Movies

పవన్ “ఓజీ” రిలీజ్ డేట్ ఫిక్స్..

పవన్ “ఓజీ” రిలీజ్ డేట్ ఫిక్స్..

పవర్‌ఫుల్ కాంబినేషన్‌లో రాబోతున్న ‘OG’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) మూవీకి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్‌ను ముంబై నగరంలో మొదలు పెట్టారు. అక్కడ పవన్ కల్యాణ్ సహా కొందరు సినీ ప్రముఖుల కాంబినేషన్‌లో కీలకమైన సీన్స్‌ను షూట్ చేశారు. అలాగే, ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను కూడా కంప్లీట్ చేసుకున్నారు. అవన్నీ అద్భుతంగా వచ్చినట్లు తెలిసింది. అంతేకాదు, మిగిలిన భాగాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసేలా చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకుందని తెలిసింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి ఓ సర్‌ప్రైజింగ్ న్యూస్ లీక్ అయింది.

పవన్ కల్యాణ్ హీరోగా.. సుజిత్ తెరకెక్కిస్తోన్న ‘OG’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) మూవీని వచ్చే ఏడాది రిలీజ్ చేసే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాను ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారట. అంతేకాదు, దీన్ని క్రిస్మస్ కానుకగా మూడు రోజుల ముందుగానే అంటే డిసెంబర్ 22వ తేదీన గ్రాండ్‌గా విడుదల చేయనున్నారని తెలిసింది. శుక్రవారం నుంచి సోమవారం వరకూ సెలవులు ఉండడం వల్లే చిత్ర యూనిట్ ఈ నిర్ణయం తీసుకుందని ఫిలిం నగర్ ఏరియాలో టాక్ వినిపిస్తోంది.

ఇదిలా ఉండగా, పవన్ కల్యాణ్ – సుజిత్ కాంబోలో రూపొందుతోన్న ఈ సినిమాను RRR ప్రొడ్యూసర్ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దానయ్య నిర్మిస్తున్నారు. అలాగే, ఈ చిత్రానికి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రవి కే చంద్రన్ పని చేస్తున్నారు. ఇందులో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా చేస్తోంది. ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు.