడా అవసరం లేదు. ఒకే వ్యక్తి ఒక రోజులో క్వింటాలు వరకు బీరకాయలను తెంపగలుగుతారు. అదే ఇతర పంటలైతే ముగ్గురు, నలుగురు కూలీలు అవసరమవుతారు.

ధర బాగా పలికితే బీర సాగులో వచ్చిన లాభాలు ఏపంటలో కూడా రావు. వినియోగదారులు కూడా ప్రస్తుతం అందుబాటులో ఉన్న హైబ్రిడ్‌ విత్తనాలతో ఉత్పత్తయ్యే ఉన్న బీరకాయలపై ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. కాబట్టి వేసవిలో బీరను సాగుచేసిన, చేయబోతున్న రైతులంతా మేలైన యాజమాన్య పద్ధతులు పాటించినట్లైతే నాణ్యమైన అధిక దిగుబడులను పొందేందుకు వీలుంటుంది.

వేసవిలో పంట ఎదుగుదల తగ్గి, పూత రాలిపోయే అవకాశం ఉంటుంది . అంతే కాకుండా ఎక్కువగా తెగుళ్లు ఆశిస్తుంటాయి. కాబట్టి సకాలంలో నీటితడులు, పోషకాలు అందించాలి. చీడపీడలను గుర్తించిన వెంటనే సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. వేసవి బీరసాగులో ఎలాంటి మెళకులు పాటించాలో రైతులకు తెలియజేస్తున్నారు మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం, శాస్త్రవేత్త శివకృష్ణ. పూర్తి సమాచారం కోసం క్రింది వీడియోపై క్లిక్ చేయండి.