Movies

మరో లవ్ స్టొరీ ప్లాన్ చేసిన ప్రభాస్.. లైన్ లోకి టాలెంటెడ్ దర్శకుడు.. కాంబో సెట్టయ్యేనా?

మరో లవ్ స్టొరీ ప్లాన్ చేసిన ప్రభాస్.. లైన్ లోకి టాలెంటెడ్ దర్శకుడు.. కాంబో సెట్టయ్యేనా?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్ రంగంలో మంచి క్రేజ్ అందుకుంటూ అతి తక్కువ కాలంలోనే నెంబర్ వన్ స్టార్ గా మారిపోయాడు. అద్భుతంగా నటిస్తూ అందరి చేత ఆహా అనిపించే ప్రభాస్.. 20 ఏళ్లుగా టాలీవుడ్ ను ఏలుతూనే ఉన్నారు. ముఖ్యంగా బాహుబలి చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా మారి వరుస చిత్రాలతో దూసుకెళ్తున్నాడు. ఇక బిగ్ బడ్జెట్ సినిమాలు మాత్రమే కాకుండా ప్రభాస్ విభిన్నమైన లవ్ కథలను కూడా సెలెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక రీసెంట్ గా మరో దర్శకుడితో లవ్ స్టొరీ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే.

సాహో, రాధే శ్యామ్ లు ఫ్లాప్ : బాహుబలి తర్వాత వచ్చిన సాహో, రాధే శ్యామ్ లు ఫ్లాప్ గా నిలిచినప్పటికీ.. దాన్ని గురించి పట్టించుకోకుండా పలు ప్రాజెక్టులకు సైన్ చేశారు. ప్రస్తుతం ఓ అరడజను సినిమాల్లో నటిస్తున్నారు. ఆది పురుష్ సినిమా షూటింగ్ పూర్తి అయిపోగా… ప్రాజెక్టు కే, సలార్ వంటి చిత్రాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు. ఈ సినిమాలు ఇంకా పూర్తి కాకముందే మరికొన్ని సినిమాలకు కూడా ఓకే చెప్పారు.

ఆసక్తికరమైన కాంబినేషన్ : మరో రెండు మూడు సినిమాలను ప్రభాస్ లైన్ లో పెట్టుకున్నారు. అందులో సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ కూడా ఉంది. ఈ ప్రాజెక్ట్ లో ప్రభాస్ ఒక పోలీస్ గా కనిపించనున్నాడు. ప్రస్తుతం ఆ దర్శకుడు ఎనిమల్ అనే సినిమా చేస్తున్నాడు. దాని తరువాత బన్నీ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఇక ప్రభాస్ స్పిరిట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు.