DailyDose

TNI. నేటి నేర వార్తలు..

TNI. నేటి నేర వార్తలు..

* Btech రవి నీ అదుపులో కి తీసుకొన్న పోలీస్ లు.

* చెన్నై: తమిళనాడులో NIA సోదాలు.. చెన్నై, తిరుచ్చి, మధురై, తేనె జిల్లాలో కొనసాగుతున్న NIA అధికారుల సోదాలు
#Chennai #NIARaids

* హైదరాబాద్: చికోటి ప్రవీణ్ కు మరోసారి ఈడీ నోటీసులు.. క్యాసినో కేస్ లో గతంలో చికోటి ప్రవీణ్ ను విచారించిన ఈడీ…తాజాగా థాయిలాండ్ ఘటన తరువాత మరోసారి ఈడీ నోటీసులు.. చికోటితో పాటు చిట్టి దేవేందర్, సంపత్, మాధవ రెడ్డి లకు ఈడీ నోటీసులు..

#ED #Chikotipraveen #Thailand

* పార్టీలకు అతీతంగా ప్రజలకు పథకాలు అందాలి

ప్రజలకు సేవలందించేందుకే నేను ఈ స్థానంలో ఉన్నా

టోల్‌ ఫ్రీ నెంబర్‌-1902కు కాల్‌ చేస్తే పరిష్కారం

వ్యవస్థలో మార్పు తీసుకొచ్చేందుకు ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం

క్యాంపు కార్యాలయం నుంచి లాంఛనంగా కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సంతృప్త స్థాయిలో విన­తుల పరిష్కారమే లక్ష్యంగా ప్రజలకు నిర్ణీత గడువులోగా నాణ్యమైన ప్రభుత్వ సేవలందించే ఉద్దేశంతో ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం శ్రీకారం చుట్టారు. క్యాంపు కార్యాలయం నుంచి ఈ కార్యక్రమాన్ని సీఎం లాంఛనంగా ప్రారంభించారు. ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా 1902 టోల్‌ ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేశారు.

‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి ఇది మంచి వేదిక అవుతుందని, ప్రభుత్వ సేవలను పొందడంలో అడ్డంకులకు పరిష్కారం అన్నారు. ప్రజలకు సేవ అందించేందుకే నేను ఈ స్థానంలో ఉన్నాను. ఫిర్యాదు నమోదు చేసిన వెంటనే వైఎస్సార్‌ ఐటీ కేటాయింపు. ఐవీఆర్‌ఎస్‌, ఎస్‌ఎంఎస్‌ ద్వారా ఫిర్యాదు స్టేటస్‌. ప్రత్యక్షంగా సీఎం కార్యాలయం పర్యవేక్షణ ఉంటుందని, అధికారులంతా ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతారన్నారు.

లంచాలకు, వివక్షకు తావు లేకుండా పథకాల అమలవుతాయని, స్పందన ద్వారా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నామన్నారు. ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశా మని, పరిపాలనలో ప్రజలను భాగస్వాములను చేస్తున్నామని, ప్రజలకు పాలన మరింత చేరువయ్యే దిశగా చర్యలు చేపట్టామని, ప్రతి సమస్యకు పరిష్కారం వెతికే దిశగా పాలన సాగుతోందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ పాలనలో లంచాలు, వివక్ష ఉండేదని, ప్రతీ మంచి పనికి కూడా మాకు ఎంతిస్తారనే గుణం టీడీపీదన్నారు. టీడీపీ హయాంలో ఇళ్ల పట్టాలు ఇచ్చిన దాఖలాలు కూడా లేవని, తమ పార్టీకి చెందిన వ్యక్తులకు మాత్రమే సంక్షేమ పథకాలు ఇచ్చే వారన్నారు. తన పాదయాత్రలో ప్రజల సమస్యలను గమనింఛానని, పార్టీలకు అతీతంగా ప్రజలకు పథకాలు అందాలన్నారు. వ్యవస్థలో మార్పు తీసుకొచ్చేందుకు ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడించారు.

జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్‌లకు ఆహ్వానం : జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల పరిషత్‌ కార్యాలయాలతో పాటు గ్రామ సచివాలయాలు / రైతు భరోసా కేంద్రాల్లో ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు చేయాలని జడ్పీ సీఈవోలు, డీపీవోలకు పంచాయతీరాజ్‌ శాఖ ఆదేశాలు జారీ చేసింది. స్థానిక జడ్పీటీసీకి ఈ సమాచారాన్ని అందచేయడంతోపాటు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని పేర్కొంది. గ్రామ సచివాలయాల్లో నిర్వహించే కార్యక్రమానికి స్థానిక సర్పంచ్, ఎంపీటీసీలను ఆహ్వానించాలని సూచించింది.

