Politics

విశాఖ ఉక్కు పరిశ్రమను నేను కొంటా: KA పాల్

విశాఖ ఉక్కు పరిశ్రమను నేను కొంటా: KA పాల్

AP: విశాఖ ఉక్కు పరిశ్రమ కొనుగోలు కోసం తాను బిడ్ వేస్తానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు. ‘బిడ్ వేయడానికి కొన్ని లేఖలు అవసరం. ఆ లేఖలు ఇవ్వాలని అడుగుతున్నా. అవి ఇస్తే 2. వారాల్లో రూ. 4వేల కోట్లు ఇస్తా. రూ.3.5 లక్షల కోట్ల విలువ ఉన్న విశాఖ ఉక్కును రూ.3500 కోట్లకు అమ్మేద్దామని చూస్తున్నారు. విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు. అందరం కలిసి కాపాడుకోవాలి’ అని పాల్ వ్యాఖ్యానించారు.