Health

నపుంసకత్వం ఎందుకు వస్తుంది. నివారణ చర్యలు ఇవే…

నపుంసకత్వం ఎందుకు వస్తుంది. నివారణ చర్యలు ఇవే…

పురుషుల్లో చిన్నవయసు పెద్దవయసు అనే తేడా.లేకుండా అధికశాతం మంది నపుంసకత్వానికి గురౌతున్నారు._*

@ ఎన్నిరకాల మందులు వాడుతున్నా ఎంతమంది వైద్యుల చుట్టు తిరుగుతున్నా)సమస్య నుండి బయటపడలేకపోతున్నారు.

🌝 నపుంసకత్వానికి అసలు కారణం తమజీవన విధానంలో తమ ఆహార సేవనలో వచ్చిన మార్పులేనని తెలుసుకోలేక పోతున్నారు.

🌝 ప్రకృతికి వ్యతిరేకంగా రాత్రిపూట ఆలస్యంగా నిద్రించడం,ఉదయం ఆలస్యంగా నిద్రలేవడంతో శరీరాన్ని కాపాడే వాత, పిత్త, కఫ దోషాలు అసమానమై నపుంసకత్వానికి బీజం వేస్తున్నాయి.

🌝 ఉదయం భోజనం చేయడం మాని, ఇంగ్లీషువాళ్ళలాగా అల్పా హారాలు తింటూ మధ్యాహ్నం భుజించడం. అది త్వరగా అరగక రాత్రిపూట ఆలస్యంగా తినడం అనే విరుద్ధ ఆహార సేవనవిధానం శరీరాన్ని పోషించే సప్తధాతువులను సారహీనంచేసి వీర్యధాతువును బలహీనపరచి నపుంసకత్వానికి దారితీస్తుంది.

🌝 శక్తిహీనమైన తెల్లబియ్యం, ప్యాకెట్పాలు, నూనె, నెయ్యిలేని నిస్సారపు తిండి, అతికారం, అతిపులుపు అమితంగా సేవించడం, వంటి కారణాలతో వీర్యహీనులై నపుంసుకులౌతున్నారు.

🌝 వివాహానికి ముందే అధికశాతంమంది ముష్టిమైధున దురలవాటుకు లోనై యౌవన ప్రాయంలోనే పురుషత్వాన్ని కోల్పోతున్నారు.

🌝 వివాహమైన తొలిరోజులలో అతిగా సంభోగంలో పాల్గొన డంవల్ల, ఆకలిగా వున్నప్పుడు, దాహంతో వున్నప్పుడు, శరీరం అల సిపోయి నప్పుడు, . భోజనంచేసినవెంటనే సంభోగంలో పాల్గొంటూ చాలామంది పురుషులు వారి పతనానికి వారే కారకులౌతున్నారు.

🌝 పురుగులమందులతో, విషరసాయన ఎరువులతో పండిన విష పదార్థాలను సేవిస్తూ క్రమంగా సర్వాంగాలు వికృత విషాలతో నిండిపోయి నపుంసకత్వానికి లోనౌతున్నారు.

🌹పురుషత్వానికి పుట్టెడు మార్గాలు :

🌝 మార్కెట్లో దొరికే తాత్కాలిక రతిప్రేరక ప్రమాదకర ఔషధాలు వాడితే ఆ అసహజ పద్ధతి వల్ల భవిష్యత్తులో శాశ్వతనపుంసకత్వం ఏర్పడే అవకాశముంటుంది కాబట్టి అవి శ్రేయస్కరం కావు.

🌝రాత్రి పది గంటలలోపుగా నిద్రించడం, ఉదయం ఐదు గంటలలోపుగా మేల్కొనడం మొదలుపెట్టాలి.

🌝 ఉదయం పదిగంటలలోపుగా మొదటిభోజనం. మధ్యాహ్నం తగిన అల్పాహారం, రాత్రి ఎనిమిదిగంటలలోపుగా రెండవభోజనం ముగించి కనీసం రెండుగంటలాగే నిద్రించడం. అలవాటుచేసుకోవాలి.

🌝 ఉదయం లేవగానే రాగిచెంబులోని నీరుతాగి కాలకృత్యాలు తీర్చు కొని ఒంటికి గోరువెచ్చని నువ్వులనూనె మర్దనచేసి, అరగంటపాటు ఆసనాలు, పావుగంటసేపు ప్రాణాయామం,పావుగంటసేపు ధ్యానం చేయడం ప్రారంభించాలి.

🌝 ఆహారంలో తక్కువ పాలిష్ పట్టిన బియ్యంతో వండిన అన్నం, నూనెతో వండిన కూరలు, నెయ్యి, పాయసం, నేతిగారెలుతినాలి.

🌝 తీపిపదార్ధాలలో నువ్వులఉండలు, కొబ్బరిఉండలు, మినప సున్నుండలు, అరిశలు, బూరెలు, బొబ్బట్లు మొదలైనవి తినాలి. పచ్చి కొబ్బరి బెల్లం రోజు తినండి. నువ్వు లడ్డులు వేరుశనగ లడ్డులు.

🌝 ఋతుభేదాలను బట్టి శారీరకశక్తి మారుతుంటుంది. కాబట్టి వర్షాకాలంలో వారానికి రెండుసార్లు. చలికాలంలో రోజుకు ఒకసారి వేసవికాలంలో వారానికి ఒకసారి మాత్రమే సంభోగంలో పాల్గొనాలి.

–Dr.M Ashok Vardhan Reddy MD (Ayurveda)