Health

డయాబెటిస్ ఉన్నవారు మామిడి పండు తింటే ఏమి అవుతుందో తెలుసా?

డయాబెటిస్ ఉన్నవారు మామిడి పండు తింటే ఏమి అవుతుందో తెలుసా?

డయాబెటిస్ ఉన్నవారు జీవితకాలం మందులు వాడవలసిందే. అలాగే తీసుకొనే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే డయాబెటిస్ ఉన్నవారిలో ఆహారం కూడా కీలకమైన పాత్రను పోషిస్తుంది. ఇప్పుడు ఈ వేసవికాలంలో మామిడి పండ్లు విరివిగా లభిస్తాయి. డయాబెటిస్ ఉన్నవారు మామిడి పండు తింటే ఏమి అవుతుందో తెలుసుకుందాం.

మామిడి పండులో చక్కెర 15 శాతం ఉంటుంది. చక్కెర శాతం ఎక్కువగా ఉన్న ఈ పండును తినటం డయాబెటిస్ ఉన్నవారికి మంచిది కాదని నిపుణులు అంటున్నారు. ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల తినాలని విపరీతమైన కోరిక ఉంటే మాత్రం చాలా తక్కువ మోతాదులో తీసుకోవాలని చెప్పుతున్నారు.

ఒకవేళ్ళ ఎక్కువగా తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు బాగా పెరిగిపోతాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు. కొంతమంది పెరుగులో కలిపి మామిడి పండును తింటూ ఉంటారు. ఇలా డయాబెటిస్ ఉన్నవారు అసలు తినకూడదు. వీటిలో ఉండే కేలరీలు శరీరంలో చక్కెర శాతాన్ని పెంచుతాయి. డయాబెటిస్ ఉన్నవారు గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉన్న పండ్లకు ధురంగా ఉంటేనే మంచిది.

డయాబెటిస్ ఉన్నవారు తప్పనిసరిగా ఆహారంలో విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పుడు షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉండేలా చూసు కోవాలి. ప్రతి రోజు వ్యాయామం చేయాలి. డయాబెటిస్ ని నియంత్రణలో ఉంచే ఆహారాన్ని తీసుకోవాలి.