NRI-NRT

తానా మహాసభలకు ముఖ్యఅతిథిగా జస్టిస్ ఎన్.వి.రమణ

తానా మహాసభలకు ముఖ్యఅతిథిగా జస్టిస్ ఎన్.వి.రమణ

ఫిలడెల్ఫియాలో జరగనున్న 23వ తానా మహాసభలకు ముఖ్యఅతిథిగా సుప్రీం కోర్ట్ మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ హాజరవుతున్నట్లు మహాసభల కన్వీనర్ పొట్లూరి రవి తెలిపారు. ఆదివారం నాడు తన ఆధ్వర్యంలోని తానా బృందం ఆయనను కలిసి ఆహ్వానం అందజేసినట్లు తెలిపారు. తానా మహాసభల ఆహ్వానం పట్ల నూతలపాటి సానుకూలంగా స్పందించారని రవి తెలిపారు. ఆహ్వానం అందజేసిన వారిలో జగదీష్ ప్రభల, సుబ్రహ్మణ్యం ఓసూరు, గారపాటి ప్రసాద్ తదితరులు ఉన్నారు.