Devotional

నేటి మీ రాశి ఫలితాలు

నేటి మీ రాశి ఫలితాలు

🕉️హిందూ ధర్మం🚩
🌹 శుభోదయం 🌹
*✍🏻 *30.04.2023 ✍🏻**
*🗓 *నేటి రాశి ఫలాలు 🗓**

🐐 మేషం
ఈరోజు (30-04-2023)

చేపట్టే పనుల్లో కాలానుగుణంగా ముందుకు సాగండి, మంచి జరుగుతుంది. నూతన వస్తువులను సేకరిస్తారు. అనవసర ఖర్చులను అదుపులో ఉంచండి. దైవబలం పెరుగుతుంది. హనుమత్ ఆరాధన శుభప్రదం.
🐐🐐🐐🐐🐐🐐🐐

🐂 వృషభం
ఈరోజు (30-04-2023)

తోటివారి సూచనలను పాటించడం ఉత్తమం. మీ మీ రంగాల్లో మీ పరిధిని మించిన విషయాల్లో తలదూర్చకండి. వ్యాపారంలో మీరు చేసే ఆలోచనల్ని ఎదుటివారితో పంచుకోవడం ద్వారా సాధ్యాసాధ్యాలను అంచనా వేయవచ్చు. శ్రీవేంకటేశ్వరస్వామి సందర్శనం శుభప్రదం.
🐂🐂🐂🐂🐂🐂🐂

💑 మిధునం
ఈరోజు (30-04-2023)

శుభసమయం. మానసికంగా దృఢంగా ఉంటారు. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. బంధు, మిత్రులతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు
అధికారులు సహాయ సహకారాలు అందుతాయి. శ్రీఆంజనేయ
దర్శనం శుభప్రదం.
💑💑💑💑💑💑💑

🦀 కర్కాటకం
ఈరోజు (30-04-2023)

కర్మసిద్ధి ఉంది. తోటివారి సహకారంతో అనుకున్న ఫలితాలు సిద్ధిస్తాయి. అనవసర విషయాల గురించి సమయాన్ని వృథా చేయకండి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. శ్రీరామనామాన్ని జపించడం ఉత్తమం.
🦀🦀🦀🦀🦀🦀🦀

🦁 సింహం
ఈరోజు (30-04-2023)

మీ మీ రంగాల్లో శుభఫలితాలు ఉన్నాయి. ముఖ్యమైన విషయాల్లో సొంత నిర్ణయాలు పనిచేస్తాయి. సాహసోపేతమైన నిర్ణయాల వల్ల విజయం చేకూరుతుంది. విష్ణు సందర్శనం శుభప్రదం.
🦁🦁🦁🦁🦁🦁

💃 కన్య
ఈరోజు (30-04-2023)

మధ్యమ ఫలితాలు ఉన్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మిశ్రమ వాతావరణం ఉంటుంది. ఎలాంటి పరిస్థితులలోనూ మనోధైర్యాన్ని కోల్పోకండి. తోటివారి సహకారంతో మేలు జరుగుతుంది. దైవారాధన మానవద్దు.
💃💃💃💃💃💃💃

⚖ తుల*
ఈరోజు (30-04-2023)

చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురవుతాయి.
మానసికంగా దృఢంగా ఉంటారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. సంకటహర గణపతి స్తోత్రం చదవడం శుభకరం.
⚖⚖⚖⚖⚖⚖⚖

🦂 వృశ్చికం
ఈరోజు (30-04-2023)

కొత్త పనులు చేపడతారు. తోటివారిని
కలుపుకొనిపోవడం వల్ల శీఘ్ర ఫలితాలు సొంతం అవుతాయి. ఉత్సాహంతో ముందుకు సాగి
విజయవంతమైన ఫలితాలను అందుకుంటారు. ఇష్టదైవ
శ్లోకాలు చదివితే మంచిది.
🦂🦂🦂🦂🦂🦂🦂

🏹 ధనుస్సు
ఈరోజు (30-04-2023)

పరిపూర్ణమైన ఆత్మవిశ్వాసంతో పనిచేయాలి. అలసట పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి.
నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. ఇతరులు వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడమే మంచిది. శ్రీవేంకటేశ్వర స్వామి సందర్శనం శుభప్రదం.
🏹🏹🏹🏹🏹🏹🏹

🐊 మకరం
ఈరోజు (30-04-2023)

కష్టానికి తగిన ఫలితాలు సొంతం అవుతాయి. నూతన
కార్యక్రమాలు ఫలిస్తాయి. తోటివారితో ఆనందంగా గడుపుతారు. శివపార్వతుల సందర్శనం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.
🐊🐊🐊🐊🐊🐊🐊

🏺 కుంభం
ఈరోజు (30-04-2023)

ఆత్మీయుల సహకారంతో అనుకున్నది సాధిస్తారు. స్థిరమైన భవిష్యత్తు కోసం ఆలోచనలు చేస్తారు. మీ మీ రంగాల్లో మంచి ఫలితాలను అందుకుంటారు.
శ్రీరామనామాన్ని జపిస్తే మంచిది.
🏺🏺🏺🏺🏺🏺🏺

🦈 మీనం
ఈరోజు (30-04-2023)

శుభకాలం. ఏ పని తలపెట్టినా త్వరగా పూర్తవుతుంది. వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. బంధు, మిత్రులు ఆదరాభిమానాలు ఉంటాయి. ఉల్లాసభరితమైన వాతావరణం నెలకొంటుంది. ఆధ్యాత్మికంగా శుభకాలం. శ్రీవేంకటేశ్వర సందర్శనం శుభప్రదం.
🦈🦈🦈🦈🦈🦈🦈