NRI-NRT

నాట్స్ ఆధ్వర్యంలో ఆన్‌లైన్ చెస్ టోర్నమెంట్‌కు అనూహ్య స్పందన…

నాట్స్ ఆధ్వర్యంలో ఆన్‌లైన్ చెస్ టోర్నమెంట్‌కు అనూహ్య స్పందన…

నాట్స్ ఆధ్వర్యంలో నేషనల్ ఛాంపియన్షిప్ USCF ర్యాంక్డ్ ఆన్లైన్ చెస్ టోర్నమెంట్ కు అనూహ్య స్పందన.

మే 16: తెలుగు భాష, సంస్కృతి తో పాటు సామాజిక ఔన్నత్యానికి ఎల్లవేళలా కృషి చేసే ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా నిర్వహించిన ఆన్‌లైన్ చెస్ టోర్నమెంట్‌కు అనూహ్య స్పందన లభించింది.

నాట్స్ జాతీయ స్థాయిలో యునైటెడ్ స్టేట్స్ చెస్ ఫెడరేషన్ భాగస్వామ్యంతో నాట్స్ యూఎస్‌సీఎఫ్ రాంక్‌డ్ చెస్ టోర్నమెంట్ నిర్వహించింది. నాలుగు విభాగాల్లో నిర్వహించిన ఈ టోర్నమెంటులో చెస్ ప్లేయర్స్ ఎంతో ఉత్సాహంగా పాల్గొని పోటీ పడ్డారు. ఈ పోటీల్లో విజేతలను చెస్ డాట్ కామ్ ద్వారా ప్రకటించడం జరుగుతుంది.. ఈ చెస్ టోర్నమెంట్‌లో విజేతలకు నాలుగు విభాగాల్లో బహుమతులు అందచేస్తామని నాట్స్ తెలిపింది.

విద్యార్థులలో మేధస్సును, జ్ఞాపకశక్తిని, ఏకాగ్రతను పెంపొందించే అద్భుతమైన ఇండోర్ గేమ్ చదరంగం. చదరంగం ఆడడం వల్ల సమస్యల్ని పరిష్కరించే నైపుణ్యం, పథకం ప్రకారం పని చేయడం, మరియు దూరదృష్టి అలవాడతాయి. మన దేశంలో పుట్టి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిన చెస్ ప్రయాణంలో మలుపులు, విశేషాలు బోలెడు….
కళ్ళ ముందు కనిపించేది నలుపు, తెలుపు గడులే……. కానీ ఒక్కసారి పావుల్ని కదపడం మొదలుపెడితే…. ఆటగాడు తనని తాను మరచిపోతాడు.

రాజ్యాలు లేని రాజులు…. రాణులు …..వారి సైన్యాలు ….. అదో రణరంగం.
మొదటి ఎత్తు నుంచి ఆఖరి ఎత్తు వరకు హోరాహోరీగా సాగే పోరాటం. మెదడుకు పని చెబుతూ…… వ్యూహాలకు పదును పెడుతూ…. 64 గళ్ళల్లో అనంతమైన యుద్ధ తంత్రాన్ని ఆవిష్కరించే అత్యద్భుతమైన ఆట చెస్.
ఈ చదరంగం టోర్నమెంట్ కోసం అమెరికాలోని అన్ని రాష్ట్రాల నుండి అత్యధిక సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి.
అంతర్జాల వేదికగా USCF (యునైటెడ్ స్టేట్స్ చెస్ ఫెడరేషన్) భాగస్వామ్యంతో NATS (నార్త్ అమెరికా తెలుగు సొసైటీ) May 6th , 2023 న NATS National USCF Ranked Chess Tournament నాలుగు విభాగాలలో నిర్వహించింది.
U400 (గ్రేడ్ K-3): $100
U600 (గ్రేడ్‌లు K-12): $250
U900 (గ్రేడ్‌లు K-12): $500
ఓపెన్ ఛాంపియన్‌షిప్: $750

ఈ చెస్ టోర్నమెంట్ లో 80 కి పైగా అభ్యర్థులు మరియు ఓపెన్ ఛాంపియన్షిప్ కోసం కొంతమంది FIDE మాస్టర్స్ కూడా ఈ పోటీలో పాల్గొన్నారు.విద్యార్థుల యొక్క ప్రతిభను మరియు నైపుణ్యాలను ప్రదర్శించేందుకు వేదికను అందించడమే NATS ప్రధాన ఉద్దేశ్యము.

ఆన్‌లైన్ ద్వారా నిర్వహించిన ఈ చదరంగ పోటీల నిర్వహణలో నాట్స్ ప్రెసిడెంట్ బాపయ్య చౌదరి(బాపు) నూతి, స్పోర్ట్స్ చైర్ దిలీప్ సూరపనేని కీలక పాత్ర పోషించారు. ఈ టోర్నమెంట్ విజయానికి చిలుకూరి శ్రీనివాస్, గౌతమ్ పెండ్యాల, రామకృష్ణ జిల్లెలమూడి, మనోహర్ మద్దినేని, కిరణ్ ఇమ్మడిశెట్టి తదితరులు తమ వంతు కృషి చేశారు. నాట్స్ ఆన్‌లైన్ చెస్ టోర్నమెంట్ దిగ్విజయంగా నిర్వహించినందుకు నాట్స్ చైర్ విమెన్ అరుణ గంటి నాట్స్ క్రీడా విభాగ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.