DailyDose

TNI. నేటి నేర వార్తలు…

TNI.  నేటి నేర వార్తలు…

* హైదరాబాద్

◻️నాంపల్లి సీబీఐ కోర్టులో లొంగిపోయిన ఎర్ర గంగిరెడ్డిని చంచల్ గూడా జైలుకు తరలించిన అధికారులు.

◻️వైఎస్‌ వివేకా కేసులో ఏ-1 గంగిరెడ్డి బెయిల్ రద్దు చేసి కోర్టులో లొంగిపోవాలని గతంలో ఆదేశించిన హైకోర్టు

*Tv9 and Ntv బ్లూ మీడియా..! వాల్యూస్ లేకుండా బానిస బతుకు బతుకుతున్నాయి..!మేము వచ్చాక చూపిస్తాం మీ స్థానమేంటో..!

-Chandrababu Naidu

* రోజు తాగివచ్చి అమ్మని కొడతాడు.. తండ్రికి బుద్ధిచెప్పమని ఎస్సై‌కు ఓ బుడ్డోడు ఫిర్యాదు….

తండ్రి తాగొచ్చి తల్లిని కొట్టడాన్ని కొడుకు చూడలేకపోయాడు. ప్రతి రోజు తండ్రి చేస్తున్న న్యూసెన్స్ భరించలేని కొడుకు పోలీసులను ఆశ్రయించాడు. కన్న తల్లి కష్టంపై స్పందించిన ఆ కొడుకు వయస్సెంత అనుకుంటున్నారు. తొమ్మిదేళ్ళు. ఆశ్చర్యం కలిగించే ఈ ఘటనకు వేదికగా మారింది బాపట్ల జిల్లాలోని ఓ పోలీసు స్టేషన్. అవును జిల్లాలోని కర్లపాలెం మండలం ఇస్లాం పేట పోలీసు స్టేషన్ లో వింత ఫిర్యాదు వచ్చింది. గ్రామానికి చెందిన ఓ తొమ్మిదేళ్ళ బాలుడు రహీమ్‌ కర్లపాలెం పిఎస్ కు వెళ్ళాడు. ఎస్సై శివయ్య బాలుడిని పిలిచి ఎందుకొచ్చావని ప్రశ్నించాడు. మా నాన్న తాగొచ్చి రోజు మా అమ్మను కొడుతున్నాడు. మా అమ్మ ఎంత బ్రతిమిలాడినా వినటం లేదు. ప్రతి రోజు ఇదే విధంగా చేస్తున్నాడు. అందుకే పోలీసులకు చెప్పటానికి వచ్చాను.. తన తండ్రిపై చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారిని కోరాడు. ఆ బాలుడి ధైర్యానికి పోలీసులు షాక్ తిన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

రహీమ్ తండ్రి సుభాని రైస్ మిల్లులో పనిచేస్తూనే.. మిషన్ కుడతాడు. తల్లి సుభాంబీ ఇంట్లోనే ఉంటుంది. మద్యానికి బానిసైన సుభానీ రోజు మద్యం తాగి ఇంటికి వచ్చి భార్య సుభాంబీని వేధించేవాడు. ఇది చూసిన రహీమ్ .. తండ్రికి బుద్ధి చెప్పమంటూ పోలీసులను ఆశ్రయించాడు. బాలుడు ఫిర్యాదుతో స్పందించిన ఎస్సై శివయ్య రహీమ్ తల్లిదండ్రులిద్దరిని పోలీసు స్టేషన్ కు పిలిపించారు. భార్యాభర్తలిద్దరినీ మందలించడంతో పాటు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. మళ్ళీ ఇలాంటి ఘటన చోటు చేసుకుంటే.. చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించి పంపించేశారు. ఈ ఘటన బాలుడి సాహసం.. తల్లిపై ప్రేమ స్థానికంగా చర్చనీయాంశమైంది.

* గల్లంతైన బాలుడి మృతదేహం లభ్యం

విజయవాడ : గల్లంతైన బాలుడి మృతదేహం లభ్యం భారతీనగర్ వద్ద బాలుడి మృతదేహాన్ని గుర్తించిన వీఎంసీ సిబ్బంది – ఉదయం గురునానక్ కాలనీ వద్ద కాలువలో అభి(6) గల్లంతు – కిలోమీటర్ దూరంలో భారతీనగర్ వద్ద బాలుడి మృతదేహం గుర్తింపు – బాలుడి మృతదేహాన్ని వెలికితీసి ఆస్పత్రికి తరలించిన సిబ్బంది

◾ || విజయవాడ లో ఘోరం … ఆరు సంవత్సరాల బాలుడు ఆడుకుంటూ డ్రైనేజీ కాలువలో పడిపోయాడు || ◾

▪️విజయవాడలో గురునానక్ కాలనీలో ఎన్ఎసి కళ్యాణ మండపం పక్కన ఆరు సంవత్సరాల బాలుడు ఆడుకుంటూ డ్రైనేజీ కాలువలో పడిపోయాడు.

▪️బాలుడు కోసం డ్రైనేజీ లోకి దిగిన పోలీసులు.

▪️ గంట పాటు వెతికినా దొరకని ఆచూకీ.

▪️ రెండు రోజుల నుండీ కురుస్తున్న వర్షాలకు కాలువలోకి భారీగా వరదనీరు.

* విజయవాడ

గురునానక్ కాలనీ లో డ్రైనేజీలో పడి చనిపోయిన అభిలాష్ అనే ఆరు సంవత్సరాల బాలుని కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ వద్ద ధర్నా చేస్తున్న సిపిఎం నాయకులు చి హెచ్ బాబురావు మరియు బాలుని కుటుంబ సభ్యులు

ఈ ఘటనకు మున్సిపల్ కార్పొరేషన్ వారే బాధ్యత వహించాలి తక్షణమే మున్సిపల్ అధికారులు స్పందించాలి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్

* శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం, దేవాదాయ ధర్మాదాయ శాఖ, విజయవాడ కు చెందిన సూపరిండెంట్ వాసా నాగేష్ పైన జరుగుతున్న ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అతని భార్య, కుమారుడు మరియు మధ్యవర్తుల సమక్షంలో అతని యూనియన్ బ్యాంకు లాకర్ తెరవగా 177.9 గ్రాముల బంగారు ఆభరణాలు, 1585 గ్రాముల వెండి వస్తువులను ఏసిబి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాసా నాగేష్ అరెస్టు చేసి రాజమండ్రి ఏసీబీ స్పెషల్ జడ్జి కోర్టులో జ్యుడీషియల్ రిమాండ్ కొరకు హాజరు పరచనున్నారు.

స్టాంపు రిజిస్ట్రేషన్ల శాఖ కు చెందిన పటమట SRO అజ్జా రాఘవరావుపైన ఆదాయానికి మించిన ఆస్తులు కేసులో అతనితో పాటు డాక్యుమెంట్ రైటర్లు మరియు సాధారణ ప్రజల నుండి డబ్బును వసూలు చేసి సబ్- రిజిస్ట్రార్ కు అందజేసే
ప్రైవేట్ వ్యక్తులు 1) మట్లి సుబ్బారెడ్డి 2) వెంపటాపు దుర్గా ప్రసాద్, 3) తమ్మిరెడ్డి శివ కిరణ్ అను ముగ్గురిని అరెస్టు చేసి విజయవాడ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరు పరచి రిమాండ్ కి తరలించడమైనది.