ScienceAndTech

సంసారానికి సమయం ఎక్కడుంది..?: సాఫ్ట్‌వేర్ దంపతులకు సుప్రీం ప్రశ్న

సంసారానికి సమయం ఎక్కడుంది..?: సాఫ్ట్‌వేర్ దంపతులకు సుప్రీం ప్రశ్న

విడాకుల కోసం వెళ్లిన బెంగళూరు సాఫ్ట్వేర్ దంపతులపై సుప్రీం కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘మీలో ఒకరు పగలు, మరొకరు రాత్రి ఉద్యోగాలు చేస్తున్నారు. మీకు దానికి సమయమేది? విడాకులు తీసుకోవడంపై మీకు బాధ లేదు. పెళ్లిపైనే బాధ పడుతున్నారు. వివాహాన్ని నిలబెట్టుకునేందుకు మరో ఛాన్స్ ఎందుకు తీసుకోరు’ అని ప్రశ్నించింది. చివరకు ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడిపోయేందుకు ఒప్పుకోవడంతో విడాకులు మంజూరు చేసింది