NRI-NRT

అమెరికాలో ఉద్యోగం చేయాలని ఉందా? అయితే ఇలా వెళ్లి జాబ్ చేసుకోండి!

అమెరికాలో ఉద్యోగం చేయాలని ఉందా? అయితే ఇలా వెళ్లి జాబ్ చేసుకోండి!

అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే వారికి గుడ్ న్యూస్. టూరిస్ట్, బిజినెస్ వీసాపై తమ దేశానికి వచ్చిన వారు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకుని, ఇంటర్వ్యూలకు హాజరయ్యే విధంగా వెసులుబాటును కల్పించింది.

శివ శంకర్. చలువాది

ఉద్యోగంలో చేరేముందే ఆ వీసాను మార్చుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. బీ1 వీసాను వ్యాపార పనుల మీద వచ్చిన వారికి, బీ2 వీసాను పర్యాటకులకు అమెరికా జారీ చేస్తుంటుంది. ఆ దేశ తాజా నిర్ణయంతో ఈ రెండు వీసాల కేటగిరీలవారు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చని యూఎస్​ సిటిజెన్​షిప్​ అండ్​ ఇమ్మిగ్రేషన్​ సర్వీసెస్​ (యూఎస్​సీఐఎస్​) మార్చి 23న ట్వీట్​ చేసింది.

టెక్ అగ్ర సంస్థల్లో ఇటీవల భారీగా ఉద్యోగాల కోతతో వేలాది మంది విదేశీయులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. అమెరికా ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. ఈ లేఆఫ్‌ల కారణంగా ఉద్యోగం పోగొట్టుకున్నవారు 60 రోజుల వ్యవధిలో మరో ఉద్యోగాన్ని వెతుక్కోవాల్సి ఉంటుంది. వీరు అప్పటికే ఉద్యోగం సంపాదిస్తే అమెరికాలో ఉండవచ్చు. లేదంటే స్వదేశానికి తిరిగి వెళ్లిపోవాల్సి ఉంటుంది. ఈ ఆందోళనల నడుమ.. ఉద్యోగం వెతుక్కునేందుకు వేర్వేరు మార్గాలు ఉన్నాయంటూ బుధవారం(మార్చి 23) టూరిస్టు, బిజినెస్ వీసాలకు సంబంధించి యూఎస్ సీఐఎస్ వరుస ట్వీట్లు చేసింది.

60 రోజుల్లో ఉద్యోగం రానివారు దేశం విడిచి వెళ్లాలన్న అంశాన్ని కొన్నిసార్లు తప్పుగా అర్థం చేసుకుంటున్నారని, వారికి అనేక మార్గాలున్నాయని పేర్కొంది. హెచ్-1బీ వీసా ఉన్నవారు ఉద్యోగం కోల్పోయినా వారికి పలు అవకాశాలున్నాయి. ఆ వీసాను మార్చుకోవడం, హోదాను సర్దుబాటు చేసుకునేందుకు దరఖాస్తు చేసుకోవడం, తప్పనిసరి పరిస్థితుల నేపథ్యంలో ఉద్యోగ ధ్రువీకరణ పత్రాలకు దరఖాస్తు చేసుకోవడం, సరైన కారణాలు చూపుతూ ఉద్యోగం మారేందుకు పాత యజమాన్య సంస్థను వదిలేస్తున్నానని దరఖాస్తు చేసుకోవడం వంటి అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి దరఖాస్తులను 60 రోజుల్లోగా చేసుకుని ఉంటే హెచ్-1బీ వీసాలున్నవారు ఉద్యోగం కోల్పోయినా అమెరికాలో ఉండవచ్చు. ఉన్న అవకాశాల్లో ఏ ఒక్కదానినీ ఉపయోగించుకోనివారు మాత్రమే దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుంది. చాలామంది బీ1, బీ2 వీసాలుంటే ఉద్యోగం చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. దీనికి మా సమాధానం అవును అనే. బీ1, బీ2తో ఉద్యోగాలను వెతుక్కోవడానికి అనుమతి ఉంది’ అని యూఎస్‌సీఐఎస్ వెల్లడించింది. బీ1, బీ2తో ఉద్యోగాలను వెతుక్కున్నవారు ఉద్యోగంలో చేరేముందే ఉద్యోగ వీసాకు అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసింది.

వీసా స్టేటస్​ మార్చుకోవాలి.. లేకపోతే!
ఇక బీ-1, బీ-2 వీసాలపై ఉద్యోగాలు వెతుక్కుని, జాబ్​లో చేరే ముందు.. సంబంధిత వ్యక్తులు తమ వీసా స్టేటస్​ను కచ్చితంగా మార్చుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగం చేరడానికి ముందే.. ఈ వీసా స్టేస్​ మారిపోయి ఉండాలి. ఒక వేళ వీసా స్టేటస్​ మార్చేందుకు అధికారులు అంగీకరించకపోతే.. సంబంధిత వ్యక్తులు అమెరికాను విడిచిపెట్టి వెళ్లిపోవాల్సి ఉంటుంది