Devotional

శ్రీ రామాయణ మహాక్రతువుకు అంకురార్పణ ఆధ్యాత్మిక శోభితంగా భద్రాద్రి

శ్రీ రామాయణ మహాక్రతువుకు అంకురార్పణ ఆధ్యాత్మిక శోభితంగా భద్రాద్రి

శ్రీ రామాయణ మహాక్రతువుకు అంకురార్పణ
ఆధ్యాత్మిక శోభితంగా భద్రాద్రి

భద్రాచలం : దక్షిణ అయోధ్య భద్రాచలంలో వసంతపక్ష పుష్కరోత్సవాల్లో భాగంగా వసంతపక్ష తిరు కల్యాణ బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టడంతో పాటు శ్రీరామాయణ మహాక్రతువుకు సంప్రదాయబద్ధంగా అంకురార్పణ చేశారు. బుధవారం ఉదయం తొలుత సీతారామచంద్ర లక్ష్మణ స్వామి మూలమూరుల సన్నిధిలో ఉత్సవానుజ్ఞ తీసుకుని.. ఉత్సవమూర్తులను చిత్రకూట మండపంవద్దకు తీసుకొచ్చి నవకలశాలతో ఉత్సవాంగ స్నపనం నిర్వహించారు. అనంతరం విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, రుత్విక్‌గ్వరణంతో పాటు శ్రీమద్రారామాయణ పారాయణదారులు, ఆచార్య బ్రహ్మ, రుత్వికులకు దీక్షా వస్త్ర స్వీకరణ, రక్షాబంధనాలను నిర్వహించారు. యాగశాల వద్ద దేవస్థానం అధర్వ వేద పండితులు గుదిమెళ్ల మురళీకృష్ణమాచార్యులు ఓంకార ధ్వజారోహణాన్ని ఎగురవేశారు. అనంతరం సీతారామచంద్రస్వామిని చిత్రకూట మండపంలోకి తీసుకొచ్చి షోడశోపాచారాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సామూహిక సంక్షేప రామాయణ పారాయణం జరిపి హారతి సమర్పించి.. తిరిగి ఆలయానికి తీసుకెళ్లారు. సాయంత్రం గోవిందరాజస్వామి ఆలయం (తాతగుడి)లో సీతారామచంద్రస్వామి ఉత్సవమూర్తులను మృత్సంగ్రహణం భక్తిప్రపత్తులతో నిర్వహించారు.