Health

వేళకు భోజనం చేయకపోతే…

వేళకు భోజనం చేయకపోతే…

మూడు పూటలా సమయానికి చక్కగా భోజనం చేస్తే.. ఎలాంటి అనారోగ్యం తలెత్తదని వైద్యులు చెబుతున్నారు. వాస్తవానికి ఈ గజిబిజి బ్రతుకుల ప్రపంచంలో ఇది పాటించడం కొంచెం కష్టమే అయినా ఇలా చేయడం వల్ల ఆరోగ్యంగా, ఆనందంగా మన జీవితాన్ని గడిపెయ్యొచ్చు. ఖాలీగా ఉన్న లేదా పనిలో బిజీగా ఉన్న సరే సమయానికి ఆహారం తీసుకోవటం మర్చిపోకూడదు. ఒక సమయం సందర్భం అంటూ లేకుండా ఎప్పుడుపడితే అప్పుడు భోజనం/ఆహారం తీసుకుంటే పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అవేంటో ఒకసారి మనము తెలుసుకుందాం.. అకాల భోజనం వల్ల కడుపులో క్రమక్రమంగా గ్యాస్ (అసిడిటి) సమస్య పెరిగి శరీర పటుత్వాన్ని కోల్పోవడం, జీర్ణ వ్యవస్థ పనితీరు మందగించడం వంటి పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అంతే కాకుండా.. అనోరెక్సియా, బలిమియా, బింగీ అనే వ్యాధులు సోకడానికి కూడా అకాల భోజనమే కారణం. ఈ వ్యాధులు మనషులను శారీరకంగా, మానసికంగా కుంగదీస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ వ్యాధులు మనుషులపై ఏయే ప్రభావాలు చూపుతాయే ఒక్కసారి పరిశీలిద్దాం. అనోరెక్సియా వ్యాధి సోకిన వ్యక్తి సాధారణ తన సాదారణ శరీర బరువులో 15 శాతం బరువును కోల్పోవడం జరుగుతుంది. ఓ క్రమ పద్ధతిలో ఆహారం తీసుకోకపోవడం వల్ల మహిళలో రుతుక్రమానికి (పీరియడ్స్) సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి.

బలిమియా, బింగీ వ్యాధి లక్షణాలలో చాలా సారూప్యత ఉంది. రెండు వ్యాధులు దాదాపుగా ఒకేరకమైన ఫలితాలనిస్తాయి. ఈ వ్యాధి సోకడం వల్ల శరీరానికి అధిక శ్రమ కలుగుతున్న భావన కలగడం, నీరసంగా అనిపించడం, వాంతులు కావడం వంటి పరిణామాలు సంభవిస్తాయి. ఇకపోతే బింగీ వ్యాధి ఫలితాలు కూడా బలీమియా వ్యాధి ఫలితాలనే చూపిస్తుంది. ఈ వ్యాధి సోకిన వారికి తీసుకున్న ఆహారం సక్రమంగా జీర్ణం కాకపోవడం జరుగుతుంది. కొందరు యువతీ, యువకులు తమ శరీరాలను నాజూగ్గా ఉంచుకోవడానికి కడుపు మాడ్చుకుంటుంటారు. ఇలా చేయడం వల్ల ఎక్కువగా ఈ వ్యాధులు సోకే ఆస్కారం ఉందని వైద్యు హెచ్చరిస్తున్నారు. ఇందుకు వేరే ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సలహా ఇస్తున్నారు. కాబట్టి సమయానికి కడుపు నిండా భోజనం చేసి ఆరోగ్యాంగా ఉండండని వారు సూచిస్తున్నారు.