DailyDose

TNI. నేటి తాజా వార్తలు. గ్యాంబ్లర్ చికోటి ప్రవీణ్ అరెస్ట్ తదితర విశేషాలు

TNI. నేటి తాజా వార్తలు. గ్యాంబ్లర్ చికోటి ప్రవీణ్ అరెస్ట్ తదితర విశేషాలు

Big News:

గ్యాంబ్లర్ చికోటి ప్రవీణ్ సహా… 93మందిని అరెస్ట్ చేసిన థాయ్ పోలీసులు…

అరెస్ట్ అయిన వారిలో… 16మంది మహిళలు ఉన్నట్టు సమాచారం… అరెస్్ట అయిన వారి వద్ద నుంచి భారీ మొత్తంలో నగదు, గేమింగ్ చిప్స్‌ల స్వాధీనం…

20కోట్ల గేమింగ్ చిప్స్ తోపాటు భారీ నగదు స్వాధీనం…!!

గుడివాడలో అక్రమ క్యాసినో నిర్వహణలో… ప్రధాన సూత్రధారుడిగా చికోటి ప్రవీణ్

* న్యూఢిల్లీ :

వ్యాపారం కోసం వినియోగించే వంట గ్యాస్ సిలిండర్ ధరలను పెట్రోలియం, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు భారీగా తగ్గించాయి.

19 కేజీల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధరను రూ.171.50 చొప్పున తగ్గించాయి.

ఈ తగ్గింపు సోమవారం నుంచి అమల్లోకి వస్తుంది.

అయితే గృహ వినియోగ వంట గ్యాస్ సిలిండర్ ధరలో ఎటువంటి మార్పు లేదు.

* అమరావతి : ఆర్-5 జోన్ పై నేడు ఏపీ హైకోర్టులో వాదనలు

గతంలో వాదనలు విని తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు ధర్మాసనం – ఆర్-5 జోన్ లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు – మళ్లీ వాదనలు వినిపించేందుకు సిద్ధమైన రైతుల తరపు లాయర్లు – మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని అభ్యర్థించనున్న రైతుల తరపు లాయర్లు.

* R-5 జోన్ పై ఈరోజు గౌరవ హైకోర్ట్ లో విచారణ రేపటికి వయిదా వేసినారు.

*అమరావతి

రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న వైయస్ఆర్ పెన్షన్ల పంపిణీ

63.33 లక్షల మంది పెన్షనర్లకు రూ.1747.38 కోట్లు విడుదల

తెల్లవారుజాము నుంచే ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు పంపిణీ చేస్తున్న వాలంటీర్లు

ఉదయం 11.00 గంటల వరకు 56.08 శాతం పెన్షన్ల పంపిణీ

35.51 లక్షల మందికి రూ.979.57 కోట్లు అందచేత

మీ….
*బూడి ముత్యాల నాయుడు,
ఉప ముఖ్య మంత్రి ,
పంచాయతీ రాజ్‌ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ , గ్రామ సచివాలయాలు మరియు వార్డు సచివాలయాలు .*

* హైదరాబాద్: సెక్రటేరియట్ కు ఉద్యోగులు వెళ్లే గేట్ నుంచి ఎమ్మెల్యేలు రాక…పోలీసులకు, ఎమ్మెల్యే భద్రతా సిబ్బందికి వాగ్వాదం…సెక్రటేరియట్ పరిసరాల్లో గందరగోళం

తెలంగాణ సెక్రటేరియట్ కు ఎంపీ రేవంత్ రెడ్డి 

▪️తెలంగాణ సెక్రటేరియట్ కు రానున్న టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి.

▪️ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ తో సమావేశం కానున్న రేవంత్.

▪️ఔటర్ రింగ్ రోడ్ టెండర్ల పై ఫిర్యాదు.

రజనీకాంత్ పై వైసీపీ విమర్శలకు సీఎం జగన్ క్షమాపణ చెప్పాలి

జగన్ ప్రభుత్వం పై రజనీకాంత్ చిన్న విమర్శ చేయకపోయినా ఆయనపై వైసీపీ నీచపు వ్యాఖ్యలు:- టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు

అన్నగారి శత జయంతి కార్యక్రమంలో పాల్గొని ఆయనతో తన అనుబంధాన్ని…అనుభవాలను పంచుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్ గారిపై వైసీపీ మూకల అసభ్యకర విమర్శల దాడి అభ్యంతరకరం, దారుణం.

