Stock market closing bell: దేశీయ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 75 పాయింట్లు లాభపడగా.. నిఫ్టీ 25 పాయింట్లు లాభంతో ముగిసింది.
ముంబయి: దేశీయ మార్కెట్ సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు, కంపెనీల త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో | మదుపరులు అప్రమత్తతతో మంగళవారం నాటి ట్రేడింగ్లో సూచీలు కాస్త ఒడుదొడుకులు ఎదుర్కొన్నాయి. అయితే, పవర్, ఫైనాన్షియల్ షేర్లలో కొనుగోళ్ల మద్దతు కనిపించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రెండూ వరుసగా రెండో రోజూ లాభాల్లో ముగిశాయి. డాలరుతో రూపాయి మారకం విలువ సైతం 81.91 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.
ఉదయం 60,202 పాయింట్ల వద్ద స్వల్ప లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్.. కాసేపటికి స్వల్ప నష్టాల్లోకి జారుకుంది. మళ్లీ కోలుకుని 60,268 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరికి 74.61 పాయింట్ల లాభంతో 60,130.71 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 25.85 పాయింట్ల లాభంతో 17,769, 25 వద్ద ముగిసింది. సెన్సెక్స్ బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్, ఇండస్ ఇండ్ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్లు రాణించాయి. హెల్డీఎఫ్సీ బ్యాంక్, హెచీఎఫ్సీ, టెక్ మహీంద్రా, సన్ఫార్మా, యాక్సిస్ బ్యాంక్ షేర్లు స్వల్పంగా నష్టపోయాయి. ఆసియాలో షాంఘై, సియోల్, హాంకాంగ్ మార్కెట్లు నష్టపోగా.. టోక్యో మార్కెట్లు లాభపడ్డాయి. యూరప్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
మ్యాన్ కైండ్ ఫార్మా ఐపీఓ సబ్స్క్రిప్షన్ ఇవాళ ప్రారంభమైంది. తొలిరోజు 6 శాతం సబ్సైట్ అయ్యింది. మొత్తం 2.8 కోట్ల షేర్లకు గానూ 0.17 కోట్ల ఈక్విటీ షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. రిటైల్ ఇన్వెస్టర్లకు 35 శాతం రిజర్వ్ చేయగా.. 7 శాతం షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. హెచ్ఎస్ఐలకు 60 లక్షల షేర్లు కేటాయించగా.. 8.08 లక్షల షేర్లకు బిడ్లు వచ్చాయి. రూ.4,326 కోట్లను సమీకరించేందుకు మ్యాన్ కైండ్ ఫార్మా నిర్ణయించింది. సబ్స్క్రిప్షన్ గడువు ఏప్రిల్ 27 తో ముగియనుంది