* AP: IAS కృష్ణబాబు, IPS ద్వారకా తిరుమలరావులకు హైకోర్టులో ఊరట లభించింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఉద్యోగుల సర్వీసు క్రమబద్ధీకరణపై కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారంటూ ఎంటీ కృష్ణబాబు, ద్వారకా తిరుమలరావులకు కోర్టు ధిక్కరణ కింద సింగిల్ బెంచ్ శిక్ష వేసింది. 16లోగా రిజిస్ట్రార్ ముందు లొంగిపోవాలని ఆదేశించింది.

* ఎన్టీఆర్ జిల్లా :

తిరువూరు జాతీయ రహదారి (NH-30)పై సత్తుపల్లి ఆర్టీసి డిపో బస్సుకు తప్పిన ఘోర ప్రమాదం..

బైపాస్ ఏఎంసి కార్యాలయ సమీపంలో హైవేపై గేదెలు బస్సుకు ఎదురుగా ఢీ కొనడంతో తప్పిన ప్రమాదం..

ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురైన బస్సులోని ప్రయాణికులు..

ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రెండు గేదెలు సంఘటన స్థలంలోనే చనిపోగా.. అదే సమయంలో బస్సు వెనుక నుండి వచ్చిన మరో కారు గేదెలను ఢీ-కొన్న వైనం..

కారును సైతం చాకచక్యంగా కంట్రోల్ చేసిన డ్రైవర్.. కారు ముందు భాగం పూర్తిగా ద్వంసం..

వెరసి జాతీయ రహదారి కావడంతో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఎస్సై-2 పద్మారావు..

* Pakistan

మిలటరీ అదుపులో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్

ఇమ్రాన్ ఖాన్ ను అదుపులోకి తీసుకున్న పాకిస్థాన్ పారా మిలటరీ బలగాలు..

అవినీతి కేసులో ఇస్లామాబాద్ కోర్టుకు హాజరయ్యేందుకు వచ్చిన ఇమ్రాన్ ఖాన్..

కోర్టు ప్రాంగణంలో ఇమ్రాన్ ను అదుపులోకి తీసుకున్న మిలటరీ బలగాలు..

* కొత్త తరహాలో తరలిస్తున్న 20 బాక్సుల కర్ణాటక మద్యం ను స్వాధీనం పరుచుకున్న కౌతాళం పోలీసులు

ఈ దినము రాబడిన సమాచారం మేరకు కోసిగి మండలం కడిదొడ్డి గ్రామానికి చెందిన బండేప్ప అనే వ్యక్తి కర్ణాటక రాష్ట్రం రాయచుర్ జిల్లా మాన్వి టౌన్ నుండి అక్రమంగా కర్ణాటక మద్యం తుంగభద్ర నది మీద తెప్ప మీద తీసుకొస్తుండుగా బండేప్ప నదిలో పారిపోగా, అతను అక్రమంగా తరలిస్తున్న 90 Ml పరిమాణం గల 1,094 (20బాక్షులు) ఒరిజినల్ ఛాయిస్ డీలక్స్ విస్కీ కర్ణాటక టెట్రా ప్యాకెట్లు ఎస్సై టీ నరేంద్ర కుమార్ రెడ్డి గారు మరియు వారి సిబ్బంది మల్లికార్జున,రంగన్న, హుస్సేని, నరేంద్ర మరియు నాగరాజు ల సహాయంతో పట్టుకొని సదరు 1,094 టెట్రా ప్యాకెట్లను మరియు తుంగభద్ర నది దాటడానికి ఉపయోగించిన తెప్పను స్వాధీన పరచుకొని కేసు నమోదు చేయడమైనది. కావున కర్ణాటక ఎలక్షన్స్ ను దృష్టిలో ఉంచుకొని ఎవరైనా కర్ణాటక మద్యం కల్గి ఉన్నా, అమ్మినా, సరఫరా చేసిన అలాగే ఆంధ్ర రాష్ట్రము నుండి కూడా కర్ణాటక వైపు మద్యం, డబ్బులు వంటి వస్తువులు తరలించిన వారి పై చట్టపరమైన చర్యలు తీసుకొనబడునని కౌతాళం ఎస్సై నరేంద్ర కుమార్ రెడ్డి తెలిపారు.