Devotional

ఈ వారం మీ రాశి ఫలితాలు

ఈ వారం మీ రాశి ఫలితాలు

హిందూ ధర్మం🚩
🌹 శుభోదయం 🌹
✍🏻 (30-04-2023 నుండి 06-05-2023) ✍🏻
🗓 ఈ వారం మీ రాశి ఫలితాలు

🐐 మేషం(30-04-2023 నుండి 06-05-2023)

శుభకాలం నడుస్తోంది. దైవబలం సంపూర్ణంగా రక్షిస్తోంది. మీ మీ రంగాల్లో పట్టుదలతో పనిచేసి మరువలేని విజయాలను సొంతం చేసుకుంటారు. వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కొన్ని కీలక నిర్ణయాలలో కుటుంబ సభ్యుల సహకారం మీకు లభిస్తుంది. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. తోటివారికి ఉపయోగపడే పనులు చేపడతారు. సమాజంలో గొప్ప పేరుప్రతిష్టలను సంపాదిస్తారు. శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఆర్థికపరంగా అనుకూలమైన కాలం. అనవసర ఖర్చులు చేయకుండా ఉండాలి. సూర్యస్తుతి శుభప్రదం.
🐐🐐🐐🐐🐐🐐🐐

🐂 వృషభం (30-04-2023 నుండి 06-05-2023)

శ్రమకు తగ్గ ఫలితాలు ఉంటాయి. చేపట్టే పనుల్లో మనోధైర్యం అవసరం. మీ మీ రంగాల్లో ఎదురయ్యే ఆటంకాలను బుద్ధిబలంతో ఎదుర్కోవాలి. ముఖ్య విషయాల్లో ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అనవసర ధనవ్యయం సూచితం. అనారోగ్య సమస్యలు కాస్త ఇబ్బంది పెడతాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. చేయని పొరపాటుకు నిందపడాల్సి వస్తుంది. అనవసర వివాదాల్లో తలదూర్చకండి. ఆపదలు తొలుగుతాయి. నవగ్రహ స్తోత్రం పారాయణ మంచిది.
🐂🐂🐂🐂🐂🐂🐂

💑 మిధునం (30-04-2023 నుండి 06-05-2023)

అదృష్టయోగాలు ఉన్నాయి. ఆశించిన ఫలితం దక్కుతుంది. సకాలంలో పనులు పూర్తవుతాయి. మీ ప్రజ్ఞాశక్తితో అందరినీ ఆకట్టుకుంటారు. ఉద్యోగంలో పరిపూర్ణ బలం ఉంది. ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో ధనలాభం కలదు. బంధు, మిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు. కొన్ని విషయాల్లో త్యాగగుణంతో ముందుకు సాగితే శుభం చేకూరుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఓర్పును కోల్పోవద్దు. కలహసూచన ఉంది. ఇబ్బందికర పరిస్థితుల్లో మౌనం వహించడం ఉత్తమం. ఇష్టదైవ ధ్యానం శుభప్రదం.
💑💑💑💑💑💑💑

🦀 కర్కాటకం (30-04-2023 నుండి 06-05-2023 )

లక్ష్యాలు నెరవేరుతాయి. శుభం చేకూరుతుంది. చేపట్టిన పనులను ప్రణాళికాబద్దంగా పూర్తిచేస్తారు. ఊహించిన దాని కన్నా అధిక ఫలితం దక్కుతుంది. ఆర్థికంగా అనుకూలత ఉంది. వ్యాపారంలో మంచి ఫలితాలను సాధిస్తారు. ఒక వ్యవహారంలో మీ ముందుచూపు, వ్యవహారశైలికీ ప్రశంసలు లభిస్తాయి. బుద్ధిబలంతో అనుకున్నది సాధిస్తారు. వారాంతంలో అనుకున్నది సాధిస్తారు. పూర్వపుణ్యం రక్షిస్తోంది. సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన మంచిది.
🦀🦀🦀🦀🦀🦀🦀

🦁 సింహం (30-04-2023 నుండి 06-05-2023)

ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. గ్రహబలం విశేషంగా యోగిస్తోంది. బంధు, మిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. వ్యాపారంలో శుభఫలితాలు ఉన్నాయి. శత్రువులపై మీదే పైచేయి అవుతుంది. కుటుంబ సభ్యులలో సహకారం ఉంటుంది. మీ స్వధర్మమే మిమ్మల్ని రక్షిస్తోంది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగండి. శాంతిపూరితమైన వాతావరణం ఉంది. విష్ణు స్తుతి శుభప్రదం.
🦁🦁🦁🦁🦁🦁

💃 కన్య (30-04-2023 నుండి 06-05-2023)

గతానుభవంతో చేసే పనుల వల్ల మంచి జరుగుతుంది. ఒత్తిడి కలుగకుండా ఒక ప్రణాళికతో ముందుకు సాగండి. ముఖ్య విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. కొద్దిపాటి అనారోగ్య సమస్యలు ఉన్నా ఆరోగ్యం కాస్త ఫర్వాలేదనిపిస్తుంది. ముఖ్య విషయాల్లో మీ నమ్మకమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. కుటుంబసభ్యుల సలహాలు ఉపయోగపడతాయి. బంధు, మిత్రులను కలుపుకొనిపోవడం ఉత్తమం. ఆర్థికంగా ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ప్రయాణాల్లో నిర్లక్ష్యం రానీయకండి. అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. గురు ధ్యానం శుభప్రదం
💃💃💃💃💃💃💃

