Sports

ఆర్​సీబీ చేతిలో చివరి 2 మ్యాచ్‌లు..

ఆర్​సీబీ చేతిలో చివరి 2 మ్యాచ్‌లు..

నేడు ఆర్​సీబీకి ఓడితే ఇంటికి..గెలిస్తే ప్లేఆఫ్కు ఛాన్స్..రాత్రి 7.30 నుంచి మ్యాచ్,ప్లేఆఫ్స్ రేసులో ఆర్సీబీకి విజయం కీలకం,ఇప్పటికే నాకౌట్ రేసు నుంచి తప్పుకున్న సన్‌ రైజర్స్.

నిన్న రాత్రి జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో పంజాబ్ కింగ్స్ ఓడిపోవడం ‌‌‌ఆర్సీబీకి ప్లస్ పాయింట్ కానుంది. ప్రస్తుతం ఆర్సీబీతో పాటు 13 మ్యాచ్ లు ఆడిన రాజస్థాన్, కేకేఆర్, పంజాబ్ 12 పాయింట్లతో ఉన్నాయి. ఆర్సీబీకి ఇంకా రెండు మ్యాచ్ లు మిగిలున్నాయి. సన్‌ రైజర్స్‌ తో పాటు గుజరాత్ టైటాన్స్‌ తో జరిగే చివరి మ్యాచ్‌ లో భారీ తేడాతో గెలిస్తే ఆర్సీబీ ప్లే ఆఫ్స్ చేరుకోగలదు.

ఈ నేపథ్యంలో సన్‌‌‌‌‌‌‌‌రైజర్స్‌‌‌‌‌‌‌‌పై భారీ విజయం సాధించాలని చూస్తోంది. ఈ పోరులో అందరి ఫోకస్ విరాట్‌‌‌‌‌‌‌‌ కోహ్లీపైనే ఉంది. కెప్టెన్‌‌‌‌‌‌‌‌ డుప్లెసిస్‌‌‌‌‌‌‌‌తో పాటు ఆర్‌‌‌‌‌‌‌‌సీబీ టాప్‌‌‌‌‌‌‌‌ స్కోరర్‌‌‌‌‌‌‌‌గా ఉన్న విరాట్‌‌‌‌‌‌‌‌ గత రెండు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో నిరాశ పరిచాడు. ఈ నేపథ్యంలో తనకు మంచి రికార్డున్న ఉప్పల్ స్టేడియంలో రెచ్చిపోవాలని చూస్తున్నాడు. మరోవైపు కోహ్లీ కోసం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ ఫ్యాన్స్‌‌‌‌‌‌‌‌ స్టేడియానికి పోటెత్తనున్నారు. మ్యాచ్ కోసం అందుబాటులో ఉంచిన టికెట్లన్నీ ఒక్క రోజులోనే అమ్ముడయ్యాయి.