సమాజంలో ఎంతో గౌరవం ఉండే రజనీ కాంత్ లాంటి లెజెండరీ పర్సనాలటీపై కూడా వైసీపీ నేతలు చేస్తున్న నీచ వ్యాఖ్యలు అందరికీ బాధ కలిగిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వ పోకడలపై ఆయన చిన్న విమర్శ చేయలేదు…ఎవరినీ చిన్న మాట అనలేదు. పలు అంశాలపై కేవలం తన అభిప్రాయాలు పంచుకున్నారు. అయినా తీవ్ర అహంకారంతో ఆయనపై చేస్తున్న ఆర్థం లేని విమర్శలను తెలుగు ప్రజలు ఎవరూ సహించరు. శిఖరం లాంటి వ్యక్తిత్వం కలిగిన రజనీ క్యారెక్టర్ పై మీ పార్టీ నేతల విమర్శలు ఆకాశం పై ఉమ్మి వేయడమే. నోటిదూల నేతలను జగన్ అదుపులో పెట్టుకోవాలి….జరిగిన దానికి క్షమాపణ చెప్పి తమ తప్పు సరిదిద్దుకోవాలి.

ఆంధ్రప్రదేశ్ ను రాజధాని లేని రాష్ట్రంగా మార్చిన అపకీర్తి జగన్మోహన్ రెడ్డిదే.

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ.

పొరుగున ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని చూసైనా జగన్ సర్కార్ సిగ్గు తెచ్చుకోవాలి.

తెలంగాణలో నూతన సచివాలయాన్ని అధునాతన భవనంగా నిర్మించుకొని ప్రారంభించుకున్నారు.

ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకభట 4 ఏళ్లలో అమరావతి రాజధానిని నిర్వీర్యం చేసింది.

మాట్లాడితే మూడు ముక్కలాట ఆడుతూ రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని మార్చింది.

తెలంగాణలో నిర్మాణాలు జరుగుతుంటే, ఏపీలో కూల్చివేతల పాలన సాగడం దురదృష్టకరం.

ఏపీలో అమరావతిలో భూములు, ఇతర వనరులున్నా రాజధాని నిర్మించలేకపోవటం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ అసమర్థతకు అద్దం పడుతోంది.
– రామకృష్ణ.

శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా వ్యాప్తంగా స్టోన్‌ క్రషర్లు ఈ రోజు (సోమవారం)నుంచి మూతపడనున్నాయి

ప్రభుత్వం రాయ ల్టీ, సీనరేజ్‌ చార్జీలను పెంచడంతో ఆ ప్రభావం క్వారీల నిర్వహణపై పడుతోంది.

దీంతో క్రషర్లు నిర్వహించలేమని యాజమాన్యాలు తేల్చిచెబు తున్నాయి.

సోమవారం నుంచి మూసివేస్తామని ప్రకటించడంతో

వేలాది మంది కార్మికులు ఉపాధికి దూరంకానున్నారు.

రెండు దశాబ్దాల తర్వాత ఎండాకాలం లో 10 సెంటి మీటర్ల వర్షపాతం నమోదు కావడం ఇదే మొదటి సారి.

# గ్రేటర్ హైదరాబాద్ లో 43 ప్రాంతాల్లో విరిగి పడ్డ చెట్లు.

అన్నగారి శత జయంతి కార్యక్రమంలో పాల్గొని ఆయనతో తన అనుబంధాన్ని…

అనుభవాలను పంచుకున్న సూపర్ స్టార్ @rajinikanth గారిపై వైసీపీ మూకల అసభ్యకర విమర్శల దాడి అభ్యంతరకరం, దారుణం. సమాజంలో ఎంతో గౌరవం ఉండే రజనీ కాంత్ లాంటి లెజెండరీ పర్సనాలటీపై కూడా వైసీపీ నేతలు చేస్తున్న నీచ వ్యాఖ్యలు అందరికీ బాధ కలిగిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వ పోకడలపై ఆయన చిన్న విమర్శ చేయలేదు… ఎవరినీ చిన్న మాట అనలేదు. పలు అంశాలపై కేవలం తన అభిప్రాయాలు పంచుకున్నారు. అయినా తీవ్ర అహంకారంతో ఆయనపై చేస్తున్న ఆర్థం లేని విమర్శలను తెలుగు ప్రజలు ఎవరూ సహించరు. శిఖరం లాంటి వ్యక్తిత్వం కలిగిన రజనీ క్యారెక్టర్ పై మీ పార్టీ నేతల విమర్శలు ఆకాశం పై ఉమ్మి వేయడమే. నోటిదూల నేతలను జగన్ అదుపులో పెట్టుకోవాలి…. జరిగిన దానికి క్షమాపణ చెప్పి తమ తప్పు సరిదిద్దుకోవాలి.