Movies

‘కస్టడీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ అండ్ టైం ఫిక్స్..

‘కస్టడీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ అండ్ టైం ఫిక్స్..

ద్విభాషా చిత్రంగా రూపొందిన ‘కస్టడీ’పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్న చైతూ,అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్, ఈ నెల 12వ తేదీన సినిమా విడుదల.

ఈ మధ్య కాలంలో నాగచైతన్య వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటూ వెళుతున్నాడు. అలా చేసిన సినిమాలు కొన్ని నిరాశపరిచినా, కొత్తదనం కోసం ఆయన తనవంతు ప్రయత్నాలు చేస్తూనే వెళుతున్నాడు. అలా ఆయన ‘థ్యాంక్యూ’ తరువాత చేసిన సినిమానే ‘కస్టడీ’. శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ సినిమాకి వెంకట్ ప్రభు దర్శకత్వం వహించాడు.

ఈ నెల 12వ తేదీన ఈ సినిమాను తెలుగు … తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు. తెలుగు వెర్షన్ కి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంటుకి ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటును హైదరాబాద్ – అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్ లో రేపు నిర్వహించనున్నారు. రేపు సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుక మొదలుకానుంది.

ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ, అందుకు సంబంధించిన పోస్టర్ ను వదిలారు. కృతి శెట్టి కథానాయికగా నటించిన ఈ సినిమాలో, అరవింద్ స్వామి .. శరత్ కుమార్ .. సంపత్ రాజ్ .. ప్రియమణి ముఖ్యమైన పాత్రలను పోషించారు. పోలీస్ ఆఫీసర్ గా చైతూ నటించిన ఈ సినిమా. ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనేది చూడాలి.