తెలంగాణలో భారతీయ జనతా పార్టీ,బీఆర్ఎస్ మధ్య తీవ్రమైన పోస్టర్ ఫైట్‌లను మనం చూస్తున్నాము.రెండు పార్టీలు అనేక సమస్యలపై కొమ్ము కాస్తుండడంతో నేతలు ఒకరిపై ఒకరు టార్గెట్ చేసుకుంటున్నారు.కొన్ని నెలల క్రితం మోడీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ నేతలు పోస్టర్లు ఏర్పాటు చేయడం,హోర్డింగ్ చేయడంతో మొదలైంది.ఇప్పుడు కూడా పోరాటం సాగుతోంది. కల్వకుంట్ల కవితకు ఈడీ సమన్లు వచ్చినప్పుడు బీఆర్‌ఎస్ నేతలు కవిత ఇలాంటి చీప్ ట్రిక్స్‌కు దూరం కాబోరని, పోస్టర్లు ఏర్పాటు చేశారు.మాజీ ఎంపీకి సంఘీభావంగా నిలుస్తున్నట్లు పోస్టర్లు ఏర్పాటు చేశారు.
తెలంగాణలో మళ్లీ పోస్టర్ గేమ్ మొదలైంది.అయితే ట్విస్ట్ ఏంటంటే ఈసారి ఏర్పాటు చేసిన పోస్టర్లు కవితకు వ్యతిరేకంగా ఉన్నాయి.ఈ కుంభకోణంలో కవిత పాత్ర ఉందని,ఈ స్కాంతో ఆమె రాష్ట్రానికే తలవంపులు తెచ్చిందని పోస్టర్లలో రాశారు.
హైదరాబాద్‌లోని రద్దీ ఏరియాలో ఏర్పాటు చేసిన పోస్టర్లు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.పోస్టర్లు ఎవరు ఏర్పాటు చేశారన్న సమాచారం లేకున్నా ఇందులో బీజేపీ పాత్ర ఉందని పలువురు అనుమానిస్తున్నారు.తెలంగాణకు అవమానం తెచ్చింది నువ్వే అంటూ పోస్టర్లు వైరల్ అవుతున్నాయి.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌పై బీజేపీ,బీఆర్‌ఎస్‌లు బ్లేమ్ గేమ్ చేస్తున్న సంగతి తెలిసిందే.కేంద్ర సంస్థలు కేవలం తమ పని తాము చేసుకుపోతున్నాయని,ఈ కేసులో నిందితులను విచారిస్తున్నాయని బీజేపీ చెబుతుంటే, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను టార్గెట్ చేసేందుకే కవితను ఈ కేసులో ఇరికించారని బీఆర్‌ఎస్ ఆరోపిస్తోంది.