ప్రధాని మోదీ పర్యటనకు ముందు రాహుల్ గాంధీ న్యూయార్క్‌లోని మాడిసన్ స్క్వేర్‌లో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలుస్తుంది. రాహుల్ మే 31 నుంచి 10 రోజుల పాటు అమెరికాలో పర్యటించనున్నారు. ఈ క్రమంలోనే న్యూయార్క్ మాడిసన్ స్క్వేర్‌లో రాహుల్ గాంధీ.. దాదాపు 5 వేల మంది ఎన్నారైలతో ర్యాలీ నిర్వహించాలని చూస్తున్నారని తెలుస్తుంది. అలాగే.. రాహుల్ గాంధీ.. వాషింగ్టన్, కాలిఫోర్నియాలను సందర్శించనున్నారు. అక్కడ ప్యానెల్ చర్చలో పాల్గోననున్నారు.