Politics

బీజేపీ, కాంగ్రెస్ నేతల తెలంగాణ పర్యటన….

బీజేపీ, కాంగ్రెస్ నేతల తెలంగాణ పర్యటన….

తెలంగాణ ఎన్నికలపైనే బీజేపీ నేతల దృష్టి పడింది. ఇది ఎన్నికల ఏడాది కావడంతో రాష్ట్రంలో బీజేపీ నేతలు విస్తృత పర్యటనలకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా , కేంద్ర హోంమంత్రి అమిత్ షా త్వరలో పర్యటించేందుకు షెడ్యూల్ ఖరారైంది.

జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల 30న ప్రారంభం కానున్న మహాజన్ సంపర్క్ అభియాన్‌లో భాగంగా తెలంగాణలో నిర్వహించే రెండు బహిరంగ సభల్లో పాల్గొంటారు. అయితే నెల రోజుల పాటు మహాజన్ సంపర్క్ అభియాన్ నిర్వహించేందుకు బీజేపీ నిర్ణయించింది. మహాజన్ సంపర్క్ అభియాన్‌లో భాగంగా వివిధ రంగాల్లో లక్ష మంది ప్రముఖులతో చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రతి లోక్ సభ నియోజకవర్గం నుంచి ఇందుకోసం 250 మంది ప్రముఖులను ఎంపిక చేసినట్లు తెలిపారు.

ఇదిలా ఉంటే కాంగ్రెస్ నేతలు కూడా తెలంగాణ ఎన్నికలపై భారీ ప్లాన్ చేస్తోంది. కర్ణాటకలో బీజేపీని చిత్తు చేసిన కాంగ్రెస్ పార్టీ ఆ నేతలు కూడా పర్యటించేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ , రాహుల్ గాంధీ జూన్ మొదటి వారంలో హైదరాబాద్‌కు రానున్నారు. దీంతో రాష్ట్రంలో రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి.