Kids

పిల్లల పెంపకంలో ఈ విషయాలు కీలకం

పిల్లల పెంపకంలో ఈ విషయాలు కీలకం

అందరు తల్లిదండ్రులు వారి పిల్లలను ఉత్తమంగా తీర్చిదిద్దాలనుకుంటారు. వాళ్లని మంచి లక్షణాలున్న వ్యక్తిగా మార్చడానికి మీరెలా సహాయపడొచ్చో తెలుసుకోండి..

సానుకూల దృక్పతంతో కూడిన పెంపకం మీ పిల్లల్ని మానసికంగా దృఢంగా చేస్తుంది. తెలివితేటలు పెంపొందించడంతో సాయపడుతుంది. మీ పెల్లల్ని అలా పెంచడానికి కొన్ని మెలకువలు తెలుసుకోండి.

స్నేహ పూర్వకమైన బంధం; మీ పిల్లలతో మీకుండే స్నేహపూర్వక బంధమే సానూకూల పెంపకానికి మొదటి మెట్టు. వాళ్లకిష్టమైన పనులు, ఆటలేంటో తెలుసుకుని వాళ్లతో కలిసి కాస్త సమయం వెచ్చించండి. వాళ్లకున్న అవసరాలు తెలుసుకోండి, మీతో ఏమైనా సరే నిరభ్యంతరంగా చెప్పుకోగలిగే స్వేచ్ఛ ఇవ్వండి.

స్వతంత్రంగా బతికేలా అలవాటు చేయండి; ఎవ్వరిమీదా ఆధారపడకుండా సొంతంగా బతకగలిగేలా కొన్ని పనులు నేర్పడం తప్పనిసరి. వాళ్ల వయస్సుకు తగ్గట్టుగా కొన్ని నిర్ణయాలు తీసుకొనే స్వేచ్ఛ ఇవ్వండి. దానివల్ల వాళ్ల ఆలోచనా శక్తి పెరుగుతుంది. సమస్యలు పరిష్కరించుకునే నేర్పు వస్తుంది.

కొన్ని బాధ్యతలు చెప్పండి; వాళ్లకు కొన్ని పనులు అప్పజెప్పడం ద్వారా అది వాళ్ల బాధ్యత అని తెలుసుకోగలుగుతారు. వాళ్ల వయసుగు తగ్గట్టుగా బెడ్ సర్దుకోవడం, వాళ్ల బొమ్మల్ని శుభ్రం చేసుకోవడం లాంటి పనులు చెప్పండి. దీనివల్ల మంచి అలవాట్లతో పాటూ, స్వతంత్రంగా కొన్ని పనులు చేసుకోవడం కూడా అలవరుతుంది.

ప్రశంసించండి; తప్పులు చేసినప్పుడు సరిదిద్దడం ఎంత ముఖ్యమో.. మంచి పనులు చేసినపుడు ప్రశంసించడం అంతే ముఖ్యం. దీనివల్ల వాళ్లపై వాళ్లకు ఆత్మ విశ్వాసం పెరుగుతుంది.

హద్దుల గురించి తెలియజేయండి; కొన్ని సందర్భాల్లో ఎలా ప్రవర్తించాలో, ఎలాంటి పనులు చేయకూడదో అనే విషయాల్లో కొన్ని హద్దుల గురించి తెలియజేయాలి. గీత దాటితే ఏమవుతుందో, ఎందుకు దాటకూడదో తెలియజేయండి. దానివల్ల వాళ్లకి క్రమశిక్షణ పెరుగుతుంది.

ప్రేమతో కూడిన క్రమశిక్షణ; పిల్లల పెంపకంలో క్రమశిక్షణ చాలా ముఖ్యమైన అంశం. కానీ అది దండిస్తూ చెప్పడం కాకుండా ప్రేమతో ఓపిగ్గా చెప్తూ వాళ్లకి అలవాటయ్యేలా చేయాలి. ఇలా చేయడం వల్ల పిల్లలు అన్ని విషయాలు అర్థం చేసుకుంటూ, బాధ్యతగా ఉండటం నేర్చుకుంటారు.