⚖ తుల (30-04-2023 నుండి 06-05-2023)

ఆర్ధికంగా లాభదాయకమైన ఫలితాలు ఉన్నాయి. మీ మీ రంగాల్లో మంచి ఫలితాలు సొంతం అవుతాయి. ప్రారంభించిన పనులను సకాలంలో పూర్తిచేస్తారు. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. బంధు, మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. కుటుంబ సహకారం ఉంటుంది. వారం మధ్యలో ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న ఒక ఫలితాన్ని అందుకుంటారు. తోటివారి సలహాలు మేలు చేస్తాయి. అభివృద్ధికి సంబంధించిన వ్యవహారాల్లో తొందరపాటు పనికిరాదు. సూర్య ఆరాధన శుభప్రదం.
⚖⚖⚖⚖⚖⚖⚖

🦂 వృశ్చికం (30-04-2023 నుండి 06-05-2023)

శుభకాలం. అదృష్టవంతులు అవుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి ఫలితాలు ఉన్నాయి. ఒక వ్యవహారంలో డబ్బు చేతికి అందుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తవుతాయి. ఆర్థికంగా సానుకూల పరిస్థితులు ఉంటాయి. బుద్ధిబలం బాగుంటుంది. కీలక | సమయాలలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. కొత్త పనులను ప్రారంభిస్తారు. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. తోటివారి సహాయ సహకారాలు ఉంటాయి. బంధువులతో ఆనందాన్ని పంచుకుంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ప్రయాణాలు ఫలిస్తాయి. శ్రీసుబ్రహ్మణ్య స్వామి నామస్మరణ శుభప్రదం.
🦂🦂🦂🦂🦂🦂🦂

🏹 ధనుస్సు (30-04-2023 నుండి 06-05-2023)

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి ఫలితాలు ఉన్నాయి. చేపట్టే పనుల్లో విజయసిద్ధి ఉంది. ఆత్మీయుల సహకారం ఉంటుంది. కీలక వ్యవహారాల్లో అభివృద్ధి సాధిస్తారు. మనోబలం ఉంటుంది. తోటి వారికీ మేలు చేయాలనే గుణం మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది. వారం మధ్యలో ఒక మేలు జరుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. ఆదిత్యస్తుతి ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది.
🏹🏹🏹🏹🏹🏹🏹

🐊 మకరం (30-04-2023 నుండి 06-05-2023)

ఉద్యోగంలో జాగ్రత్త అవసరం. పట్టుదలతో కార్యసిద్ధి ఉంది. ముఖ్య వ్యవహారాల్లో ఆవేశపూరిత నిర్ణయాలు వద్దు.మనోబలంతో లక్ష్యాలు నెరవేరుతాయి. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. సాహసోపేతమైన నిర్ణయాలు లాభిస్తాయి. చంచల స్వభావాన్ని దరిచేరనీయకండి. నిందమోపేవారు ఉన్నారు. ఒత్తిడి పెరుగుతుంది. కావాలని ఇబ్బంది పెట్టేవారు ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆవేశానికి గురికాకండి. ధర్మచింతన మేలు చేస్తుంది. వారం మధ్యలో మంచి జరుగుతుంది. దుర్గాదేవి ఆరాధన శుభప్రదం.
🐊🐊🐊🐊🐊🐊🐊

🏺 కుంభం (30-04-2023 నుండి 06-05-2023)

దైవబలం ఉంది. అభీష్టాలు నెరవేరుతాయి. మీ మీ రంగాల్లో మీకు అప్పగించిన బాధ్యతలను సమర్ధంగా పూర్తిచేస్తారు. ధనార్జన మార్గాలను పెంచేలా మీ ఆలోచనావిధానం ఉంటుంది. బంగారు భవిష్యత్తుకు పునాదులు వేస్తారు. ముఖ్య విషయాల్లో తోటివారిని కలుపుకొనిపోవాలి. ఆరోగ్యం సహకరిస్తుంది. శుభకార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. అధికారలాభం ఉంది. ప్రశాంతమైన జీవనం లభిస్తుంది. ఇష్టదైవారాధన మంచిది.
🏺🏺🏺🏺🏺🏺🏺

🦈 మీనం (30-04-2023 నుండి 06-05-2023)

విజయసిద్ధి ఉంది. అనుకున్నది సాధిస్తారు. ముఖ్య విషయాల్లో కుటుంబ సభ్యుల సూచనలతో ముందుకు సాగండి, మంచి జరుగుతుంది. అనుకున్నది సాధించేవరకు పట్టుదల వదలకండి. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు అనుకూలిస్తాయి. సంతృప్తికరమైన ఫలితాలు సొంతం అవుతాయి. అనవసర విషయాలతో సమయాన్ని వృథా చేయకండి. వివాదాలకు ఆమడదూరంలో ఉండాలి. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. పెద్దల ఆశీర్వచనాలు మేలు చేస్తాయి. ఈశ్వర సందర్శనం శుభప్రదం.
🦈🦈🦈🦈🦈🦈🦈