Politics

షర్మిలకు బెయిల్ మంజూరు

షర్మిలకు బెయిల్ మంజూరు

TS: పోలీసులపై దాడి కేసులో వైఎస్ షర్మిలకు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. నిన్న పోలీసులపై దాడి కేసులో షర్మిలకు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించగా.. ఆమె ప్రస్తుతం చంచల్గూడ జైలులో ఉన్నారు. షర్మిల బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా విచారణ చేపట్టిన కోర్టు.. రూ.30 వేలు, ఇద్దరు పూచీకత్తుతో బెయిల్ ఇచ్చింది. విదేశాలకు వెళ్లాలంటే కోర్టు అనుమతి తప్పనిసరని పేర్కొంది.