Editorials

నేడు చలం జయంతి ప్రత్యేక కథనం…

నేడు  చలం జయంతి ప్రత్యేక కథనం…

చలం గారు 100 కి పైగా చిత్రాల్లో కథానాయకుడిగా, హాస్యనటుడిగా, సహాయనటుడిగా నటించారు. ఈయన అసలు పేరు కోరాడ సూర్యాచలం. రమణకుమారిని వివాహం చేసుకున్న తర్వాత తన పేరును రమణాచలం అని మార్చుకొన్నారు. ఆంధ్రా దిలీప్ కుమార్ అని ఆంధ్రలోకం అభిమానాన్ని అందుకున్న ఘనత కూడా చలం గారికే దక్కింది. తెరపై ఎప్పుడు యాక్టివ్ గా కనిపించే చలం, నిజ జీవితంలో మాత్రం చాలా నిదానం. అందరికీ ఎంతో మర్యాద ఇచ్చేవారు. సినిమాల పై కూడా ఆయనకు అపారమైన నాలెడ్జి ఉండేది. ముఖ్యంగా సినిమాకి పాటలు ప్రాణం అని చలం భావించే వారు.

అందుకే, చలం గారి సినిమాల్లోని పాటల్లో దాదాపు హిట్లే కనిపిస్తాయి. పైగా నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా చలంగారు రాణించారు. కాకపోతే, సొంత బ్యానర్లో చేసిన కొన్ని సినిమాలు దెబ్బతినడం వలన ఆర్ధికంగా బాగా చితికిపోయారు. డబ్బు పోయాక, ఆయన వైవాహిక జీవితంలోనూ ఎన్నో ఒడిదుడుకులు వచ్చాయి. నటి శారదతోనూ ఆయన కొన్నాళ్ళు కలిసి ఉన్నారు. ఆమెతో ప్రేమ కూడా విఫలమే అయ్యింది. దాంతో చలం గారు మానసికంగా బాగా నలిగిపోయేవారు. దీనికి తోడు విపరీతమైన మద్యం అలవాటు. దాంతో ఆరోగ్యపరంగా కూడా ఆయన ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఆయనకు చివరి రోజుల్లో చెప్పులు కూడా లేవు. రోజుకు ఒక పూట భోజనం