Movies

హ్యారి జోష్ తెలుగు తెరకు తిరుగులేని విలన్!!!

హ్యారి జోష్ తెలుగు తెరకు  తిరుగులేని విలన్!!!

రామ్ చరణ్ “గేమ్ చేంజర్”,
మంచు లక్ష్మి “ఆది పర్వం”
చిత్రాలతో తెలుగులో రీ-ఎంట్రీ!!

బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ విలన్ గా వెలుగొందుతున్న “హ్యారి జోష్” “తెలుగులో ఇక పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తాను” అంటున్నాడు. “వాంటెడ్, వెల్కమ్, ధూమ్ -2, గోల్ మాల్ -3, టార్జాన్ ది వండర్ కార్, కిస్నా, ముసాఫిర్, రామయ్యా వస్తావయ్యా, సింగ్ ఈజ్ బ్లింగ్” వంటి హిందీ చిత్రాల్లో నటించి మెప్పించిన హ్యారి… తెలుగులో అల్లు అర్జున్ తో వి.వి.వినాయక్ రూపొందించిన “బద్రినాథ్”లో ముఖ్య విలన్ గా నటించి టాలీవుడ్ దృష్టిని విశేషంగా ఆకర్షించాడు!!

ఇప్పుడు మళ్లీ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న “గేమ్ చేంజర్”లో విలన్ గా నటిస్తున్న హ్యారి… మంచు లక్ష్మి మెయిన్ లీడ్ గా సంజీవ్ మేగోటి దర్శకత్వం వహిస్తున్న “ఆది పర్వం”లో ఫుల్ లెంగ్త్ ఖతర్నాక్ నెగటివ్ రోల్ ప్లే చేస్తున్నాడు!!

హిందీ, తెలుగు భాషల్లోనే కాకుండా… పంజాబీ, కన్నడ, మరాఠీ చిత్రాల్లోనూ నటించి మెప్పించిన ఈ బహు భాషా నటుడు హాలీవుడ్ లోనూ తన సత్తా చాటి ఉండడం గమనార్హం. అంతేకాదు… సుమారు 100 యాడ్ ఫిల్మ్స్ లోనూ నటించిన హ్యారి… తను నటించే ప్రతి పాత్ర కోసం ప్రాణం పెడతాడు. “గేమ్ చేంజర్, ఆది పర్వం” చిత్రాలు తెలుగులో తనకు మంచి గుర్తింపు తెస్తాయనే నమ్మకం వ్యక్తం చేస్తున్న హ్యారి సినీ రంగ ప్రవేశం “సినిమా ఫక్కీలో” జరగడం విశేషం!!

ఉద్యోగ రీత్యా కెనడాలో ఉండగా… అక్కడ షూటింగ్ కోసం వచ్చిన హృతిక్ రోషన్ సినిమా లొకేషన్స్ కోసం సాయం చేయడం అతని జీవితాన్ని మలుపు తిప్పి, అతను ఇండియా తిరిగి వచ్చేలా చేసింది. హృతిక్, రాకేష్ రోషన్ ల ప్రోత్సాహంతో… అమితాబ్ బచ్చన్ తో కలిసి యాడ్ ఫిల్మ్ చేసే అవకాశం దక్కించుకున్న హ్యారీ.. “అమ్రిష్ పురి” తన రోల్ మోడల్ అని సగర్వంగా చెప్పుకుంటాడు. బాలీవుడ్ లోని బడా హీరోల ప్రేమాభిమానాలు పొందడం తన పూర్వజన్మ సుకృతం అని చెప్పుకునే… హ్యారీ జోష్ త్వరలోనే తెలుగులో తను నటించే సినిమాలకు తనే డబ్బింగ్ చెప్పుకునేలా… తెలుగు నేర్చుకోవడం కోసం విశేషంగా కృషి చేస్తుండడం… అతని అంకిత భావం, పట్టుదలకు నిదర్శనంగా నిలుస్తుంది!!!